ఉబర్ యాప్‌తో.. ఎనీ టైమ్ ట్యాక్సీ
ఉబర్.. ఇదొక ప్రముఖ ఆన్ డిమాండ్ ట్యాక్సీ బుకింగ్ మొబైల్ అప్లికేషన్. ఉబర్ టెక్నాలజీస్ సంస్థ ఈ యాప్‌ను డిజైన్ చేసింది. ఈ యాప్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా క్రెడిట్ కార్డ్ చెల్లింపుతో మీకు కావల్సిన ప్రీమియం శ్రేణి కార్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ చేసుకోవచ్చు.
ఈ క్యాబ్ బుకింగ్ సర్వీస్ ప్రస్తుతం హైదరబాదీలకు అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. తొలత ఈ యాప్ సర్వీసును అమెరికాలో నాలుగు సంవత్సరాల క్రిందట ప్రారంభించారు. ఆ తరువాత, ప్రపంచవ్యాప్తంగా ఉబర్ సేవలను విస్తరించాయి. ఉబర్ సేవలను ఉపయోగించుకునేందుకు 10 తీరైన మార్గాలను ఈ క్రింది స్లైడ్‌షోలో సూచించటం జరుగుతోంది.

ఉబర్ యాప్‌ను పొందేందుకు తీరైన మార్గాలు
ముందుగా అధికారిక UBER వెబ్‌సైట్‌లోకి ప్రవేశించండి.

ఉబర్ యాప్‌ను పొందేందుకు తీరైన మార్గాలు
ఆ తరువాత SIGN UP లింక్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత మీ పేరు, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీతో పాటు క్రెడిట్ కార్డ్ వివరాలను నమోదు చేయండి.

ఉబర్ యాప్‌ను పొందేందుకు తీరైన మార్గాలు
వివరాలను పొందపరిచిన తరువాత ఉబర్ సర్వీసుకు సంబంధించి టర్మ్స్ ఇంకా ప్రైవసీ పాలసీలను నిశితంగా పరిశీలించి ఆ తరువాత సైనప్ బటన్ పై క్లిక్ చేయండి.

ఉబర్ యాప్‌ను పొందేందుకు తీరైన మార్గాలు
అప్పుడు మీ ఉబర్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఓపెన్ చేసిన అకౌంట్ కు సంబంధించిన వివరాలు మీరు జత చేసిన ఈమెయిల్ అకౌంట్‌కు పంపబడతాయి.

ఉబర్ అప్లికేషన్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు...
ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు యాపిల్ అప్లికేషన్ స్టోర్ నుంచి, బ్లాక్‌బెర్రీ యూజర్లు బ్లాక్‌బెర్రీ యాప్ వరల్డ్ నుంచి ఉబర్ అప్లికేషన్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఉబర్ అప్లికేషన్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో వినియోగించుకునేందుకు
ఉబర్ యాప్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన తరువాత మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కండి.

ఉబర్ అప్లికేషన్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో వినియోగించుకునేందుకు
యాప్‌లోకి లాగిన్ అయిన తరువాత మీ ప్రాంతాన్ని బట్టి ఉబర్ రకరకాల కార్ సర్వీసులను అందిస్తుంది. వాటిలో మీకు నచ్చిన క్యాబ్ సర్వీసును పొందవచ్చు.

ఉబర్ అప్లికేషన్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో వినియోగించుకునేందుకు
మీకు నచ్చిన క్యాబ్ సర్వీసును ఎంచుకున్న తరువాత మీరు ఉన్న ప్రదేశాన్ని యాప్‌లో మార్క్ చేయండి. మీకు అత్యంత చేరువలో ఉన్న కారు ఎక్కడుందో తెలిసిపోతుంది. అంతేకాకుండా డ్రైవర్ వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

ఉబర్ అప్లికేషన్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో వినియోగించుకునేందుకు
యాప్‌లో మీరు ఉన్న ప్రదేశాన్ని మార్క్ చేయటం ద్వారా యాప్ సాయంతో డ్రైవర్ మిమ్మల్ని చేరుకోగలగుతారు.

ఉబర్ అప్లికేషన్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో వినియోగించుకునేందుకు
ఎక్కడికి వెళ్లాలో ముందుగా చెప్పవల్సిన అవసరం లేదు. దిగిన తరువాత డ్రైవర్లకు ఏ విధమైన పేమెంట్ చెల్లించాల్సి అవసరం లేదు మొత్తం పేమెంట్ క్రెడిట్ కార్డ్ ద్వారానే జరిగిపోతుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications