Home
News

మీ పాత స్మార్ట్‌ఫోన్‌లను ఏం చేస్తున్నారు.. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..?

కొత్త స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసిన సమయాల్లో కొంత మంది వారి పాత హ్యాండ్‌సెట్‌లను పక్కన పెట్టేస్తుంటారు. అయితే అలాంటి పాత ఫోన్‌లను చిన్న చిన్న మార్పులు చేసి ఉపయోగించుకోవచ్చు. ఫలితంగా డబ్బు ఆదా చేయవచ్చు. మరియు ఇ- వేస్ట్‌ ను తగ్గించవచ్చు. కార్లలో డ్యాష్‌ క్యామ్‌లు చాలా మంది అమర్చుకుంటారు. ఏదైనా ప్రమాదాల సమయంలో సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి. అయితే మీ పాత ఫోన్‌లనే డ్యాష్‌ క్యామ్‌లు గా (Dash cam) ఉపయోగించుకోవచ్చు.

ఫలితంగా డ్యాష్‌ క్యామ్‌ కొనుగోలు కోసం చేసే ఖర్చును ఆదా చేయవచ్చు. దీంతోపాటు ప్రస్తుతం అనేక ఫోన్‌లు నాణ్యమైన కెమెరాలను కలిగి ఉంటున్నాయి. అందువల్ల డ్యాష్‌ క్యామ్‌తో సమానంగా వీడియోలను క్యాప్చర్‌ చేయగలుగుతుంది. అవసరమైన యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా సులభంగా మార్చుకోవచ్చు.

How to use old smartphone as dash cam in car or security cam in home details

మీ మొబైల్ ఇలా పనిచేస్తే చాలు :
మీరు కూడా మీ పాత ఫోన్‌ను డ్యాష్‌ క్యామ్‌గా మార్పు చేయాలనుకుంటున్నారా.. అయితే మీ మొబైల్‌ కొన్ని స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండాలి. తొలుత మీ ఫోన్‌ కెమెరా సరిగా పనిచేస్తుండాలి. మరియు యాప్‌లను సపోర్టు చేయాలి. ఫోన్‌ ఛార్జర్‌, మైక్రో SD కార్డును కలిగి ఉండాలి.

కారులో సరిగా అమర్చేందుకు స్టాండ్ ఉండాలి :
వీటితోపాటు కారులో డ్యాష్‌ క్యామ్ స్థానంలో ఫోన్‌ను అమర్చేందుకు వీలుగా స్టాండ్‌ ఏర్పాటు చేసుకోవాలి. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్‌ లోని అవసరం లేని యాప్స్‌ను డిలీట్‌ చేయాలి. ఫలితంగా అదనపు స్టోరేజీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఫోన్‌ ను అప్‌డేట్‌ చేయాలి.

రోడ్‌ వ్యూ స్పష్టంగా ఉండేలా అమర్చాలి :
ఫోన్‌లో తొలుత డ్యాష్‌ క్యామ్ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. డేటా అంతా స్టోర్‌ చేసే విధంగా స్టోరేజీని కలిగి ఉండాలి. రోడ్‌ వ్యూ స్పష్టంగా ఉండేలా కెమెరా మౌంట్‌ను (స్టాండ్‌) సరైన ప్రదేశంలో అమర్చాలి. ముఖ్యంగా ఫోన్‌ నిరంతరం ఛార్జింగ్‌ ఉండేలా ఏర్పాట్లు చేయాలి. అత్యవసర పరి‌స్థితుల్లో పవర్‌ బ్యాంక్‌ను అందుబాటులో ఉంచాలి.

అవసరం అయిన వీడియోలను సేవ్‌ చేసుకోవాలి :
అయితే ముఖ్యమైన వీడియోలను క్రమం తప్పకుండా కంప్యూటర్‌లో సేవ్‌ చేయాలి. ఫోన్‌ సపోర్టు చేసే స్టోరేజీ చిప్‌ను అమర్చాలి. క్రమం తప్పకుండా ఫోన్‌ పనితీరును తనిఖీ చేయాలి. ఈ విధంగా మీ పాత ఫోన్‌ను డ్యాష్‌ క్యామ్‌గా అమర్చుకోవచ్చు. ఫలితంగా ప్రమాదాల వంటి సమయాల్లో ఈ రికార్డింగ్‌ ఉపయోగపడుతుంది.

ఇంట్లో సెక్యూరిటీ కెమెరాగా వినియోగించుకోవచ్చు :
దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్‌లను ఇంట్లో సెక్యూరిటీ కెమెరాగా మార్చుకొనేందుకు కూడా అవకాశం ఉంది. ఫలితంగా కెమెరాల కొనుగోలు కోసం చేసే ఖర్చును ఆదా చేయవచ్చు. సెక్యూరిటీ కెమెరా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌, iOS స్టోర్‌లతో అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.

అనంతరం సెక్యూరిటీ కెమెరాగా ఉపయోగిస్తున్న మీ పాత ఫోన్‌ను మరియు మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న కొత్త హ్యాండ్‌సెట్‌కు కనెక్ట్‌ చేసుకోవడం ద్వారా రికార్డు అయిన వీడియోను చూసేందుకు వీలుంటుంది. తక్కువ ఖర్చుతో సెక్యూరిటీ కెమెరాను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్న వారికి ఇది ఉపయోగపడుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
How to use old smartphone as dash cam in car or security cam in home
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X