Home
News

Smart Devices కరోనా సమయంలో ఎంత వరకు ఉపయోగకరంగా ఉన్నాయి!!!

ఇండియా టెక్నాలజీ పరంగా అన్ని దేశాలతో పోటీగా అభివృద్ధి చెందుతున్నది. ప్రజలు ప్రస్తుతం చేతికి కట్టుకుంటున్న వాచ్ వద్ద నుండి కార్ల వరకు కూడా స్మార్ట్ టెక్నాలజీ కావాలి అని కోరుకుంటున్నారు. ముఖ్యముగా 2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లను, డెస్క్ టాప్ లను మరియు ల్యాప్‌టాప్‌లను వినియోగించడం అదికంగా ఉంది. దీనికి కారణం కూడా లేకపోలేదు ప్రజలు కేవలం ఇంటికి పరిమితం కావడంతో ఆన్‌లైన్ ద్వారా ఇంటి వద్ద నుండి వర్క్ చేయడం మరియు పిల్లలకు ఆన్‌లైన్ లోని తరగతుల యొక్క క్లాసులను నిర్వహించడంతో స్మార్ట్ డివైస్ ల వినియోగం ఎక్కువ అవుతున్నది.

స్మార్ట్‌డివైస్ల అవసరం ఎంత వరకు?

స్మార్ట్‌డివైస్ల అవసరం ఎంత వరకు?

ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెనుక పరుగులు తీస్తూఉంది కావున దాని వెనుక పరిగెత్తడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ మనం ఉపయోగించే వాటిలో కూడా కొన్ని పరిమితులను మనకు మనమే పెట్టుకోవాలి. ఉదాహరణకు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్న వారు వారి యొక్క అన్ని రకాల అవసరాల కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. ఆన్‌లైన్ పేమెంట్స్, ఫోన్ కాల్స్, OTT యాప్ ల వినియోగం వంటివి సులభంగా చేయవచ్చు. అయితే వీరు అధిక ధర వద్ద లభించే స్మార్ట్‌వాచ్ లను కొనుగోలు చేయడం పూర్తిగా అనవసరం. ఇటువంటి వారు తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్‌వాచ్ లను ఉపయోగించడం ఉత్తమం.

స్మార్ట్‌టీవీలు vs స్మార్ట్‌ఫోన్‌లు

స్మార్ట్‌టీవీలు vs స్మార్ట్‌ఫోన్‌లు

ఇండియాలో ప్రస్తుతం స్మార్ట్‌టీవీలు అనేవి వివిధ రకాల పరిమాణాలలో తక్కువ ధర వద్ద నుండి అధిక ధరలో కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌టీవీలు అన్ని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, యూట్యూబ్, sunNEXT వంటి వివిధ రకాల OTT యాప్ లతో ముందే ఇన్ స్టాల్ చేయబడి ఉంటాయి. పెద్ద పెద్ద స్క్రీన్ గల టీవీలలో సినిమా హాల్ లో చూస్తున్న అనుభవంతో మీకు నచ్చిన సినిమాలు మరియు టీవీ షోలను చూడడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి అనుభవం కోసం అధికంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే ఈ అన్ని రకాల యాప్ లను స్మార్ట్‌ఫోన్‌లలో కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. అయితే స్మార్ట్‌ఫోన్‌ల యొక్క డిస్ప్లేలు కేవలం 7-ఇంచ్ లోపు మాత్రమే ఉంటాయి. కావున ఇందులో ఎక్కువ మంది కలసి చూడడానికి అవకాశం ఉండదు. కానీ ఒంటరిగా చూడాలనుకునే వారికి స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగకరంగా ఉంటాయి.

ల్యాప్‌టాప్‌ల అవసరం ఎంతవరకు

ల్యాప్‌టాప్‌ల అవసరం ఎంతవరకు

2020లో ల్యాప్‌టాప్‌ల అవసరం అధికంగా పెరిగింది. ఎంతలా పెరిగింది అంటే ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్న వారిలో 30% మంది ల్యాప్‌టాప్‌లను వినియోగిస్తున్నారు. కరోనా దెబ్బకు ప్రైవేట్ సంస్థలు చాలా వరకు తమ యొక్క ఉద్యోగులను ఇప్పటికి కూడా ఇంటి వద్ద నుండి పనిచేయడానికి అనుమతిని ఇచ్చింది. అయితే ఇందుకోసం ఉద్యోగులకు ల్యాప్‌టాప్‌లను అందించింది.

ఇతర స్మార్ట్‌డివైస్ల ఉపయోగం

ఇతర స్మార్ట్‌డివైస్ల ఉపయోగం

స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటివి ప్రస్తుత సమయంలో ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అయితే మరికొన్ని స్మార్ట్‌డివైస్లు కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో చెప్పుకోదగ్గది స్మార్ట్‌ఫోన్ ద్వారానే రైతులు తమ యొక్క బోర్ యొక్క మోటర్లను ఆన్ చేయడం లేదా ఆఫ్ చేయడం వంటివి చేయవచ్చు. అలాగే స్మార్ట్‌లైట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి మీకు నచ్చిన కలర్లను మార్చడానికి వీలుగా ఉంటాయి. వీటి సాయంతో ఇంటిని రంగుల మయం చేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
How Useful Smart Devices These Days To Fight Corona Virus
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X