ఆ పేమెంట్స్‌ యాప్ క్లోజ్ చేశారు, డబ్బులు వెంటనే తీసుకోండి

By Gizbot Bureau
|

ఆదిత్య బిర్లా పేమెంట్స్‌ బ్యాంక్‌ తన సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారులు తన ఖాతాల్లో ఏమైనా నగదు నిల్వలున్నట్లైతే, జూలై 26వ తేదిలోగా విత్‌డ్రా చేసుకోవాల్సిందిగా కోరింది. నగదు విత్‌డ్రా, బదిలీలు చేసుకునేందుకు ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంక్‌, లేదా దగ్గరలోని బ్యాంక్‌ పాయింట్లలో సౌకర్యం కల్పించినట్లు తెలిపింది. ఈ అంశంపై వినియోగదారుల ఏదైనా సమస్యలు, సందేహాల నివృ‍త్తి కొరకు 18002092265 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసింది.

Aditya Birla Payments Bank to shut shop only 17 months into operations

వ్యాపార ప్రక్రియలో భాగంగా ఈ అనూహ్య నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినట్లు కంపెనీ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. పేమెంట్స్‌ బ్యాంక్‌ సేవలను అందించేందుకు ఆదిత్య బిర్లా నువా, ఐడియా సెల్యూలార్‌ సంస్థలు 51:49 నిష్పత్తిలో ఏడాది క్రితం జాయింట్‌ వెంచర్‌ను ప్రారంభించాయి.

ఆర్థికంగా లాభదాయకంగా లేకపోవడంతో

ఆర్థికంగా లాభదాయకంగా లేకపోవడంతో

ఊహించని పరిణామాలు, ఆర్థికంగా లాభదాయకంగా లేకపోవడంతోనే తమ వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లైసెన్సును ఇచ్చిన విషయం తెలిసిందే.

 2018 ఫిబ్రవరిలో

2018 ఫిబ్రవరిలో

2018 ఫిబ్రవరిలో అదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంకును ప్రారంభించిన 17నెలల తర్వాత మూసివేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. అదిత్య బిర్లా నువో లిమిటెడ్ (51శాతం వాటా) ఐడియా సెల్యూలర్ (49శాతం వాటా) భాగస్వామ్యంతో సంయుక్తంగా పేమెంట్స్ బ్యాంకును ప్రారంభించాయి. 2015లో 11 పేమెంట్స్ సంస్థలకు ఆర్బీఐ జారీ చేసిన లైసెన్స్ ల తర్వాత పేమెంట్స్ ఆపరేషన్స్ ప్రారంభించిన నాల్గో పేమెంట్స్ బ్యాంకు ఇదే.

అక్టోబర్ 18 లాస్ట్

అక్టోబర్ 18 లాస్ట్

అదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంకు చివరి పనిదినం అక్టోబర్ 18గా తెలిపింది. దీనిపై ఇప్పటికే పేమెంట్స్ బ్యాంకు వాడే వినియోగదారులకు కంపెనీ అలర్ట్ చేసింది. జూలై 26, 2019 నుంచి అదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంకులో నగదు జమ చేయడాన్ని పరిమితం చేయనున్నట్టు తెలిపింది. అదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంకులో మొత్తం కస్టమర్లు డిపాజిట్లు చేసిన నగదు రూ.20 కోట్లుగా వెల్లడించింది. పేమెంట్స్ బ్యాంకులో వ్యాపారపరంగా సమస్యలు చుట్టుముట్టడంతో ఈ పరిస్థితికి దారితీసినట్టు నివేదిక తెలిపింది.

 రూ.లక్ష వరకు మాత్రమే

రూ.లక్ష వరకు మాత్రమే

ఒక్కో కస్టమర్ నుంచి రూ.లక్ష వరకు మాత్రమే డిపాజిట్లను అనుమతిస్తోంది. రుణాలు ఇవ్వదు. రుణాలపై వచ్చే ఆదాయంపై వడ్డీ లేకపోవడం.. చిన్న డిపాజిట్లతో తక్కువగా ఆదాయం ఉండటమే కాకుండా.. ప్రాసిసింగ్, ట్రాన్స్ జెక్షన్ ఫీజు వంటి ఛార్జీలు, ప్రొడక్టుల విక్రయంపై కమిషన్ వంటి వాటిపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చేది. KYC నిబంధనలకు లోబడి ఉండాల్సిన అవసరం ఉంది.ఇతర పోటీదారులైన పేటీఎం పేమెంట్స్ బ్యాంకు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుల తీవ్ర పోటీని తట్టుకోలేక పోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.

 పేమేంట్‌ బ్యాంకుల్లో రూ.780 కోట్ల నిల్వలు

పేమేంట్‌ బ్యాంకుల్లో రూ.780 కోట్ల నిల్వలు

కాగా అదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంకు నుంచి 160మంది ఉద్యోగులు ఇప్పటికే తొలగించారని, వారిని అదిత్య బిర్లా మరో గ్రూపులోకి మార్చేసినట్టు రిపోర్టు తెలిపింది. వోడాఫోన్ M-Pesa పేమెంట్స్ ఆపరేషన్స్ కూడా జూలై 15 నుంచి నిలిచిపోయినట్టు ఓ రిపోర్టర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశంలో ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంకు, పేటియం పేమెంట్‌ బ్యాంకు అత్యధిక డిపాజిట్‌ నిల్వలు కలిగి ఉన్నాయి. 2018 డిసెంబర్‌ నాటికి మొత్తం పేమేంట్‌ బ్యాంకుల్లో రూ.780 కోట్ల నిల్వలు ఉన్నాయని ఆర్‌బిఐ గణంకాలు చెబుతున్నాయి. కాగా ఈ 2017-18లో ఈ సంస్థలు రూ.516 కోట్ల నష్టాలు చవి చూశాయి. 2018-19కి సంబంధించిన గణంకాలను ఆర్‌బిఐ వెల్లడించలేదు.

Best Mobiles in India

English summary
Aditya Birla Payments Bank to shut shop only 17 months into operations

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X