సూర్యగ్రహణం 2020 లో అద్భుతమైన దృశ్యం!!! మిస్ అవ్వకండి...

|

2020 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం జూన్ 21 న ఏర్పడుతున్నది. ఈ సూర్యగ్రహణం వార్షిక గ్రహణం కావున రేపు ఆకాశంలో సూర్యుడు మండుతున్న అగ్గిలాగా ఆకర్షనియంగా ఉంటుంది. రేపటి వార్షిక సూర్యగ్రహణం ఇండియా, ఆసియా, ఆఫ్రికా, యూరప్ మరియు ఆస్ట్రేలియాతో పాటుగా ఇతర ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది.

సూర్యగ్రహణం 2020

సూర్యగ్రహణం 2020

రేపు ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం ఉదయం 9:15 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఇది మధ్యాహ్నం 12:10 గంటలకు గరిష్ట గ్రహణ రూపాన్ని పొందుతుంది. ఈ సూర్యగ్రహణం 2020 ని చూడాలి అనుకునే వారు ఆన్‌లైన్‌లో లైవ్ గా చూడవచ్చు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: Rs.8000 ధర లోపు గల బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే...Also Read: Rs.8000 ధర లోపు గల బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే...

వార్షిక సూర్యగ్రహణం అంటే ఏమిటి?

వార్షిక సూర్యగ్రహణం అంటే ఏమిటి?

సూర్యగ్రహణం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే భూమి మరియు సూర్యుడి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఈ సూర్యగ్రహణం సంభవిస్తుంది. వార్షిక సూర్యగ్రహణం సమయంలో చంద్రుడికి మరియు భూమి మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. ఆ దూరం చంద్రుడి యొక్క స్పష్టమైన వ్యాసం సూర్యుడిని పూర్తిగా నిరోధించడానికి సరిపోదు. బదులుగా ఇది సూర్యుని యొక్క చాలా భాగాన్ని అడ్డుకొని దాని యొక్క నీడను భూమిపై పడేలా చేస్తుంది. సూర్యగ్రహణం యొక్క ఈ దశలో చంద్రుని చుట్టూ ఒక రింగ్-ఆకారం ఏర్పడుతుంది. ఇది భూమిపై ఉన్న ప్రజలకు ఆకాశంలో "అగ్ని వలయం" ఆకారంలో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

సూర్యగ్రహణం 2020 భారతదేశం సమయం
 

సూర్యగ్రహణం 2020 భారతదేశం సమయం

2020 సంవత్సరంలో మొదటిసారిగా రాబోయే సూర్యగ్రహణం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కాంగో మరియు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో అధికంగా ఉంటుంది. వీటితో పాటుగా పాకిస్తాన్ మరియు ఉత్తర భారతదేశం మరియు దక్షిణాన చైనాలో కూడా అధికంగా ఉంటుంది. జూన్ 21 న ఈ వార్షిక సూర్యగ్రహణం ఉదయం 9:15 గంటలకు పాక్షిక గ్రహణంగా ప్రారంభమయి దాని గరిష్ట రూపాన్ని 12: 10p వద్ద పొందుతుంది. అలాగే మధ్యాహ్నం 3:04 గంటల సమయంలో ఈ వార్షిక సూర్యగ్రహణం ముగుస్తుంది.

జూన్ 21 2020 సూర్యగ్రహణాన్ని ఆన్‌లైన్‌లో చూడటం ఎలా?

జూన్ 21 2020 సూర్యగ్రహణాన్ని ఆన్‌లైన్‌లో చూడటం ఎలా?

జూన్ 21 2020 న వార్షిక సూర్యగ్రహణం ఏర్పడుతున్నది. పైన తెలిపిన ప్రదేశాలలో మీరు నివసిస్తుంటే కనుక మీరు స్వయంగా మీ యొక్క స్వంత కళ్ళతో ఆకాశంలో అగ్ని ప్రభావ ఉంగరాన్ని చూడవచ్చు. గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూసేటప్పుడు కంటికి కావలసిన రక్షణలను తీసుకోవడం మరచిపోకండి. అంతరిక్ష ఔత్సాహికులు ఈ మొత్తం కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు. టైమండ్‌డేట్ మరియు స్లోహ్ వంటి ప్రముఖ ఛానెల్‌లలో మరియు యూట్యూబ్‌లో కూడా లైవ్ ప్రసారం చేస్తున్నాయి. మీరు నాసా ట్రాకర్ ఉపయోగించి గ్రహణం యొక్క మార్గాన్ని కూడా అనుసరించవచ్చు.

Best Mobiles in India

English summary
How to Watch Tomorrow Surya Grahan Live on Online: India Timings and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X