నెట్ వర్క్‌లో ఫైళ్శను షేరింగ్ చేయడం ఎలాగో చూద్దాం...

Posted By: Staff

నెట్ వర్క్‌లో ఫైళ్శను షేరింగ్ చేయడం ఎలాగో చూద్దాం...

నిత్యం ఒక కంప్యూటర్ మీద పని చేస్తూ ఇంకో కంప్యూటర్ మీదున్న ఫైళ్లు కూడా అందుబాటులోకి తెచ్చుకోవాలంటే ఏమి చేయాలో ఇప్పుడు చూద్దాం. మీరు పని చేసే కంప్యూటర్ ని క్లయింట్ అని అనుకుందాం. మీకు కావాల్సిన ఫైళ్లు ఉన్న కంప్యూటర్ ని సర్వర్ అనుకుందాం. ముందు సర్వర్‌ని, ఫైళ్లు మిగతా కంప్యూటర్లతో పంచుకునేందుకు సిద్దం చేద్దాం.

సర్వర్ (విండోస్ ఐతే):

విండోస్ లో మీరు పంచుకోవాలనుకునే ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి Properties ఎంచుకోండి. ఒక విండో తెరుచుకుంటుంది. అందులో Sharing అనే ట్యాబు లోకి వెళ్ళండి. ఆ విండోలో Share అని ఉన్న బాక్స్ ని టిక్కు పెట్టి ఓకే కొట్టేయండి. ఇక్కడితో మన విండోస్ సర్వర్ సిద్దమైనట్టే!

క్లయింట్(విండోస్ ఐతే):

ఎక్స్ పీ వాడుతున్నట్టైతే My Computer కి వెళ్లి, మెనులో Tools > Map Network Drive ని ఎంచుకోండి. అక్కడ వచ్చిన విండో లో Folder స్థానంలో \\172.16.15.22\shared_folder అని ఇవ్వండి. ఇక్కడో ముఖ్య గమనిక. సర్వర్ విండోస్ ఐతే మీరు ఆ పంచిన ఫోల్డర్ కి ఏ పేరు ఇస్తారో అదే ఇక్కడ కూడా (shared_folder స్థానంలో) ఇవ్వాలి. సర్వర్ లినక్సు ఐతే విండోస్ క్లైంట్ లో ఆ ఫోల్డర్ ని ఈ పద్దతిలో పొందడం కుదరదు. దానికి వేరే పద్దతులు ఉన్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting