Paris Olympics 2024 Live పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభోత్సవం.. లైవ్ ఎక్కడ చూడాలంటే..?
ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడలుగా పేరుగాంచిన ఒలింపిక్స్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభోత్సవం (Paris Olympics 2024 Opening Ceremony) సంప్రదాయంగా నిర్వహిస్తున్న స్టేడియంలో కాకుండా ఇతర ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. వినూత్నంగా సీన్ నదిపై ప్రారంభోత్సవ వేడుక నిర్వహించనున్నారు. తొలిసారిగా ఓపెన్ ఎయిర్ పరేడ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ పరేడ్ అస్టర్లిట్జ్ వంతెన వద్ద ప్రారంభం కానుంది. ఈఫిల్ టవర్ ముందు ట్రోకాడెరో వద్ద ముగుస్తుంది.
పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకలను నేరుగా చూసేందుకు 2,22,000 ఉచిత టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. దీంతోపాటు అత్యంత తక్కువ ధరకే లక్షకు పైగా టికెట్‌లను అందుబాటులో ఉంచారు. దీంతోపాటు పారిస్ అంతటా సుమారు 80 భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. గేమ్స్ వైడ్ ఓపెన్ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు.

ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు లైవ్ ఎక్కడ చూడాలి :
భారత కాలమానం ప్రకారం ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు రాత్రి 11 గంటల నుంచి ప్రసారం కానున్నాయి. స్పోర్ట్స్ 18 SD, స్పోర్ట్స్18 1 HD TV (Sports18 1HD/SD) ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. దీంతోపాటు జియో సినిమా యాప్‌లో ఉచితంగా చూసేందుకు అవకాశం ఉంది.
పారిస్ ఒలింపిక్స్‌లో ప్రారంభోత్సవం సందర్భంగా అథ్లెట్ల పరేడ్ పడవల్లో జరుగుతుంది. సుమారు 94 పడవల్లో ప్లేయర్లు ప్రయాణిస్తారు. పరేడ్‌లో గ్రీస్ ముందు వరుసలో ఉంటుంది. అనంతరం ఆల్ఫాబెట్ ఆర్డర్‌లో ఇతర దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. పరేడ్‌లో భారత్ 84వ స్థానంలో రానుంది. భారత్ తరఫున స్టార్ షట్లర్ వీవీ సింధు ప్లాగ్ బేరర్‌గా ఉంటారు. ఆమెతోపాటు టేబుల్ టెన్ని్స్ ప్లేయర్ శరత్ కమల్ జాతీయ జెండాతో భారత్ అథ్లెట్ల బృందానికి నేతృత్వం వహిస్తారు.

భారత్ నుంచి ఎంత మంది పాల్గొంటున్నారు :
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది పోటీపడుతున్నారు. వీరు 16 క్రీడల్లో 69 పతకాల పోటీల్లో పాల్గొంటారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించింది. మొత్తంగా 206 దేశాల నుంచి 10 వేల కంటే ఎక్కువ మంది అథ్లెట్లు పాల్గొంటారు.
పారిస్ ఒలింపిక్స్ 2024 కు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతాను కల్పిస్తున్నారు. దీంతోపాటు పారిస్‌కు 150 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రదేశాన్ని నో ఫ్లే జోన్‌గా ప్రకటించింది. ఇందులో చాలా క్రీడలను ఓపెన్ టాప్ విధానంలో నిర్వహిస్తుండడంతో భద్రత సవాలుగా మారింది.
సెన్ నదిలో ప్రారంభ వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో యాంటీ టెర్రర్ పోలీసులు నది తీరంలో గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రారంభ వేడుకలను లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించనున్న నేపథ్యంలో ప్రాన్స్ ప్రభుత్వం 45 వేల భద్రతా సిబ్బందిని మోహరించింది. దీంతోపాటు నాలుగు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








