Home
News

iPhone 17 Series Launch ఇవాళే ఐఫోన్ 17 సిరీస్‌ విడుదల.. లైవ్‌ లింక్‌ సహా పూర్తి వివరాలు..!

iPhone 17 Series Launch : ఆపిల్ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 సిరీస్‌ ఇవాళ విడుదల కానుంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 10:30 గంటలకు ఈ లాంచ్‌ ఈవెంట్‌ ప్రారంభం కానుంది. ఆపిల్‌ పార్క్‌ లోని స్టీవ్‌ జాబ్స్‌ థియేటర్‌ లో ఈవెంట్‌ను (Apple Awe Dropping Event) నిర్వహించనున్నారు. ఆపిల్‌ వెబ్‌సైట్‌, ఆపిల్ అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌, ఆపిల్‌ టీవీ యాప్‌ ద్వారా లీవ్ చూడవచ్చు.

ఈ ఈవెంట్‌ లో ఐఫోన్ 17 సిరీస్‌, స్మార్ట్‌వాచ్‌, ఎయిర్‌పాడ్స్‌ లాంచ్‌ కానున్నాయి. ఐఫోన్ 17 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్‌, ఐఫోన్‌ 17 ప్రో, ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ లాంచ్ కానున్నాయి. వీటితోపాటు ఇతర ముఖ్యమైన ఉత్పత్తుల విడుదల, ముఖ్యమైన ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.

how to watch livestream of apple iphone 17 series launch event  expected specs and features

లైవ్‌ లింక్ :
గతంలో ఐఫోన్ సిరీస్‌లో భాగంగా ప్లస్‌ మోడల్‌ను లాంచ్ చేసేది. అయితే ఈ సంవత్సరం ప్లస్‌ మోడల్‌గా బదులుగా స్లిమ్‌ డిజైన్‌తో ఐఫోన్ 17 ఎయిర్‌ మోడల్‌ను లాంచ్‌ చేస్తోంది. ఆపిల్‌ Awe Dropping ఈవెంట్‌ యూట్యూబ్‌ లైవ్‌ లింక్‌ మీకోసం.

ఐఫోన్‌ 17 మోడల్‌ : ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో OLED డిస్‌ప్లే, ఆపిల్ కొత్త A19 చిప్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. గత సిరీస్‌తో పోలిస్తే అప్‌గ్రేడ్‌ కెమెరాలను కలిగి ఉంటుంది.

ఐఫోన్ 17 ఎయిర్‌ : ఈ ఫోన్ కేవలం 5.5 mm థిక్‌నెస్‌ను మాత్రమే కలిగి ఉండే అవకాశం ఉంది. 6.6 అంగుళాల డిస్‌ప్లే, టైటానియం ఫ్రేం, వెనుకవైపు 48MP కెమెరాను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. A19 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ : ఈ రెండు ప్రీమియం మోడల్స్‌గా రానున్నాయి. తేలికైన అల్యుమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటాయి. ప్రో మోషన్‌ OLED డిస్‌ప్లేతో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. A19 ప్రో చిప్‌సెట్‌ సహా గత సిరీస్‌తో పోలిస్తే భారీ బ్యాటరీతో లాంచ్‌ కానుందని అంచనా వేస్తున్నారు. కొత్తగా 48MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

how to watch livestream of apple iphone 17 series launch event  expected specs and features

ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ ప్రో 3 : ఈ ఎయిర్‌పాడ్స్‌ హెల్త్ ట్రాకింగ్‌ ఫీచర్‌లను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఇందులో హార్ట్ రేట్‌ సెన్సార్‌, టెంపరేచర్ సెన్సార్‌ వంటివి ఉంటాయని భావిస్తున్నారు. H3 చిప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

iOS 26 : ఐఫోన్ 17 సిరీస్‌ సహా ఇతర ఉత్పత్తుల విడుదల అనంతరం, iOS 26 ను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఐఫోన్ 17 సిరీస్‌ మినహా ఇతర డివైజ్‌లకు సెప్టెంబర్ 16 నుంచే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటే macOS 26, iPadOS 26, watchOS 26, tvOS 26, visionOS 26 కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
how to watch livestream of apple iphone 17 series launch event, expected specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X