Home
News

భారత్‌పై అమెరికా కీలక నిర్ణయం.. ఇండియాలో ఆపిల్‌ ప్రణాళికలను ఎలా ప్రభావితం చేస్తుంది..?

US Tariffs on India : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పై టారిఫ్‌లు విధిస్తూ ప్రకటన చేశారు. భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై 25 శాతం తోపాటు పెనాల్టీని విధిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని చెప్పారు. ట్రంప్ నిర్ణయం కారణంగా ఎలక్ట్రానిక్స్‌ తయారీ, ఎగుమతిపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఐఫోన్ల తయారీపై ప్రభావం! :
భారత్‌లో ఐఫోన్ల తయారీని ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతోపాటు అమెరికాలో ఐఫోన్‌ ధరల పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారత్‌ నుంచి అమెరికాకు ఐఫోన్‌లను ఎగుమతి చేసేందుకు ఆపిల్‌ అధిక సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఖర్చును యూజర్లపై వేసే అవకాశం ఉంటుంది.

US Tariffs and penalty affect apple iPhone manufacturing plans in india

ఆపిల్‌ ప్రణాళికల ప్రభావితం చేసే అవకాశం :
ప్రస్తుతం అమెరికా స్మార్ట్‌ఫోన్ దిగుమతుల్లో భారత్‌ సుమారు 36 శాతం వాటాను కలిగి ఉంది. ఈ సుంకాల కారణంగా భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ టారిఫ్‌ లు ఐఫోన్‌ లకు భారత్‌ ను ప్రధాన ఎగుమతి కేంద్రంగా మార్చాలనే ఆపిల్‌ ప్రణాళికలను దెబ్బతీస్తాయిని ఐడీసీ ఇండియా, దక్షిణాసియా మరియు ANZ పరికరాల పరిశోధన అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్ నవకేంద్ర సింగ్ తెలిపారు.

స్మార్ట్‌ఫోన్‌ ల తయారీతోపాటు :
వస్త్రాలు, రత్నాలు, అభరణాలు, ఆటో విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్‌. దుస్తులు సహా సముద్ర ఆహార ఉత్పత్తులు వంటి కీలక రంగాలపై ప్రభావం పడనుంది. వీటిలో చాలా వరకు అమెరికా మార్కెట్లపై ఎక్కువగా ఆధారపడతాయి. టారిఫ్‌ ల కారణంగా వీటిపై ప్రభావం పడే అవకాశం ఉంది.

US Tariffs and penalty affect apple iPhone manufacturing plans in india

ధరల పెరుగుదల లేదా సరఫరా లో జాప్యం :
స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమ అధికంగా ప్రభావితం అయ్యే జాబితాలో ఉంది. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్త సవాళ్లు, భారత్‌ లో అనుకూల పరిస్థితుల కారణంగా భారత్ నుంచి ఐఫోన్‌ల ఎగుమతులు అధికం అయ్యాయి. కొత్త టారిఫ్‌ల నిర్ణయంతో భారత్‌ లో అసెంబుల్‌ చేసిన ఐఫోన్‌ల ధరల పెరుగుదల లేదా సరఫరాలో జాప్యం చోటుచేసుకొనే అవకాశం ఉంది.

ఉద్యోగ వృద్ధిపై ప్రభావం :
దీంతోపాటు భారతదేశ ఎగుమతి ఆధారిత ఉద్యోగ వృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమ పెద్ద సంస్థలకే కాకుండా చిన్న చిన్న కాంపోనెంట్స్‌ సరఫరాదారులు, లాజిస్టిక్‌ సంస్థలు మరియు సంబంధిత విభాగాలకు ప్రధాన ఆదాయ మార్గంగా ఉంది. ప్రొడక్షన్‌ లింక్డ్ ఇన్సెంటివ్‌ (PLI) వంటి పథకాల కారణంగా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాల కల్పనకు దారితీసింది. సుంకాల కారణంగా తయారీ మందగిస్తే.. ఆ ప్రభావం ఉద్యోగాలపై పడే అవకాశం ఉంది.

US Tariffs and penalty affect apple iPhone manufacturing plans in india

విస్తరణ ప్రణాళికలు :
కొత్తగా సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ రంగంలో ఉపాధి వృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఫాక్స్‌కాన్‌, టాటా ఎలక్ట్రానిక్స్‌ వంటి ఆపిల్‌ కాంట్రాక్ట్ పొందిన సంస్థల విస్తరణ ప్రణాళికలను నెమ్మదించవచ్చు లేదా పూర్తిగా నిలివేయవచ్చు. అసెంబ్లింగ్‌, టెస్టింగ్‌, క్వాలిటీ సహా ఇతర విభాగాల ఉద్యోగాలపై ప్రభావం చూపుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
How US Tariffs and penalty affect apple iPhone manufacturing plans in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X