ఫేస్‌బుక్‌లో 'స్కైపీ‌'ని ఉపయోగించడం ఎలా..?

Posted By:

ఫేస్‌బుక్‌లో 'స్కైపీ‌'ని ఉపయోగించడం ఎలా..?

 

ప్రపంచంలో ఎక్కువ మంది యూజర్స్‌ని కలిగి ఉన్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌గా ఫేస్‌బుక్ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఫేస్‌బుక్ సుమారుగా 800 మిలియన్ల యూజర్స్‌ని కలిగి ఉంది. యూజర్స్ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకోని ఫేస్‌బుక్ ఎప్పుటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ని విడుదల చేస్తుంది. కొన్నినెలలు క్రితం ఫేస్‌బుక్ కొత్తగా వీడియో షేరింగ్ వెబ్‌సైట్ 'స్కైపీ' సేవలను యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ స్కైపీ ద్వారా ఫేస్‌బుక్ యూజర్స్ వారి యొక్క స్నేహితులతో వీడియో ఛాట్‌‌ని కొనసాగించవచ్చు.

ఫేస్‌బుక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఈ  'వీడియో ఛాట్'ని యూజర్స్ ఉపయోగించడం కూడా చాలా తేలిక. దీని కోసం యూజర్స్ చేయాల్సిందల్లా 'ఫేస్‌బుక్ ఛాట్ స్టేటస్'ని ఎల్లప్పుడూ 'ఆన్‌లైన్'లో ఉంచడమే. ఫేస్‌బుక్‌లో ఉన్న యూజర్ ఎవరైనా తన స్నేహితులతో వీడియో కాల్ ఛాట్‌ని చేయాలనుకున్నప్పుడు, అవతలి వైపు ఉన్న స్నేహితుడు ఆన్‌లైన్‌లో ఉన్నాడా లేదా అని చూడాలి.. అతను గనుక ఆన్‌లైన్‌లో ఉన్నట్లైతే ప్రొపైల్ పేజి కుడి భాగాన ఉన్న 'కాల్' బటన్‌పై క్లిక్ చేస్తే సరి.

మీరు పంపిన వీడియో కాల్‌ని మీ స్నేహితుడు గనుక రిసీవ్ చేసుకోనట్లేతే, వీడియో మేసేజిని కూడా పంపే వెసులుబాటుని కల్పించారు. మీరు పంపిన వీడియో మేసేజ్ మీ స్నేహితుని ఇన్‌బాక్స్‌లో ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot