Home
News

HP ల్యాపీలు పేలుతున్నాయి, రీకాల్ చేస్తున్న కంపెనీ

గ్లోబల్ వ్యాప్తంగా హెచ్‌పి కంపెనీ తయారు చేస్తున్న ల్యాపీలకు మంచి డిమాండ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం స్మార్ట్ ఫోన్లు పేలిన విధంగానే

గ్లోబల్ వ్యాప్తంగా హెచ్‌పి కంపెనీ తయారు చేస్తున్న ల్యాపీలకు మంచి డిమాండ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం స్మార్ట్ ఫోన్లు పేలిన విధంగానే ల్యాప్‌టాప్‌లు కూడా పేలిపోవడం. అయితే ఇది అనధికార సమాచారం.

HP ల్యాపీలు పేలుతున్నాయి, రీకాల్ చేస్తున్న కంపెనీ

దీనికి ఊతంగా గ్లోబల్ ఎలక్ట్రానిక్ దిగ్గజం హెచ్‌పీ ప్రకటన నిలుస్తోంది. ఈ కంపెనీ తయారు చేసిన బ్యాటరీలపై ఇప్పుడు అనేక సందేహాలు పుట్టుకొస్తున్నాయి.

78,500 లిథియం బ్యాటరీలు వెనక్కి

78,500 లిథియం బ్యాటరీలు వెనక్కి

మాన్యుఫ్యాక్చరింగ్ తప్పిదం కారణంగా 78,500 లిథియం బ్యాటరీలను వెనక్కు తీసుకుంటున్నామని సంస్థ చేసిన తాజా ప్రకటన వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదని వారంటున్నారు.

ఈ ఏడాది జనవరిలో ..

ఈ ఏడాది జనవరిలో ..

ముఖ్యంగా ఈ ఏడాది జనవరిలో 50 వేల బ్యాటరీలను రీకాల్ చేసిన సంస్థ తాజాగా మరో ప్రకటన చేసిందని యూఎస్ కన్స్యూమర్ ప్రాడక్ట్ సేఫ్టీ కమిషన్ వెల్లడించింది. అంతకుముందు సంవత్సరంలో 101,000 బ్యాటరీలను రీకాల్ చేసింది.

మంటలొచ్చే అవకాశం

మంటలొచ్చే అవకాశం

లిథియం అయాన్ బ్యాటరీలతో కూడిన ల్యాప్‌టాప్స్ నుంచి మంటలొచ్చే అవకాశం ఉందని స్వయంగా హెచ్‌పీ కంపెనీ ఒప్పుకుంది. ఇవి ప్యాకేజింగ్ సమయంలోనే బాగా వేడెక్కినట్టు ఫిర్యాదులందినట్టు తెలుస్తోంది.

అప్‌డేట్‌ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా

అప్‌డేట్‌ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా

అయితే అప్‌డేట్‌ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా బ్యాటరీల సేఫ్టీ మోడ్‌ను పొందొచ్చంటూ యూజర్లకు ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. యూజర్లు వెంటనే అప్ డేట్ డౌన్లోడ్ చేసుకుని ల్యాపీలను సేఫ్టీ మోడ్ లో ఉంచుకోవాలని కోరింది.

2015 నుంచి ఏప్రిల్ 2018 వరకు

2015 నుంచి ఏప్రిల్ 2018 వరకు

డిసెంబర్ 2015 నుంచి ఏప్రిల్ 2018 వరకు విక్రయించిన నోట్‌బుక్ కంప్యూటర్స్, మొబైల్ వర్క్‌ స్టేషన్స్‌ హెచ్‌పీ లిథియం అయాన్ బ్యాటరీలు ప్రభావితమైనట్టు పేర్కొంది. ఈ మాసంలో కొన్న వినియోగదారులు ఓ సారి చెక్ చేసససుకోవాలని తెలిపింది.

వెబ్‌సైట్‌

వెబ్‌సైట్‌

వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఒక వెబ్‌సైట్‌ను హెచ్‌పీ సంస్థ ఏర్పాటు చేసింది. దీని ద్వారా రీకాల్‌ చేసిన బ్యాటరీ మీ ల్యాప్‌టాప్‌లో ఉందేమో సరిచూసుకోమని కోరుతోంది. కాబట్టి యూజర్లు ఓ సారి వారి ల్యాపీలను సరిచూసుకోండి.

More from GizBot

Best Mobiles in India

English summary
HP is recalling more laptop batteries over fire concerns
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X