హెచ్‌పీ నుంచి కొత్త ల్యాప్‌టాప్‌లు.. Spectre 13, Spectre x360

Posted By: BOMMU SIVANJANEYULU

ల్యాప్‌టాప్‌ల తయారీ విభాగంలో అగ్రాగామిగా పేరుగాంచిన హెచ్‌పీ బ్రాండ్ తమ ప్రీమియమ్ కన్స్యూమర్ లైనప్ కోసం రెండు సరికొత్త ల్యాప్‌టాప్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. Spectre 13, Spectre x360 మోడల్స్‌లో ఈ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్‌లలో లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్‌లతో పాటు లాంగెస్ట్ బ్యాటరీ లైఫ్ ఇంకా అత్యాధునిక డిస్‌ప్లే వ్యవస్థలను హెచ్‌పీ పొందుపరిచింది.

హెచ్‌పీ నుంచి కొత్త ల్యాప్‌టాప్‌లు.. Spectre 13, Spectre x360

వీటిలో Spectre 13 మోడల్ ప్రపంచంలోనే అత్యంత నాజూకైన టచ్ ల్యాప్‌టాప్‌గా నిలుస్తుందని హెచ్‌పీ తెలిపింది. 8వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లతో పవరప్ అయిన ఈ క్వాడ్-కోర్ డివైస్ 4కే క్వాలిటీ వీడియో కంటెంట్‌తో పాటు హైక్వాలిటీ ఆడియోను ఆఫర్ చేస్తుందట. సీఎన్‌సీ అల్యూమినియమ్ అలానే కార్బన్ ఫైబర్ మెటీరియల్స్‌తో ఈ ల్యాప్‌టాప్‌ను బిల్ట్ చేసినట్లు హెచ్‌పీ వెల్లడించింది.

సిరామిక్ వైట్ విత్ పేల్ గోల్డ్, డార్క్ యాష్ సిల్వర్ విత్ కాపర్ పాలిష్షుడ్ వేరియంట్‌లలో ఈ ల్యాపీ అందుబాటులో ఉంటుంది. డివైస్ ముందు భాగంలో మైక్రో-ఎడ్జ్ బీజిల్స్‌తో ఏర్పాటు చేసిన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ NBT డిస్‌ప్లే 4కే హై రిసల్యూషన్‌ను ఆఫర్ చేస్తుందట. పెర్ఫామెన్స్ పరంగా ప్రొఫెషనల్ క్వాలిటీ ప్రొడక్టివిటీని స్పెక్ట్రీ 13 ల్యాప్‌టాప్ ఆఫర్ చేస్తుందని హెచ్‌పీ చెబుతోంది.

హెచ్‌పీ నుంచి కొత్త ల్యాప్‌టాప్‌లు.. Spectre 13, Spectre x360

ల్యాపీలో లోడ్ చేసిన 8th Generation Intel® Core™ i5, i7 ప్రాసెసర్లు వేగవంతమైన పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తాయని హెచ్‌పీ పేర్కొంది. స్టోరేజ్ పరంగా ఈ ల్యాపీలో 1TB PCIe SSDని పొందుపరిచారు. 16 GB LPDDR3 ర్యామ్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌ను ఆఫర్ చేస్తుంది.

ఇక బ్యాటరీ డిపార్ట్‌మెంట్ విషయానికి వచ్చేసరికి స్పెక్ట్రీ 13 ల్యాప్‌టాప్‌లో ఇన్సర్ట్ చేసిన బ్యాటరీ సింగిల్ చార్జ్ పై ఏకధాటిగా 11.5 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఆఫర్ చేయగలదట. హెచ్‌పీ ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ ద్వారా 0 నుంచి 50 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్‌ను కేవలం 30 నిమిషాల్లో పొందవచ్చని హెచ్‌పీ తెలిపింది.

హెచ్‌పీ నుంచి కొత్త ల్యాప్‌టాప్‌లు.. Spectre 13, Spectre x360

మరో ల్యాప్‌టాప్ Spectre x360ని ప్రపంచంలోనే లాంగెస్ట్ బ్యాటరీ లైఫ్‌ను ఆఫర్ చేసే ల్యాప్‌టాప్‌గా హెచ్‌పీ అభివర్ణించింది. ఈ ల్యాప్‌టాప్‌లో పొందుపరిచిన బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 16.5 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఆఫర్ చేస్తుందట. ఈ కన్వర్టబుల్ ల్యాప్‌టాప్‌ను టాబ్లెట్‌లా కూడా వినియోగించుకునే వీలుంటుందట.

Spectre x360 ల్యాప్‌టాప్‌కు సంబంధించి ఇతర ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే.. సీఎన్‌సీ అల్యూమినియమ్ అలానే కార్బన్ ఫైబర్ మెటీరియల్స్‌తో ఈ ల్యాప్‌టాప్‌ను బిల్ట్ చేసారు.

iOS 11లో సెక్యూరిటీ అదుర్స్

13 అంగుళాల 4కే NBT టచ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 8th Generation Intel® Core™ i5, i7 ప్రాసెసర్స్, స్టోరేజ్ నిమిత్తం 1TB PCIe SSD హార్డ్‌డిస్క్ డ్రైవ్, 16 GB LPDDR3 ర్యామ్, ఫింగర్ ప్రింట్ రీడర్, విజువల్ హ్యాకింగ్‌ను నిరోధించేందుకు హెచ్‌పీ షూర్ వ్యూ ఇంటిగ్రేటెడ్ ప్రైవసీ స్ర్కీన్ ఆప్షన్, హెచ్‌పీ వైడ్ విజన్ ఫుల్ హైడెఫినిషన్ ఐఆర్ కెమెరా విత్ ఫేషియల్ రికగ్నిషన్ సపోర్ట్, డిస్‌ప్లే పై డ్రాయింగ్స్ అలానే రైటింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం విండోస్ ఇంక్ సర్టిఫైడ్ పెన్.

ఈ రెండు ల్యాప్‌టాప్‌లు అక్టోబర్ చివరి నుంచి ఆసియా-పసిఫిక్ ఇంకా జపాన్ మార్కెట్లలో అందుబాటులో ఉంటాయి. ఇండియన్ మార్కెట్లో వీటి ధరలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

English summary
HP a prominent provider of desktops and laptops has yet again unveiled new innovations to its premium consumer laptop line-up.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot