Telegram యాప్ లో ఆటో-డెలిట్ ఫీచర్ ను ఉపయోగించడం ఎలా?

|

టెలిగ్రామ్ యాప్ లో ఇప్పుడు కొత్తగా మరొక ఫీచర్ ను జోడించింది. 'ఆటో డెలిట్' ఫీచర్ అనేది ఎవరైనా వినియోగదారులు పంపిన మెసేజ్ లను నిర్దేశించిన కొంత విరామం తర్వాత స్వయంచాలకంగా తొలగించడానికి అనుమతిస్తుంది. ఇది యాప్ యొక్క ఆండ్రాయిడ్ మరియు iOS రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ఇంతకుముందు సీక్రెట్ చాట్స్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు ఈ ఫీచర్ సాధారణ చాట్‌లకు కూడా అందుబాటులోకి వచ్చింది. టెలిగ్రామ్ వినియోగదారులు ఇప్పుడు అన్ని చాట్‌ల కోసం 24 గంటల నుండి 7 రోజుల మధ్య ఆటో-డిలీట్ టైమర్‌తో మెసేజ్ ను పంపవచ్చు.

How to Use Auto-Delete Message New Feature in Telegram App

ఆటో-డెలిట్ ఫీచర్ ఎలా పని చేస్తుంది

*** వినియోగదారులు ఇప్పుడు తమకు నచ్చిన వారికి మెసేజ్ ను పంపే ముందు టైం ఫ్రేమ్‌ను ఎంచుకునే ఎంపికను పొందుతారు. టైం సెట్ చేసిన విరామం తరువాత మెసేజ్ స్వయంచాలకంగా పంపినవారి మరియు రిసీవర్ యొక్క చాట్ విండో రెండింటి నుండి అదృశ్యమవుతుంది.

*** ఈ ఫీచర్ వ్యక్తిగత చాట్‌లతో పాటు గ్రూప్ చాట్‌లలోను కూడా పనిచేస్తుంది. ఏదేమైనా గ్రూప్ చాట్‌లలో ఈ ఫీచర్ ను ప్రారంభించడానికి లేదా నిలిపివేయడానికి నిర్వాహకులకు మాత్రమే అనుమతి ఉంటుంది.

*** టైమర్‌తో పంపిన అన్ని మెసేజ్లు ఎంత సమయం మిగిలి ఉన్నాయో కౌంట్‌డౌన్ ను చూపిస్తుంది. ఆండ్రాయిడ్‌లోని ఐకాన్‌పై నొక్కడం ద్వారా మరియు iOS లో మెసేజ్ ను నొక్కి ఉంచడం ద్వారా కూడా వినియోగదారులు దీన్ని తనిఖీ చేయవచ్చు.

*** ఈ ఫీచర్‌ను ఆన్ చేసిన తర్వాత పంపిన మెసేజ్ లకు మాత్రమే ఆటో-డిలీట్ ఫీచర్ వర్తిస్తుందని గమనించండి. మిగిలిన ఇతర మెసేజ్ లు దీనికి ప్రభావితం కావు.

*** ఇదే కాకుండా టెలిగ్రామ్ కొన్ని ఇతర ఫీచర్లను కూడా యాప్ కి జోడించింది. వీటిలో ఆహ్వాన లింకులు, ఆహ్వానాల కోసం QR కోడ్స్, బ్రాడ్ కాస్ట్ గ్రూప్ వంటివి మరిన్ని ఉన్నాయి.

Best Mobiles in India

English summary
How to Use Auto-Delete Message New Feature in Telegram App

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X