వన్ ఇండియా పాఠకుల కోసం...ట్విట్టర్ వాడటం ఎలా?

Posted By: Staff

వన్ ఇండియా పాఠకుల కోసం...ట్విట్టర్ వాడటం ఎలా?

సాధారణంగా చాలా మందికి ట్విట్టర్ గురించి "ట్విట్టర్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు?
అనే విషయం తెలియదు. అలాంటి వారందరి కోసం వన్ ఇండియా ప్రత్యేకంగా ట్విట్టర్ గురించిన సమాచారం, ట్విట్టర్ ఎలా వాడాలో సంబంధించినటువంటి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది.

ట్విట్టర్‌లో‌ ప్రాథమికంగా రెండు ప్రధానాంశాలను మనము గుర్తుంచుకోవాలి. అవి, మనం అనుసరించువారు (following) మరియు మనలను అనుసరించువారు (followers). మనం అనుసరించువారు (following) ఏవైనా ట్వీట్ (tweet) చేస్తే మనకు అవి కనిపిస్తాయి. అలాగే మన ట్వీట్లు (tweets) మనలను అనుసరించువారికి (followers) కనిపిస్తాయి. ఇక్కడ ఎవరు ఎవరినైనా అనుసరించవచ్చు. మీరు ఎవరినైనా అనుసరించాలంటే వారు మీకు ఖచ్చితంగా తెలుసుండాలని లేదు. అలాగే మిమ్ములను అనుసరించే వారికి కూడా అది వర్తిస్తుంది. ఇవి బాగా గుర్తుకుంచుకున్న పక్షాన, ట్విట్టర్ లో మన గమనం సాఫీగా సాగుతుంది.

ఎవరిని అనుసరించాలి...
మొదటిగా మనము ఎవరిని అనుసరించాలనేది నిర్ణయించుకోవాలి. మీ అభిరుచులకు అనుగుణంగా ఉండే వ్యక్తులను మీరు అనుసరించవచ్చు. మీ మిత్రులను మీరు అనుసరించవచ్చు. మీ రంగంలో మహోన్నతమైన/విజయవంతులైన/అభిమానమున్న వ్యక్తులను మీరు అనుసరించవచ్చు. ఇంకా లోతుగా వెళ్లాలని అని అనుకుంటే, ఓ ఫలానా వ్యక్తిని మీరు ఎంచుకొని అతను అనుసరిస్తున్న వ్యక్తులను బాగా గమనించి, వారిని మీరు కూడా అనుసరించవచ్చు. మీ మిత్రులను మీరు అనుసరించాలి అని అనుకుంటే, ట్విట్టర్ సైటులో కుడిప్రక్కన - పైన ఉన్న 'Find People' లోకి మీరు వెళ్తే, అక్కడ మీ mail అకౌంటు ద్వారా మీ మిత్రులు గనక ఇదివరకే ట్విట్టర్‌లో ఉంటే, వారిని మీరు అనుసరించవచ్చు, ఇంకా ట్విట్టర్‌లో లేని వారికి ఆహ్వానం(invite) పంపవచ్చు. ట్వెల్లో వంటి సైట్ల ద్వారా మనకు కావలసిన వారిని సులభంగా వెతికి వారిని అనుసరించవచ్చు.

ఎవరైనా తెలియని వారిని అనుసరించడానికి సంకోచించకండి. వారిని అనుసరించిన తరువాత, వారి ట్వీట్‌లు గనక మీకు నచ్చకుంటే అప్పుడు మీరు వారిని అనుసరించడం మానివేయొచ్చు. ట్విట్టర్‌లో మనము ఎవరినైనా తేలికగా అనుసరిచడం మరియు అనుసరిచకపోవడం చేయవచ్చు. మనము క్రమంగా క్రొత్తవారిని అనుసరించడం మరియు మీకు అవసరమైన విషయాలను అందించనివారిని అనుసరించకపోవడం చేస్తుండాలి. అప్పుడే ట్విట్టర్‌ మనకు చాలా మంచి ఫలితాలనిస్తుంది.

ట్వీట్ అంటే ఏమిటి?...
ఒక ట్విట్టర్ వాడుకరి తను ట్విట్టర్‌లో వ్రాసే ఏ విషయానినైనా "ట్వీట్" అని చెప్పవచ్చు. అది తను ట్విట్టర్‌లో ఉన్న అందరిని ఉద్దేశించి చెప్పినా, లేక ప్రత్యేకంగా ఒకరిని ఉద్దేశించి చెప్పినా, లేదా అతని స్వగతం తెలిపినా, అన్నింటిని "ట్వీట్" అనే చెప్పవచ్చు. ట్వీట్‌ యొక్క ఉదాహరణలు: "ఇన్ఫోసిస్ తన రెండవ త్రైమాసికంలో చాలా మంచి ఫలితాలను సాధించినదని తెలిపింది", "మిత్రులారా, నాకు విండోస్ కన్నా ఉబంటు ఎంతో మేలని అనిపించినది", "నేను ఈ రోజు ఒక క్రొత్త చేతి గడియారం కొంటున్నాను".

రీట్వీట్ అంటే ఏమిటి?...
రీట్వీట్ అంటే 'తిరిగి ట్వీట్' చేయడం. ఆంగ్లంలో దీనిని RT అని గుర్తించవచ్చు. ట్వీట్ అంటే మాకు అర్థమైనది, ఇప్పుడు రీట్వీట్ ఏంటి? మనతో పాటు ట్విట్టర్‌లో పలువురు వారి భావాలను ట్వీట్‌ల ద్వారా తెలియపరుస్తూవుంటారు, అవి మనకు నచ్చి మనలను అనుసరించేవారికి తెలియపరచాలని అనుకుంటే, ఈ రీట్వీట్ పనికొస్తుంది. ఒకవేళ నాగేష్ అనే మీ మిత్రుడు "పాండిత్యం కొద్దీ వ్యాఖ్యానం అన్నారు పెద్దవారు" అని ట్వీట్ ప్రచురించివుంటే, దానిని మీరు "RT @nagesh పాండిత్యం కొద్దీ వ్యాఖ్యానం అన్నారు పెద్దవారు" అని మీ పేజీలో రీట్వీట్ చేయవచ్చు. ఈ RT ట్విట్టర్ సంస్థ చిత్రీకరించినది కాదు, ట్విట్టర్ వాడుకరులు వారి సౌలభ్యానికి కనుకున్నారని తె

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting