ఫస్ట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 836 గూగుల్ డివైస్‍దే..

By: Madhavi Lagishetty

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. మార్కట్లో రకరకాల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కంపెనీ పదుల సంఖ్యలో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించే క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ చిప్ గురించి చాలా కాలంగా వింటున్నాం. అయితే ఈ ఏడాది స్నాప్ డ్రాగెన్ 836SoC ను వినియోగించిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో రిలీజ్ అయ్యాయి.

ఫస్ట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 836 గూగుల్ డివైస్‍దే..

CPU, GPUఉన్నప్పటికీ స్నాప్ డ్రాగన్ 835, స్నాప్ డ్రాగెన్ 836SoC అనేది అత్యంత శక్తివంతమైన వేరియంట్ లో పనిచేస్తుంది. ఈ సంవత్సరం ఆగస్టు 23న లాంచ్ కానున్న ఫ్లాగ్ షిప్ స్మార్టో ఫోన్ గెలాక్సీ నోట్ 8 మొబైల్ లో SoC చిప్ ను వినియోగించారు. అయితే గూగుల్ పిక్సెల్ 2లో మొట్టమొదటి స్నాప్ డ్రాగెన్ SoC ఉపయోగించారని Fudzilla అనే వెబ్ సైట్ పేర్కొంది.

గత ఏడాది మాదిరిగానే స్నాప్ డ్రాగెన్ 836 ను ఈ ఏడాది సగంలో ఫ్లాగ్ షిప్ ద్వారా ఉపయోగించారు. 2016లో స్నాప్ డ్రాగన్ 821, స్నాప్ డ్రాగన్ 820 వేరియంట్లలో అప్ గ్రేడ్ చేసి విడుదల చేశారు. జియోమి, ఎమ్ఐ మిక్స్2, ఎమ్ఐ నోట్ 3, ఎమ్ఐ 6s మొబైలలోఉపయోగించారు. Oneplus 3Tతో చేసిన విధంగా ఫ్లాగ్ షిప్ Oneplus5 అప్ గ్రేడెడ్ వేరియంట్ ను ప్రారంభించాలని కంపెనీ అనుకుంటుంది. అయితే అటువంటి పరికరానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Fudzilla రిపోర్ట్ ప్రకారం ఈ ఏడాది విడుదల కానున్న ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో స్నాప్ డ్రాగన్ 836 మాత్రమే ఉపయోగించినట్లు పేర్కొంది. బెంచ్మార్క్ లిస్టింగ్ ఇంకా ప్రొసెస్ లో ఉందని తెలిపింది. కానీ స్నాప్ డ్రాగెన్ 840 , స్నాప్ డ్రాగెన్ 845 SoCs బెంచ్మార్క్ సైట్లు మచ్చల వేశారు. 2018లో రానున్న స్మార్ట్ ఫోన్లు, గెలాక్సీ S9 మొబైల్ రాబోయో మొదటి మొబైల్ ఫ్లాట్ ఫాం అని భావిస్తున్నాం అని పేర్కొన్నారు.

English summary
Google Pixel 2 is likely to be the first device to be powered by the upgraded Qualcomm Snapdragon 836 SoC.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot