Home
News

50MP సెల్ఫీ కెమెరా తో HTC కొత్త ఫోన్ లాంచ్! ధర,స్పెసిఫికేషన్లు

ప్రకటించినట్లుగానే, HTC ఒక కొత్త U-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. HTC U24 ప్రో, ఇది గత సంవత్సరం HTC U23 ప్రోకి కొనసాగింపుగా వస్తుంది. ఈ HTC ఫోన్ ను తన సొంత దేశంలో తైవాన్ దేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసారు. ఈ లాంచ్ ఈవెంట్ ఈ రోజు ఉదయం 8:00 గంటలకు (IST) జరిగింది.ఈ ఫోన్ 120Hz డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా సిస్టమ్ మరియు మరెన్నో అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ఈ తాజా HTC U24 ప్రో యొక్క ఫీచర్లు మరియు ధరల వివరాలను పరిశీలిద్దాం.

HTC U24 ప్రో ఫీచర్ల వివరాలు
HTC U24 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ రక్షణతో 6.8-అంగుళాల పూర్తి-HD+(1,080x2,436 పిక్సెల్‌లు) OLED ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ పరికరం 12GB LPDDR5 RAM మరియు 512GB వరకు UFS 3.1 స్టోరేజీ తో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 SoC ద్వారా అందించబడుతుంది. ఇది మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా అదనపు స్టోరేజీ ని పెంచుకోవడనికి కూడా మద్దతు ఇస్తుంది.

HTC U24 Pro launched

ఈ HTC U24 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 4600 mAh బ్యాటరీని 60W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో తీసుకువస్తుంది. ఇక కెమెరా వివరాలలో ఇమేజింగ్ కోసం చూస్తే, ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో OIS మరియు EIS మద్దతుతో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా మరియు 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ముందువైపు చూస్తే, HTC U24 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 50MP సెల్ఫీ కెమెరాను పొందుతుంది.

అంతేకాకుండా, ఈ U24 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 OS తో పనిచేస్తుంది. మరియు Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, GPS, NFC మరియు కనెక్టివిటీ కోసం 3.5mm ఆడియో జాక్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ IP67-సర్టిఫైడ్ టెక్నాలజీ ని కూడా కలిగి ఉంటుంది. మరియు పరిమాణంలో 8.98mm మందంతో వస్తుంది.

HTC U24 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ధర మరియు లభ్యత వివరాలు
HTC U24 ప్రో ధర బేస్ 12GB/256GB మోడల్ కోసం TWD 18,990 (సుమారు రూ. 49,000) నుండి ప్రారంభమవుతుంది, అయితే 12GB/512GB స్టోరేజ్ వేరియంట్ TWD 20,990 (సుమారు రూ. 54,229) ధర ట్యాగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ప్రస్తుతం తైవాన్‌లో అందుబాటులో ఉంది, అయితే ప్రపంచ మార్కెట్లో ఎప్పుడు వస్తుందనే విషయంలో ఎటువంటి సమాచారం లేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
HTC U24 Pro Smartphone With Snapdragon 7 Gen 3 SoC Processor, 50MP Selfie Camera Launched. Price Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X