రూ 4 వేలకే షియోమి రెడ్‌మి స్మార్ట్‌ఫోన్
చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ నుంచి వస్తున్న తొలి ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత్‌లో విడుదల కానుంది. ఈ నెల 19న మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్న షియోమీ ఈ మేరకు మీడియాకు ఆహ్
చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ నుంచి వస్తున్న తొలి ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత్‌లో విడుదల కానుంది. ఈ నెల 19న మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్న షియోమీ ఈ మేరకు మీడియాకు ఆహ్వానాలు పంపింది. రెడ్‌మీ గో స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ.5,400 వరకు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం షియోమీ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ అయిన రెడ్‌మీ 6ఎ ధర రూ.5,999గా ఉంది.

Xiaomi Redmi Go ఫోన్ ధర రూ.3,000 నుంచి రూ.4,000 శ్రేణిలో ఉండొచ్చు.ఇప్పటికే రెడ్‌మి నోట్ 7, రెడ్‌మి నోట్ 7 ప్రో తర్వాత మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

తొలి గూగుల్ ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్
రెడ్‌మి గో స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే ఇతర మార్కెట్లలో అందుబాటులో ఉంది. షియోమి నుంచి వస్తున్న తొలి గూగుల్ ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి గో అని చెప్పవచ్చు. మ్యాప్స్ గో, యూట్యూబ్ గో వంటి యాప్స్ ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. వివిధ రంగుల్లో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి.

రెడ్‌మీ గో స్పెసిఫికేషన్:
డ్యూయల్ సిమ్ (నానో), 5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 425 ఎస్ఓసీ, 1జీబీ ర్యామ్/8జీబీ స్టోరేజీ, 1జీబీ ర్యామ్/16 జీబీ స్టోరేజీ వేరియంట్లు ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్, డ్యుయల్ సిమ్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ట్విట్టర్ లో పోస్ట్
ఈ మేరకు షియోమి ఇండియా హెడ్ మను కుమార్ జైన్ హిందీలో ఈ ఫోన్ యొక్క లాంచ్ టీజర్ ను ట్వీట్ చేసాడు. టీజర్ ట్వీట్ లో microsite on Mi.com లింక్ కూడా ఉంది, ఆ పేజీలో అనేక మంది బిట్బిట్లు ఉన్నాయి, వీటిని కూడా Redmi Go ఫోన్ కు సూచించవచ్చు,హిందీ గూగుల్ అసిస్టెంట్ తో పాటు 20 ప్రాంతీయ భాషలకు మద్దతు ఇస్తుంది.

లాంచింగ్ తేదీ
ఈ నెల 19వ తేదీన ఈ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్టు షియోమి ప్రకటించింది.Xiaomi Redmi Go ఫోన్ ధర రూ.3,000 నుంచి రూ.4,000 శ్రేణిలో ఉండొచ్చు.


Click it and Unblock the Notifications








