108MP కెమెరాలో HTC నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు, ధర వివరాలు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ HTC ఎట్టకేలకు తన కొత్త ఫోన్ U23 proను విడుదల చేసింది. అయితే ఈ ఫోన్‌పై ఎప్పటి నుంచే ఎన్నో ఊహాగానాలున్నాయి. తాజాగా VIVERSE ప్లాట్‌ఫాంపై ఈ U23 pro ఫోన్‌ను లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్‌లో కీలక ఫీచర్లు ఉన్నాయి. HTC U23 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు సహా పూర్తి వివరాలు మీకోసం.
HTC U23 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పుల్ హెడ్‌డి+ డిస్‌ప్లేను కలిగి ఉంది. OLED స్క్రీన్‌తో 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో డిస్‌ప్లే కిందనే 32MP సెల్ఫీ కెమెరాను ఏర్పాటుచేశారు. అలాగే డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో వస్తుంది.

HTC U23 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో కెమెరాల విభాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందువైపు 32MP కెమెరా ఏర్పాటుచేశారు. వెనుకవైపు నాలుగు కెమెరాలను అమర్చారు. OISతో 108MP ప్రధాన కెమెరా, 8MP ఆల్ట్రావైడ్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 5MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. LED ప్లాష్‌తో రానుంది. అలాగే 4K వీడియో క్వాలిటీతో రికార్డు చేయవచ్చు.
U23 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 4600mAh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. దాంతోపాటు ఈ ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 15W వైర్‌లైస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. ఈ హెచ్‌టీసీ ఫోన్ వాటర్‌ప్రూఫ్ మరియు డస్ట్ ప్రూఫ్ IP67 రేటింగ్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ కుడివైపున ఫింగర్ ప్రింట్ సెన్సార్ అమర్చారు.
HTC U23 ప్రో స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. U23 ప్రో స్మార్ట్‌ఫోన్ స్నాగ్ డ్రాగన్ 7 జెన్ 1 SoC ఆధారంగా పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేయనుంది.
ఈ ఫోన్ కాఫీ బ్లాక్ మరియు Muxer వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ తైవాన్‌లోనే అందుబాటులో ఉంది. భారత్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుందో HTC సంస్థ ఇంకా స్పష్టం చేయలేదు. భారత కరెన్సీ ప్రకారం.. 8GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీ ధర రూ.45,535 మరియు 8GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీ ధర రూ. 48,215కు కొనుగోలు చేయవచ్చు.
U23 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ఆఫర్ కింద HTC కీలక ప్రకటన చేసింది. ఈ ఫోన్‌తో పాటు హెచ్‌టీసీ బ్లూటూత్‌ను ఉచితంగా అందించనుంది. అయితే ఈ ఆఫర్ ఈ మే నెల ఆఖరు వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








