34,000 ఉద్యోగాలకు హెచ్‌పి కోత!!

Posted By:

పర్సనల్ కంప్యూటర్ల విక్రయాలు రోజురోజుకు తగ్గుతుండటంతో అమెరికాకు చెందిన ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ హ్యూలెట్ ప్యాకర్డ్ (హెచ్‌పి) ఈ ఏడాది అక్టోబర్‌లోపు 34 వేలవరకు ఉద్యోగాలకు కోత వేయాలని భావిస్తోంది. ఈ కంపెనీ రూపొందించిన కంప్యూటర్లకు గిరాకీ తగ్గటంతో పాటు మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

34,000 ఉద్యోగాలకు హెచ్‌పి కోత!!

ఉద్యోగులకు ఉద్వాసన పలికే క్రమంలోవారికి చెల్లించాల్సిన సొమ్ము క్రింద కంపెనీ 4.1 బిలియన్ డాలర్లు వెచ్చించే అవకాశం ఉంది. హెచ్‌పి కంపెనీ పునర్ వ్యవస్థీకరణ ప్రణాళిక 2012లోనే ప్రారంభమైంది. పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ప్రణాళికా వ్యూహాలు మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగనున్నాయి. హెచ్‌పి తీసుకున్న నిర్ణయం ఏఏ ప్రాంత ఉద్యోగుల పైప్రభావం చూపనుందో తెలియాల్సి ఉంది.

ఐటీ ఉద్యోగులకు 2013 పెద్ద నిరాశగాను చెప్పుకోవచ్చు. అనేక ఐటీ కంపెనీలు తమ సంస్థల నుంచి పలువురు ఉద్యోగులను తొలగించాయి. ఆర్థిక సంక్షోభం, పునర్ వ్యవస్థీకరణ, ఉద్యోగుల పనితీరు ఆశించిన స్థాయంలో లేకపోవటం వంటి అంశాలు ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot