గూగుల్ పేలో మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్లను యాడ్ చేయడం ఎలా ?

By Gizbot Bureau
|

టెక్‌ దిగ్గజం గూగూల్‌ భారత్‌ పేమెంట్స్‌ మార్కెట్‌లో వాటాను మరింత పెంచుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే తన పేమెంట్స్‌ యాప్‌ గూగుల్‌ తేజ్‌ను గూగుల్ పేగా రీబ్రాండ్‌ చేసింది. ఈ యాప్‌కి కొత్త ఫీచర్లను జతచేసింది. బ్యాంక్‌ ఒప్పందాలతో యాప్‌ సేవలను కూడా విస్తరించింది. దీంతో పాటుగా గూగుల్‌ పే కస్టరమ్లకు ప్రి-అప్రూవ్‌డ్‌ రుణాలను తక్షణం అందించేందుకు పలు ప్రైవేట్‌ బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. గూగుల్‌ పే యాప్‌ ఉపయోగిస్తున్నవారు త్వరలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ నుంచి రుణాలు పొందొచ్చు. గూగుల్‌ పే సేవలను ఇతర దేశాలకు కూడా విస్తరించే లక్ష్యంతో పనిచేస్తోంది గూగుల్. ఇప్పుడు 2.2 కోట్ల మంది యాక్టివ్‌ యూజర్లు గూగుల్‌ పే యాప్‌ను ఉపయోగిస్తున్నారు. యాప్‌ ఆవిష్కరణ దగ్గరి నుంచి 75 కోట్లకుపైగానే లావాదేవీలు నమోదయ్యాయి. 2,000 ఆన్‌లైన్‌ మార్చంట్లు, ఈ-కామర్స్‌ వెబ్‌సైట్స్‌లో, 15,000కుపైగా రిటైల్‌ స్టోర్లలో గూగుల్‌ పే సేవలు వినియోగించుకుంటున్నారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న గూగుల్ పేలో రెండు మూడు బ్యాంకు అకౌంట్లు ఎలా యాడ్ చేుకోవాలో చాలామందికి తెలియదు. ఈ శీర్షికలో భాగంగా గూగుల్ పేలో బ్యాంకు అకౌంట్లు ఎలా యాడ్ చేయాలో వివరణ ఇస్తున్నాం. ఓ లుక్కేయండి.

గూగుల్ పేలో మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్లను యాడ్ చేయడం ఎలా ?

 

స్టెప్ బై స్టెప్ ప్రోసెస్

  1. ముందుగా మీ స్మార్ట్ ఫోన్ నుండి గూగుల్ పే యాప్ ఓపెన్ చేయండి. రైట్ కార్నర్ లో మూడు డాట్లు కనిపించే చోటుకు వెళ్లండి. అక్కడ కనిపించే పేమెంట్ మెథడ్స్ ని ట్యాప్ చేయండి
  2. ట్యాప్ చేసిన తరువాత అక్కడ మీకు యాడ్ బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి.
  3. ఆ తరువాత మీకు అనేక బ్యాంకుల పేర్లు కనిపిస్తాయి. మీరు ఏ బ్యాంకు అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంకు అకౌంట్ ని సెలక్ట్ చేసుకోండి. అలాగే అక్కడ మీరు మీ బ్యాంక్ కార్డు నంబరులో చివరి ఆరు అంకెలు అలాగే ఎక్సపయిరీ తేదీని ఎంటర్ చేయండి.
  4. ఆ తర్వాత మీ బ్యాంకు వివరాలను యాప్ వెరిఫై చేస్తుంది. అన్ని కరెక్ట్ గా ఉంటే మీ బ్యాంకు అకౌంట్ యాడ్ ప్రాసెస్ పూర్తి అయినట్లుగా కనిపిస్తుంది. తర్వాత మీరు పిన్ క్రియేట్ చేసుకోండి.
  5. తర్వాత మీరు కొత్త యూపిఐ పిన్ క్రియేట్ చేసి కన్ఫర్మ్ బటన్ నొక్కండి. ఈ పిన్ తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే లవాదేవీలకు ఇది చాలా ముఖ్యం.

మీరు ఎన్ని బ్యాంకు అకౌంట్లు యాడ్ చేసుకున్నా ప్రైమరీ అకౌంట్ కింద మీకు నచ్చిన బ్యాంకును యాడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు సెట్టింగ్స్ లో కెళ్లి అక్కడ పేమెంట్ మెథడ్ ని క్లిక్ చేయండి. అక్కడ మీకు ప్రైమరి అకౌంట్ అనే ఆప్సన్ కనిపిస్తుంది. మీరు యాడ్ చేసుకున్న బ్యాంకు అకౌంట్లలో నచ్చిన దాన్ని ట్యాప్ చేస్తే అది ప్రౌమరి అకౌంట్ గా సెట్ చేయబడుతుంది.

 
Most Read Articles
Best Mobiles in India

English summary
How to use multiple bank accounts in Google Pay

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X