Home
News

మొబైల్‌లో గూగుల్ ప్లస్ వాడడం ఎలా - టిప్స్&ట్రిక్స్

By Super
Google Plus on Mobile
బెంగళూరు: ప్రస్తుతం ఏ టెక్నాలజీ బ్లాగులో చూసిన గూగుల్ ప్లస్ ముచ్చటే. లెటేస్ట్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ గూగుల్ ప్లస్ త్వరలో వస్తుండడంతో ఎవరైతే సోషల్ నెట్ వర్కింగ్‌కి బాగా బానిసలు అయిఉన్నారో అలాంటి వారు ఫేస్‌బుక్‌తో పాటు గూగుల్ ప్లస్‌లో ఉన్న ఫీచర్స్‌ని తెలుసుకునేందుకు గాను గూగుల్ ప్లస్‌లో చేరాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ఫేస్‌‌బుక్ ఇప్పటి వరకు ఉన్న తన యూజర్స్‌‌ని కొల్పావాల్సి వస్తుందేమోనని భయం పట్టుకుంది. అంతేకాకుండా గూగుల్ ప్లస్ ప్రస్తుతం టెస్టింగ్ టైమ్‌లో ఉండగా రెండు వారాలకు గాను దాదాపు 10 మిలియన్ యూజర్స్ అందులో రిజస్టర్ అవ్వడం జరిగింది. దాంతో గూగుల్ ప్లస్ గనుక మార్కెట్లోకి విడుదలైతే తనసత్తాని చాటుతుందని నిపుణులు అభిప్రాయడపడుతున్నారు.

ఇది ఇలా ఉంటే గూగుల్ ప్లస్ గురించి మరిన్ని వివరాలను మీకు తెలియజేసేందుకు ఓ చిన్న ప్రయత్నంగా ఈ కంటెంట్ అందివ్వడం జరుగుతుంది. చాలా మందికి గూగుల్ ప్లస్‌లో లాగిన్ అవ్వడం తెలియడం లేదు. అందుకు మీరు చేయాల్సిందల్లా ఎవరైనా మీ ప్రెండ్స్ గూగుల్ ప్లస్‌ని గనుక మేనేజ్ చేస్తున్నట్లైతే వారి వద్ద నుండి మీరు మొదటగా ఇన్విటేషన్ పోందాలి. ఐతే ఇలానే మీరు గతంలో కూడా చేసి ఉండవచ్చు. అప్పుడు ఇన్విటేషన్ పంపే విధానంలో కొన్ని బగ్స్ ఉండడం వల్ల ఇన్విటేషన్స్ చాలా మంది అందుకోలేకపోయారు. అటువంటి బగ్స్ అన్నింటిని గూగుల్ ప్లస్ ఫిక్స్ చేయడం జరిగింది.

దీంతో ఇప్పుడు మీరు మీ స్నేహితుల ద్వారా ఇన్వటేషన్ పోందితే గనుక గూగుల్ ప్లస్ లోకి వెళ్లడం చాలా తేలిక. అంతేకాకుండా గూగుల్ ప్లస్‌ని ఎలా వాడాలి, వేరే సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్స్‌తో పోల్చితే అసలు గూగుల్ ప్లస్ వాడడం వల్ల మనకు ఉండే ఉపయోగాలు ఏంటనేవి క్లుప్తంగా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు చాలా మంది వారియొక్క కంప్యూటర్స్‌లలో గూగుల్ ప్లస్‌ని టెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పడు మీయొక్క మొబైల్‌లో గూగుల్ ప్లస్‌ని టెస్టు చేసే అవకాశం కల్పిస్తున్నారు. దీనికోసం మీ మొబైల్ ఆండ్రాయిడ్ 2.1 లేదా అంతకంటే ఎక్కువ వర్సన్స్‌ని కలిగి ఉన్నదై ఉండాలి. దీనితోపాటు మీ మొబైల్‌లో ఆండ్రాయిడ్ మార్కెట్ నుండి గూగుల్ ప్లస్ అఫ్లికేషన్‌ని డౌన్ లోడ్ చేసుకోవాలి.

ఇక వేరే స్మార్ట్ ఫోన్స్ యూజర్స్ మీ మొబైల్‌లో ఉన్న వెబ్ బ్రౌజర్ ద్వారా google.com/+ అని టైప్ చేసి గూగుల్ ప్లస్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఐపోన్ అప్లికేషన్ కూడా త్వరలోనే విడుదల చేస్తామని గూగుల్ చెప్పిన సంగతి తెలిసిందే. మొబైల్‌లో గూగుల్ ప్లస్ ఫీచర్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Features of Google+ on Mobile:

* Share your thoughts and location.
* Instantly upload your photos and videos as you take them.
* Get updates from your circles in the stream.
* Check in to a place.
* Make plans on-the-go with group messaging.
* View posts from people around you.
* Comment on or +1 a post.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X