HP నుంచి డ్యూయెల్ స్క్రీన్ ల్యాప్‌టాప్,ప్రపంచంలోనే ఫస్ట్ ల్యాపీ

By Gizbot Bureau
|

టెక్నాలజీ అమితంగా పుంజుకుంటున్న తరుణంలో అంతే స్థాయిలో కొత్త కొత్త టెక్నాలజీ గాడ్జెట్లు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశంలో గేమింగ్ మార్కెట్ కు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న కంపెనీలు గేమింగ్ టెక్నాలజీతో కూడిన ఎన్నో ప్రొడక్టులను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ బిజినెస్‌కు ఫుల్ క్రేజ్ ఉంది.

HP Omen X 2S Laptop With Dual Displays Launched in India

ఇదిలాఉంటే ఈ జనరేషన్ తో పాటు వచ్చేజనరేషన్ కూడా గేమింగ్ టెక్నాలజీపైనే ఎక్కువగా డిఫెండ్ కానున్నాయని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలొనూ ఇండియా మార్కెట్‌లోకి దిగ్గజ HP కంపెనీ కొత్త గేమింగ్ Laptopను ప్రవేశపెట్టింది. దీనిపేరు Omen X 2S. ఈ మోడల్‌తో పాటు HP Omen 15, HP పెవిలియన్ గేమింగ్ 15 ల్యాప్‌టాప్‌ను కంపెనీ లాంచ్ చేసింది.

 ఇండియాలో ధర

ఇండియాలో ధర

15అంగుళాల గల ఈ డైగొనల్ గేమింగ్ ల్యాప్ టాప్ ప్రపంచంలోనే తొలి మోడల్ గా చెప్పుకోవచ్చు. ఈ ల్యాపీని లిక్విడ్ మెటల్‌తో కంపౌడ్ థెర్మల్ సిస్టమ్‌తో డిజైన్ చేశారు. ఈ ల్యాపీలో 9వ జనరేషన్ ఇంటెల్ కోర్ i7 CPUతో కూడిన NVIDIA GeFore RTX 2070 గ్రాఫిక్ కార్డు, 16GB DDR4 మెమెరీ స్లాట్ ఉంది. దీంతో పాటుగా ఒమన్ గేమింగ్ కమ్యూనిటీస్ నుంచి Omen X 2S మోడల్ ను కూడా డిజైన్ చేశారు. ఈ కొత్త మోడల్ జూలై 1 నుంచి అందుబాటులో ఉంటుంది. ఇండియాలో ఈ గేమింగ్ ల్యాపీ ధరను రూ.2లక్షల 09వేల 990గా నిర్ణయించారు.

ఫస్ట్ డ్యుయల్ స్క్రీన్ గేమింగ్ ల్యాప్ టాప్
 

ఫస్ట్ డ్యుయల్ స్క్రీన్ గేమింగ్ ల్యాప్ టాప్

ప్రపంచంలోనే ఫస్ట్ డ్యుయల్ స్క్రీన్ గేమింగ్ Laptop ఇదేనంటూ ఒమన్ ఎక్స్ 2ఎస్ మోడల్ ను తీసుకొచ్చింది. మల్టీటాస్క్ కోసం ఈ ల్యాపీని వినియోగించుకునేలా డిజైన్ చేసినట్టు కంపెనీ తెలిపింది. రియల్ టైం స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్ సాయంతో మెయిన్ స్క్రీన్తో రేసింగ్ గేమ్ ను చూడొచ్చు. అవసరమైతే స్క్రీన్ కూడా షేరింగ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. మ్యాప్ పొర్షన్ కాపీ చేసి రెండో స్క్రీన్ మధ్యభాగంలో కనిపించేలా సెట్ చేసుకునే సదుపాయం ఉంది. 15.6అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లే‌తో 144Hz రీఫ్రెష్ రేట్ తో డిజైన్ చేశారు. సెకండరీ స్క్రీన్ 6 అంగుళాలు ఉండేలా 1080p టచ్ స్క్రీన్ ను కీబోర్డుపైభాగంలో ఇన్‌సర్ట్ చేసి ఉంటుంది. ఈ ల్యాపీలోని మిషన్ 20mm సన్నగా ఫుల్ మెటల్ చట్రం ఉంటుంది.

2 కొత్త గేమింగ్ యాక్ససరీస్

2 కొత్త గేమింగ్ యాక్ససరీస్

ఇతర గేమింగ్ మిషన్లను కూడా హెచ్‌పి కంపెనీ రిలీజ్ చేసింది. HP పెవిలియన్ గేమింగ్ ల్యాప్ టాప్ ధర రూ.70వేల 990 ఉండగా, ఒమన్ 15 ల్యాప్ టాప్ ధర రూ.1లక్ష 24వేల 990గా నిర్ణయించారు. గేమింగ్ ల్యాప్ టాప్ లతోపాటు కంపెనీ రెండు కొత్త గేమింగ్ యాక్ససరీస్ ను కూడా ప్రవేశపెట్టింది. ఒమన్ ఔట్ పోస్టు వైర్ లెస్ మౌజ్ ప్యాడ్ రూ.7వేల 999గా ఉండగా.. పెవిలియన్ గేమింగ్ హెడ్ సెట్ 400 ధర రూ.1,999 కాగా పెవిలియన్ మౌజ్ 300 ధర రూ.1,799గా నిర్ణయించారు.

  గేమింగ్ అనేది ఓ అలవాటు

గేమింగ్ అనేది ఓ అలవాటు

గేమింగ్ అనేది ఓ అలవాటు కాదని, చాలామంది గేమింగ్‌ను తమ ప్రొఫెసన్‌గా మార్చుకుంటున్నారు. గేమింగ్ విషయంలో మా యూజర్లు ఎలాంటి ఆసక్తి చూపిస్తారో వారి అనుభవాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇండియాలో మోడ్రాన్ గేమర్ల కోసం గేమింగ్ ఎకోసిస్టమ్ ను డెవలప్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది' అని హెచ్ పి ఇంక్. ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుమీర్ చంద్ర చెప్పారు.

Best Mobiles in India

English summary
HP Omen X 2S Laptop With Dual Displays Launched in India, Omen 15 and Pavilion Gaming 15 Laptops Refreshed

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X