రూ.8,999కే 6జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోండి
చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ఇన్‌ఫినిక్స్ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. దీని పేరు ఇన్‌ఫినిక్స్ హాట్ 7 ప్రో. రెడ్‍మీ 7, శాంసంగ్ గెలాక్సీ ఎం20కి పోటీగా ఇది మార్కెట్లోకి వచ్చింది.

6GB RAMతో రూ.10వేల లోపు విలువ కలిగిన తొలి మొబైల్ ఫోన్ హాట్ 7 ప్రో అని కంపెనీ వెల్లడించింది. దీని ధరను రూ.9,999. స్టార్టింగ్ ఆఫర్ కింద రూ.1,000 డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో ఈ ఫోన్ ని కొనుగోలుదారులు రూ. 8,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్లు మిడ్‌నైట్ బ్లాక్, అక్వా బ్లూ కలర్‌లలో అందుబాటులో ఉన్నాయి.

జూన్ 21వ తేదీ వరకు
ఇందులో 6.19 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. డెడికేటెడ్ మెమొరీ, డ్యుయల్ సిమ్ కార్డు స్లాట్లను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. ఇందులో 4000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. రూ.9,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 17వ తేదీ నుంచి లభ్యం కానుంది. అయితే జూన్ 21వ తేదీ వరకు ఆఫర్ కింద ఈ ఫోన్‌ను రూ.1వేయి తగ్గింపు ధరతో రూ.8,999 ధరకు అందివ్వనున్నారు.

ఇన్ఫినిక్స్ హాట్ 7 ప్రొ ఫీచర్లు
6.19 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఇన్ఫినిక్స్ ఎక్స్‌బ్యాండ్ 3
దీంతో పాటుగా గత వారంలో ఇన్ఫినిక్స్ తన నూతన స్మార్ట్‌బ్యాండ్ ఎక్స్‌బ్యాండ్ 3 ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ బ్యాండ్‌ను రూ.1599 ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇందులో 0.96 ఇంచుల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. 160 x 80 పిక్సల్స్ రిజల్యూషన్‌ను ఈ డిస్‌ప్లే కలిగి ఉంది. ఆండ్రాయిడ్, ఓఐఎస్ డివైస్‌లకు ఈ బ్యాండ్‌ను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో స్టెప్ కౌంటర్, స్లీప్ ట్రాకర్, క్యాలరీ కౌంటర్, స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్స్, సెడెంటరీ రిమైండర్, మ్యూజిక్ కంట్రోల్, హార్ట్ రేట్ సెన్సార్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఈ బ్యాండ్‌లో 90 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీంతో ఈ బ్యాండ్ 10 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3
కాగా కంపెనీ ఏప్రిల్ నెలలో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ ని లాంచ్ చేసింది. కొనుగోలు దారులు దీనిని రూ. 6,999కే సొంతం చేసుకోవచ్చు.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ ఫీచర్లు
6.21 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ హీలియో ఎ22 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications