ఆ హిరో గారి ‘రహస్యాలు’ లీక్!

Posted By: Staff

ఆ హిరో గారి ‘రహస్యాలు’ లీక్!

స్మార్ట్‌ఫోన్ తయారీ విభాగంలో అగ్రశ్రేణి సంస్థలుగా గుర్తింపుతెచ్చుకున్న సామ్‌సంగ్, హెచ్‌టీసీ, నోకియాల మధ్య ‘విండోస్ 8’ యుద్దం మొదలుకానుంది. ఈ బ్రాండ్‌లు వృద్ధి చేసిన విండోస్ ఫోన్ 8 స్మార్ట్‌ఫోన్‌లు అక్టోబర్ లేదా నవంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి.

చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సైట్ వీపీడాంగ్ (WPDang) వెల్లడించిన సమాచారం మేరకు హెచ్‌టీసీ, సెప్టంబర్ మూడో వారం నాటికి సరికొత్త విండోస్ 8 డివైజ్‌లను ఆవిష్కరించనుంది. ఇదే నెలలో నోకియా తన సరికొత్త విండోస్ 8 ఆధారిత

స్మార్ట్‌ఫోన్‌లను ‘వార్షిక నోకియా ప్రపంచ కార్యక్రమం’ వేదికగా ఆవిష్కరించనుంది. ఈ ఏడాది చివరి నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి.

హెచ్‌టీసీ ప్రవేశపెట్టబోతున్న విండోస్ 8 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు:

హెచ్‌టీసీ జినిత్ (HTC Zenith): విండోస్ 8 ఆధారితంగా స్పందించే ఈ డివైజ్ హై రిసల్యూషన్‌తో కూడిన 4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, క్వాడ్ కోర్ ప్రాసెసర్.

హెచ్‌టీసీ ఆకార్డ్ ( HTC Accord): ఈ మధ్య ముగింపు ఫోన్ 4.3 అంగుళాల శక్తివంతమైన డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది. 8 మెగా పిక్సల్ కెమెరా, ధృడమైన ప్రాసెసర్.

హెచ్‌టీ‌సీ రియో ( HTC Rio): 4 అంగుళాల డిస్‌ప్లే, 5 మెగా పిక్సల్ కమెరా, క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8227 ప్రాసెసర్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot