ఒక ఫోన్ లోని కాంటాక్ట్స్ జాబితాను మరొక ఫోన్ లోకి ట్రాన్స్ ఫర్ చేసే ప్రక్రియ ఆ ఫోన్ లు సపోర్ట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. అనేక మార్గాల ద్వారా కాంటాక్ట్స్ జాబితాను ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. పలు సలువైన మార్గాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం... మా ఫేస్ బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్ డేట్స్ పొందండి సిమ్ ఆధారిత ట్రాన్స్ ఫర్ మీ పాత ఫోన్ zwj;లోని కాంటాక్ట్స్ జాబితా తక్కువ నెంబర్లను కలిగి ఉన్నట్లయితే సిమ్ ఆధారిత ట్రాన్స్ ఫర్ సౌకర్యంగా ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా మీ పాత ఫోన్ మెమరీనిలోని మొబైల్ నెంబర్ లను సిమ్ కార్డ్ లోకి కాపీ చేసుకోండి. తరువాత ఆ సిమ్ కార్డ్ ను కొత్త ఫోన్ లో అమర్చి ఆ నెంబర్లను ఫోన్ లోకి కాపీ చేసుకోండి. పాత ఆండ్రాయిడ్ ఫోన్ లోని కాంటాక్ట్స్ జాబితాను కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ లోకి ట్రాన్స్ ఫర్ చేయటం ఏలా..? ముందుగా మీ పాత ఆండ్రాయిడ్ ఫోన్ లో మైక్రోఎస్డీ కార్డ్ ను అమర్చండి. ఆ తరువాత కాంటాక్ట్స్ జాబితాలోకి వెళ్లి మెనూ nbsp; ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి. మెనూలో కనిపించే ఆప్షన్ లలో Import/Exportను సెలక్ట్ చేసకోండి. వాటిలో lsquo;Export to SD cardను సెలక్ట్ చేసుకున్నట్లయితే మీ పాత ఆండ్రాయిడ్ డివైస్ లోని పూర్తి కాంటాక్ట్స్ జాబితా ఒక ఫోల్డర్ రూపంలో మైక్రోఎస్డీ కార్డ్ లోకి వచ్చి చేరుతుంది. ఇప్పుడు పాత డివైస్ లోని ఎస్డీ కార్డ్ ను కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ లో అమర్చి ఎస్డీ కార్డ్ ఫైల్స్ లోకి వెళ్లినట్లయితే కాంటాక్ట్స్ జాబితా ఫోల్డర్ కనిపిస్తుంది. దాన్ని కాపీ చేసుకుని ఫోన్ లో ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోండి. మీ పాత ఫోన్ లోని కాంటాక్ట్స్ కొత్త ఫోన్ లో ప్రత్యక్షమవుతాయి. మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్ చేసి చూసుకోండి. వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.