Home
News

బ్లాక్ స్క్రీన్ మీద ఓ మెదడు మరో మెదడుతో ఆడే వీడియో గేమ్

By Gizbot Bureau

ఇటీవల పెద్దా చిన్నా తేడాలేకుండా అందరూ స్మార్ట్ ఫోన్లతో బిజీగా కనిపిస్తున్నారు. వారిలో ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉన్నవారు ఫేస్ బుక్, వాట్సాప్, ఈ మెయిల్ వంటి వాటికి అతుక్కుపోతున్నారు. అయితే సోషల్ మీడియాతో కాలం గడపడం ప్రతికూల ప్రభావాలను తెచ్చిపెడుతుందని, అంతకంటే ఆన్లైన్ వీడియో గేమ్స్ ఆడటం కొంతవరకూ ఉపయోగపడుతుందని చెప్తున్నారు పరిశోధకులు. ఆన్లైన్ వీడియో గేమ్స్ విద్యార్థుల్లో మెదడుకు పదును పెడతాయని, లెక్కలు, సైన్సు వంటి సబ్జెక్లుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు తోడ్పడతాయని తాజా అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఓ వీడియో గేమ్ ని పరిశోధకులు కనుగొన్నారు. ఇద్దరు వ్యక్తుల మెదడుతో సాగే గేమ్ ఇది. స్కీన్ అంతా బ్లాక్ గా ఉంటుంది. కేవలం మొదడును ఉపయోగించి మాత్రమే ఆడాలి.

మెదడు నుండి మెదడు ఇంటర్‌ఫేస్‌

మెదడు నుండి మెదడు ఇంటర్‌ఫేస్‌

ముగ్గురు వ్యక్తులు మెదడు నుండి మెదడు ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించి టెట్రిస్ లాంటి ఆట ఆడాలి. అలాగే ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ మంది మెదడు నుండి మెదడు నెట్‌వర్క్ ద్వారా ఒక వ్యక్తి యెక్క మెదడును మాత్రమే ఉపయోగించి ఇతరులకు సమాచారాన్ని స్వీకరించడం, పంపడం జరుగుతుంది. 

బ్రెయిన్ నెట్ ఆలోచనతో

స్వంతంగా పరిష్కరించలేని సమస్యలను పరిష్కరించడానికి ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. అలాగే ఇతరుల మెదడుతో దాన్ని పరిష్కరించుకునేందుకు సహకారం తీసుకోవచ్చు. అయితే ఇందులో కేవలం వ్యక్తి మెదడు మాత్రే ఉపయోగించాలి. ఎందుకంటే స్క్రీన్ అంతా బ్లాక్ గా ఉంటుంది. ఏమి కనపడదు.బ్రెయిన్ నెట్ ఆలోచనతోనే దాన్ని పరిష్కరించాలి. దీనిని పరిష్కరించడానికి ఇద్దరు వ్యక్తులు మూడవ వ్యక్తికి సహాయం కూడా చేయవచ్చు.

బ్లాక్‌ స్క్రీన్

టెట్రిస్‌లో మాదిరిగా, ఆట స్క్రీన్ పైభాగంలో ఒక బ్లాక్‌ స్క్రీన్ ను అలాగే కింద భాగంలో పూర్తి చేయాల్సిన పంక్తిని చూపుతుంది. ఒ వ్యక్తి పంపిన బ్లాక్ స్క్రీన్ ని ఇద్దరు వ్యక్తులు చూడవచ్చు. అయితే వారు ఆటను నియత్రించలేరు. ఈ ఆటను స్వీకరించే మూడవ వ్యక్తి మాత్రమే బ్లాక్‌ను చూడగలడు. దాన్ని పూర్తి చేయడానికి అతను మిగతా ఇద్దరు వ్యక్తల సహకారం తీసుకోవచ్చు. 

గేమ్ స్వీకరించిన వ్యక్తి 

ఛాలెంజ్ ను పంపినవారు బ్లాక్‌ను తిప్పాల్సిన అవసరం ఉందో లేదో నిర్ణయించుకుని, ఆ సమాచారాన్ని వారి మెదడు నుండి, ఇంటర్నెట్ ద్వారా మరియు స్వీకర్త యొక్క మెదడుకు పంపుతారు. అప్పుడు రిసీవర్ ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేసుకుని ఒక ఆదేశాన్ని పంపుతాడు. వారి మెదడులో ఏముందో ఈ గేమ్ స్వీకరించిన వ్యక్తి పూర్తి చేయాల్సి ఉంటుంది.

 5 గ్రూపులు 16 రౌండ్ల పాటు ఆడుకోవచ్చు

5 గ్రూపులు 16 రౌండ్ల పాటు ఆడుకోవచ్చు

ఈ గేమ్ ని 5 గ్రూపులు 16 రౌండ్ల పాటు ఆడుకోవచ్చు. ప్రతి గ్రూపులో ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ముగ్గురూ వేర్వేరు రూముల్లో ఉంటూ ఈ గేమ్ పూర్తి చేయాలి. సెండర్ పంపగానే గేమ్ కంప్యూటర్ స్క్రీన్ మీద డిస్ ప్లే అవుతుంది. ఇక్కడ ఎస్ నో అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఎస్ బటన్ కింద సెకండ్ కి 17 సార్లు ఎల్ ఈడి లైట్ ఫ్లాష్ అవుతుంది. నో బటన్ కింద 15 సార్లు ఎల్ ఈడి లైట్ ఫ్లాష్ అవుతుంది. సెండర్ నిర్ణయం తీసుకోగానే బ్లాక్ స్క్రీన్ రొటేట్ అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి మీరు గేమ్ పూర్తి చేయాలి. ఈ గేమ్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. 

Best Mobiles in India

English summary
How you and your friends can play a video game together using only your minds
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X