Home
How to

IPL 2020 క్రికెట్ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో లైవ్ స్ట్రీమింగ్ పద్ధతిలో చూడడం ఎలా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క పదమూడవ సీజన్ అయిన IPL2020 ఈ రోజు అంటే సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కానున్నది. ఈ టోర్నమెంట్ మొదట మార్చి 29 న జరగాల్సి ఉండేది అయితే కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆలస్యంగా ఈ రోజు నుండి ప్రారంభం కానున్నది. మొత్తంగా 60 క్రికెట్ మ్యాచ్‌లు జరిగే ఈ ఐపీఎల్ 2020 సిరీస్‌లో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ రోజు మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తరంగా జరగనున్నది. గత సంవత్సరాల మాదిరిగానే స్టార్ స్పోర్ట్స్ ఐపిఎల్ మ్యాచ్‌లకు అధికారిక బ్రాడ్‌కాస్టర్. మరోవైపు డిస్నీ + హాట్‌స్టార్ ఈ టోర్నమెంట్‌కు "అధికారిక డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామిగా" వ్యవహరిస్తున్నది.

How to Watch IPL 2020 Cricket Matches Live Streaming Through Online

టీవీలలో అయితే IPL2020 క్రికెట్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ చానెళ్లలో చూడవచ్చు. కానీ ఏదైనా పని కారణాల ద్వారా లేదా ఇంటిలో ఆడవారు చూస్తున్న సీరియల్లను మధ్యలో ఆపకుండా ఉండడానికి డిస్నీ + హాట్‌స్టార్ యాప్ ద్వారా మీ యొక్క మొబైల్ ద్వారా చూడవచ్చు. IPL మ్యాచ్ లను ఆన్‌లైన్ చూడడానికి వీలు ఉంది. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

How to Watch IPL 2020 Cricket Matches Live Streaming Through Online

ఇండియాలో IPL 2020 ను ఆన్‌లైన్‌లో లైవ్ స్ట్రీమింగ్ పద్ధతిలో చూసే విధానం

IPL 2020 టోర్నమెంట్‌కు అధికారిక డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామిగా వ్యవహరిస్తున్న డిస్నీ + హాట్‌స్టార్‌లో ఐపిఎల్ యొక్క అన్ని మ్యాచ్‌లను లైవ్ టెలికాస్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో చూడవచ్చు. ఈ మీడియా స్ట్రీమింగ్ సర్వీస్ డిస్నీ + హాట్స్టార్ ప్రీమియం మరియు డిస్నీ + హాట్స్టార్ VIP వంటి రెండు వేర్వేరు సబ్స్క్రిప్షన్ల ద్వారా లభిస్తుంది. ఇందులో డిస్నీ + హాట్స్టార్ ప్రీమియం నెలకు రూ.299 ధర వద్ద మరియు సంవత్సరానికి రూ.1,499 ధరను కలిగి ఉంది. అలాగే రెండోది డిస్నీ + హాట్స్టార్ VIP యొక్క సబ్స్క్రిప్షన్ ధర సంవత్సరానికి రూ.399. క్రెడిట్ కార్డు ఉన్న వినియోగదారులు డిస్నీ + హాట్స్టార్ VIP చందాను రూ.395 ధరకే పొందవచ్చు. అదేవిధంగా జియో మరియు ఎయిర్‌టెల్ సంస్థలు వారి రీఛార్జ్ ప్లాన్‌ల జాబితాతో డిస్నీ + హాట్‌స్టార్ VIP యొక్క వార్షిక సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
How to Watch IPL 2020 Cricket Matches Live Streaming Through Online
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X