Home
News

US యూజర్లు గూగుల్ పేను ఉపయోగించి అంతర్జాతీయంగా డబ్బును పంపడం ఎలా ?

దేశంలో డిజిటల్ పేమెంట్స్ అమలులోకి వచ్చిన తరువాత బాగా పాపులర్ అయిన వాటిలో గూగుల్ పే ఒకటి. ఇప్పటి వరకు గూగుల్ పే దేశంలో ఎవరికైనా డబ్బులను పంపడానికి అనుమతిని ఇచ్చింది. అయితే ఇప్పుడు గూగుల్ పే ను ఉపయోగించి యూఎస్ ఆధారిత యూజర్లు భారతదేశం మరియు సింగపూర్లలో ఉన్న వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు డబ్బు పంపడానికి అనుమతిస్తున్నట్లు గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా ప్రకటించింది. ఈ ఫీచర్ ను ప్రారంభించడానికి కంపెనీ వెస్ట్రన్ యూనియన్ మరియు వైజ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో త్వరలో 200 కి పైగా దేశాలలో ఈ ఫీచర్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

గూగుల్

గూగుల్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం యుఎస్ లో ఉన్న ఒక వినియోగదారుడు అంతర్జాతీయంగా (భారతదేశం లేదా సింగపూర్) డబ్బును పంపించడానికి ప్రయత్నించినప్పుడు గ్రహీతకు అందుకునే ఖచ్చితమైన మొత్తం గురించి వారికి మొదట తెలియజేయబడుతుంది. ఈ మొత్తాన్ని పొందడానికి ఎంత సమయం పడుతుందనే దాని ఆధారంగా పేమెంట్ ప్రొవైడర్‌ను ఎంచుకోవడానికి కూడా వారికి అనుమతి ఉంటుంది.

టెక్ క్రంచ్ నివేదిక

టెక్ క్రంచ్ యొక్క నివేదిక ప్రకారం గూగుల్ పే ద్వారా పంపిన మొత్తానికి వెస్ట్రన్ యూనియన్ వినియోగదారుల వద్ద నుంచి ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయదు. అంతేకాకుండా యుఎస్ లో వినియోగదారుడు ఎంచుకున్న విధంగా వారి స్థానిక కరెన్సీలో ఖచ్చితమైన విలువను పొందుతుంది. అయితే వైజ్ వాస్తవ విదేశీ మారకపు రేటు మరియు అదనపు బదిలీ ఫీజులను దేశం నుండి దేశానికి మారుస్తుంది. కానీ గూగుల్ వినియోగదారులకు అదనపు రుసుమును మాత్రం విధించదు.

గూగుల్ పే

"జూన్ 16 వరకు యుఎస్ నుండి గూగుల్ పే ద్వారా డబ్బును కుటుంబ సభ్యులకు పంపేటప్పుడు వెస్ట్రన్ యూనియన్ ఉచిత బదిలీలను అపరిమితంగా అందిస్తుంది. అలాగే వైజ్ కూడా కొత్తగా $500 వరకు బదిలీలపై కొత్త కస్టమర్లకు మొదటి బదిలీని ఉచితంగా చేస్తుంది" అని నివేదిక పేర్కొంది. గూగుల్ పే యొక్క ఈ కొత్త ఫీచర్ అనేది పేపాల్ యొక్క సౌలభ్యానికి ప్రత్యర్థిగా ఉండటానికి అనుమతిస్తుంది. పేపాల్ ఇప్పటికే దాని వినియోగదారులను ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి అయినా పంపించడానికి అనుమతిస్తుంది. అయితే అంతర్జాతీయ పేమెంట్ ఫీచర్ వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంచబడుతుందని గమనించండి. యుఎస్‌లో ఉన్న వ్యాపారాలు ఇప్పటికీ యాప్ ను ఉపయోగించి అంతర్జాతీయంగా డబ్బు పంపలేవు.

గూగుల్ పే ఉపయోగించి అంతర్జాతీయంగా డబ్బును పంపే విధానం

గూగుల్ పే ఉపయోగించి అంతర్జాతీయంగా డబ్బును పంపే విధానం

** మీ యుఎస్ ఆధారిత అకౌంటును ఉపయోగించి భారతదేశం లేదా సింగపూర్‌లో ఉన్న గూగుల్ పే యూజర్ కోసం సెర్చ్ చేయండి.

** అకౌంటును ఓపెన్ చేసి ‘పే' ఎంపిక మీద నొక్కండి.

** తరువాత మీరు ఏ పేమెంట్ ప్రొవైడర్‌ను (వెస్ట్రన్ యూనియన్, వైజ్) ఉపయోగించాలనుకుంటున్నారో ఎంచుకోండి.

** మీరు పంపించదలిచిన మొత్తాన్ని ఇన్పుట్ చేయండి.

** మార్చబడిన మొత్తాన్ని తనిఖీ చేసి చివరిగా 'సెండ్' ఎంపిక మీద నొక్కండి.

 

Best Mobiles in India

English summary
How US Users Send Money Internationally Using Google Pay
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X