జులై 1న మార్కెట్ లోకి అరంగేట్రం చేస్తున్న హెచ్‌పి టచ్ ప్యాడ్

Posted By: Super

జులై 1న మార్కెట్ లోకి అరంగేట్రం చేస్తున్న హెచ్‌పి టచ్ ప్యాడ్

లాస్ ఏంజిల్స్: హెచ్‌పి కంపెనీ క్రొత్తగా రూపోందించినటువంటి టచ్ ప్యాడ్ యునైటెడ్ స్టేట్స్‌లో జులై 1వ తారీఖు నుండి విక్రయించనుంది. హెచ్‌పి ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి టాబ్లెట్ కంప్యూటర్ మాత్రమే కాకుండా దీనని హెచ్‌పి కంపెనీ పామ్ ఆపరేటింగ్ సాప్ట్‌వేర్‌తో రూపోందించింది. ఇందులో 16జిబి మొమొరి కలిగినటువంటి టాబ్లెట్ ధర $499.99, కాగా అదే 32జిబి మొమొరి కలిగినటువంటి టాబ్లెట్ ధర $599.99గా నిర్ణయించడమైనది.

నార్త్ అమెరికా, యూరప్ నుండి మాకు భారీగా ఆర్డర్స్ రావడం వల్లనే ఇంత త్వరగా మార్కెట్ లోకి టాబ్లెట్‌ని ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు. మొదటగా యునైటెడ్ స్టేట్స్‌లో విడుదల చేయగా ఆ తర్వాత బ్రిటన్, ఐర్లాండ్, ప్రాన్స్, జర్ననీలో కూడా విడుదల చేస్తామని అన్నారు. ఇక పామ్ కంపెనీని హెచ్‌పి గత సంవత్సరంలో వేసనిలో దాదాపు $1.2 బిలియన్ పెట్టి స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

దీంతో వీరిద్దరూ కలసి రాబోయే కాలంలో స్మార్ట్ ఫోన్స్, ప్రింటర్స్‌లకు వెబ్ ఓయస్ సాప్ట్ వేర్‌ని రూపోందించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి మొబైల్ మార్కెట్‌ని ఆపిల్ డామినేట్ చేస్తుంది. ఇకపోతే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని విడుదల చేసి గూగుల్ కూడా మొబైల్ మార్కెట్‌లో మంచి పోటీని ఇస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot