చాటింగ్ సమయంలో ఏలా ప్రవర్తించాలి..?

|

కమ్యూనికేషన్ ప్రపంచంలో ‘చాటింగ్' సంస్కృతి కొత్త ఒరవడికి తెరలేపింది. ఆధునిక మనుషుల నిత్యకృత్యాలలో భాగంగా మారిపోయిన చాటింగ్ వినోద, విజ్ఞాన, స్నేహ బాంధవ్యాలను పెంపొందిస్తోంది. చాటింగ్ అంటే ఒకరినొకరు సంభాషించుకోవటం. ఈ ప్రక్రియ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌‍లు ఇంకా ప్రాధమిక స్థాయి ఫీచర్ ఫోన్‌ల ద్వారా సాధ్యమవుతోంది. చాటింగ్ అనేది ఇంటర్నెట్ (అంతర్జాలం) ద్వారా సాధ్యపడే ఓ సమాచార వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా ప్రపంచంలో ఎక్కడనుంచైనా ప్రజలు ఒకరినొకరు మాట్లాడుకోవచ్చు. చాటింగ్ ప్రక్రియలో భాగంలో ఒక్కరితో మాత్రమే కాదు ఒకేసారి ఎంతమందితోనైనా సంభాషించుకోవచ్చు.

 
చాటింగ్ సమయంలో ఏలా ప్రవర్తించాలి..?

నేటి తరం సమాచార బంధాలను ధృడ పరచటంలో మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థ కీలకంగా మారింది. స్నేహితులతో చాటింగ్ మొదలుకుని అత్యవసర సమావేశాల వరకు మొబైల్ ద్వారానే సాగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో స్మార్ట్‌ఫోన్ యూజర్లు రీఛార్జుల నిమిత్తం అధిక మొత్తంలో డబ్బులను ఖర్చుపెడుతున్నారు. ఈ క్రమంలో మొబైల్ బిల్లుల నుంచి యూజర్లను విముక్తులను చేసేందుకు ఆన్‌లైన్ చాటింగ్ అప్లికేషన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. ఇంటర్నెట్ ద్వారా చాటింగ్ నిర్వహించుకునేందకు స్కైప్, వుయ్ చాట్, గూగుల్ హ్యాంగ్ అవుట్స్, టాంగో, వాట్స్ యాప్ వంటి ఆన్‌లైన్ అప్లికేషన్‌‍లు అందుబాటులో ఉన్నాయి.

 

చాటింగ్ సమయంలో ఏలా ప్రవర్తించాలి..?

- ముందుగా చాటింగ్‌లోకి ప్రవేశించగానే ఎదుటి వ్యక్తిని మర్యాదపూర్వకంగా పలకరించండి. ఉదాహరణ హల్లో (Hello).

- చాటింగ్ సమయంలో అదేపనిగా పెద్ద అక్షరాలు (క్యాపిటల్ లెటర్స్)ను వాడకండి. క్యాపిటల్ లెటర్స్ కసరుకుంటున్న భావనను కలిగిస్తాయి.

- స్పందించకపోయినా అదేపనిగా అవతలి వ్యక్తికి సందేశాలు పంపకండి.

- చాటింగ్ నుంచి నిష్ర్కమించే సమయంలో సముచిత ప్రవర్తనతో మర్యాదపూర్వకంగా వ్యవహరించండి. (ఉదాహరణకు బై లేదా సీ యూ ఎగెయిన్ అనే పదాలను వాడండి).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X