Nothing Phone 1 లాంచ్ ఈరోజే!! లైవ్ స్ట్రీమ్ చూడాలా??

|

ప్రపంచవ్యాప్తంగా నథింగ్ ఫోన్ 1 ఈరోజు లాంచ్ కానున్నది. ఈ గ్లోబల్ లాంచ్ ఈవెంట్ భారతదేశంలో రాత్రి 8.30 గంటల IST సమయంలో కంపెనీ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఇటీవలి కొన్ని లీక్‌ల ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G+ SoC ద్వారా శక్తిని పొందుతూ ఉంటుంది. అలాగే ఇది 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండడమే కాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో మరొక గొప్ప విషయం ఏమిటంటే ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ముందు మరియు వెనుక ప్యానెల్‌లు రెండు కూడా గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్ తో రావచ్చని భావిస్తున్నారు.

 

నథింగ్ ఫోన్ 1 గ్లోబల్ లాంచ్ ఈవెంట్

నథింగ్ ఫోన్ 1 గ్లోబల్ లాంచ్ ఈవెంట్

నథింగ్ ఫోన్ 1 గ్లోబల్ లాంచ్ ఈవెంట్ 'రిటర్న్ టు ఇన్‌స్టింక్ట్' పేరుతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరగనున్నది. నథింగ్ కంపెనీ యొక్క మొదటి ఫోన్ మీద ఆసక్తి ఉన్న వ్యక్తులు లాంచ్ ఈవెంట్ ని చూడాలని అనుకుంటే కనుక భారతీయ కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి IST 8.30 గంటలకు నథింగ్ కంపెనీ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈవెంట్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. కంపెనీ వెబ్‌సైట్‌లో లాంచ్ గురించి నోటిఫికేషన్‌లను స్వీకరించడానికి వినియోగదారులు సైన్ అప్ చేయడానికి కూడా ఎంచుకోవచ్చు.

నథింగ్ ఫోన్ 1 అంచనా ధరల వివరాలు
 

నథింగ్ ఫోన్ 1 అంచనా ధరల వివరాలు

UK ఆధారిత నథింగ్ కంపెనీ కార్ల్ పీ నేతృత్వంలో రన్ అవుతున్నది. ఈ కంపెనీ యొక్క మొదటి స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 1 యొక్క ధర భారతదేశంలో రూ.30,000 మరియు రూ.40,000 మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అమెజాన్ జర్మన్ వెబ్‌సైట్‌లో ఈ హ్యాండ్‌సెట్ ని జాబితా చేయబడినట్లు నివేదించబడింది. లిస్టింగ్ ప్రకారం 8GB RAM + 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్ ధర EUR 469.99 (దాదాపు రూ. 37,900), 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర EUR 499.99 (దాదాపు రూ. 40,300) మరియు 12GB RAM + 256GB ఇంబిల్ట్ స్టోరేజ్ వేరియంట్ EUR 549.909 (సుమారుగా రూ.44,300) ధర వద్ద లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

నథింగ్ ఫోన్ 1 అంచనా స్పెసిఫికేషన్స్

నథింగ్ ఫోన్ 1 అంచనా స్పెసిఫికేషన్స్

ఇప్పటికే విడుదలైన లీక్ ల ప్రకారం నథింగ్ ఫోన్ 1 ఆండ్రాయిడ్ 12 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ అవుతూ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G+ SoC ద్వారా శక్తిని పొందుతుందని ఫౌండర్ ఆఫ్ నథింగ్ ధృవీకరించారు. అదనంగా ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని నివేదించబడింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. నథింగ్ ఫోన్ 1 యొక్క ముందు మరియు వెనుక ప్యానెల్ గొరిల్లా గ్లాస్‌తో రక్షించబడిందని చెప్పబడింది.

ఇంటర్‌ఫేస్

నథింగ్ ఫోన్ 1 యొక్క అతి ముఖ్యమైన స్పెసిఫికేషన్లలో కంపెనీ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఆధారితమైన దాని LED నోటిఫికేషన్ సిస్టమ్. స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో LED సెటప్‌ను కలిగి ఉంటుంది. అది వినియోగదారులకు మెసేజ్ నోటిఫికేషన్ లేదా కాల్‌లను స్వీకరించినప్పుడు వెలుగుతూ హెచ్చరికను చూపుతుంది. వినియోగదారులు విభిన్న పరిచయాల కోసం రకరకాల లైట్ హెచ్చరిక నమూనాలను కూడా కేటాయించవచ్చు. వెనుకవైపు ఉన్న LED సెటప్ స్మార్ట్‌ఫోన్ ప్లగిన్ అయినప్పుడు దాని బ్యాటరీ శాతాన్ని కూడా చూపుతుంది. నథింగ్ ఫోన్ 1 ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో వస్తుందని కొన్ని లీక్ లు ఇటీవల ధృవీకరించాయి.

టిప్‌స్టర్

ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ (@stufflistings) తన యొక్క ట్విట్టర్ అకౌంటులో నథింగ్ ఫోన్ 1 కి సంబందించిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) లిస్టింగ్ స్క్రీన్‌షాట్‌లను ట్వీట్ చేశారు. లీక్ ప్రకారం ఫోన్ మరియు దాని బ్యాటరీ BIS నుండి ఆమోదం పొందాయి. టిప్‌స్టర్ ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ మోడల్ నంబర్ A063తో రానున్నది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో పాటుగా 45W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్‌ మద్దతుతో రానున్నట్లు తెలిపారు. అదనంగా ఇది NFCని కూడా కలిగి ఉండవచ్చు.

నథింగ్ ఫోన్ 1 ప్రీ-ఆర్డర్ పాస్

భారతదేశంలో 'నథింగ్ ఫోన్ 1 ఫ్లిప్‌కార్ట్ ప్రీ-ఆర్డర్ పాస్' కి సంబందించి టిప్‌స్టర్ ముకుల్ శర్మ కొన్ని స్క్రీన్‌షాట్‌లను పంచుకున్నారు. వీటి ప్రకారం నథింగ్ ఫోన్ 1 ప్రీ-ఆర్డర్ పాస్ ను పొందడానికి రూ.2,000 తిరిగి చెల్లించదగిన డిపాజిట్‌ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది అని అందుబాటులో గల స్క్రీన్‌షాట్‌లు సూచిస్తున్నాయి. ఈ పాస్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేయగలరు. ప్రీ-ఆర్డర్ పాస్ ని పొందిన వారు నథింగ్ ఫోన్ (1)ని ముందస్తుగా ఆర్డర్ చేయగలరని హామీ ఇస్తుంది. అయితే ఇది అసలు ఆర్డర్ కాదు అని గుర్తుంచుకోండి. రూ.2,000 రీఫండబుల్ మొత్తాన్ని డిపాజిట్ చేసిన తర్వాత ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేయడానికి ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌లకు ఇన్విటేషన్ కోడ్‌ను ఇమెయిల్ చేస్తుంది. పాస్ కొన్ని ప్రత్యేకమైన ప్రీ-ఆర్డర్ ఆఫర్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. అలాగే ఫోన్ 1 యాక్సెసరీ యొక్క తగ్గింపు ధరను కూడా అందిస్తుంది. ప్రీ-ఆర్డర్ పాస్‌ను కలిగి ఉన్న కస్టమర్‌లు నథింగ్ ఫోన్ 1ని ఫ్లిప్‌కార్ట్ నుండి దాని లాంచ్ తేదీన జూలై 12 రాత్రి 9 గంటల లోపు కొనుగోలు చేయగలరు. స్క్రీన్‌షాట్‌లలోని వివరాల ప్రకారం పాస్ కోసం చెల్లించిన రూ.2,000 డిపాజిట్ మొత్తం తుది ధర నుండి తీసివేయబడుతుంది. అలాగే దీని కొనుగోలు మీద ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు మరియు నో-కాస్ట్ EMIని కూడా కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
How to Watch Nothing Phone 1 Global Launch Livestream: Price, Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X