Home
News

వొడాఫోన్ నుంచి రెండు సరికొత్త ప్లాన్లు

By Gizbot Bureau

దేశీయ టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న వొడాఫోన్ యూజర్లను ఆకట్టుకునేందుకు మరో రెండు కొత్త ప్లాన్లను ఆవిష్కరించింది. జియో రాకతో టెలికం దిగ్గజాలు అన్నీ లాభాలను వదిలి నష్టాల బాట పట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తరువాత మెల్లిగా కోలుకుంటూ వచ్చాయి. జియోతో పోటీగా ఆఫర్లను ప్రకటిస్తూ పోతున్నాయి.

Vodafone Rs. 205, Rs. 225 Prepaid Plans Launched For Select Subscribers

ఇందులో భాగంగానే వొడాఫోన్ మరో రెండు కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను ప్రకటించింది. వీటి ద్వారా 4జీబీ డేటాతోపాటు అపరిమిత వాయిస్ కాల్స్, 600 మెసేజ్‌లు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. కొత్త వాటిలో ఒకటి రూ.205 రీచార్జ్ ప్యాక్ కాగా, మరోటి రూ.225 ప్రీపెయిడ్ ప్యాక్. ఈ ప్లాన్ల వివరాలు ఏంటో చూద్దాం.

రూ.205 ప్యాక్

రూ.205 ప్యాక్

రూ.205 ప్యాక్ కాలపరిమితి 35 రోజులు. రూ.205 ప్లాన్‌లో 2జీబీ 3జీ/4జీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్, 600 మెసేజ్‌లు వంటి ప్రయోజనాలు ఈ ప్లాన్ ద్వారా లభిస్తాయి. దీంతోపాటు వొడాపోన్ ప్లే యాప్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే, ‘జీ5 థియేటర్' యాక్సెస్‌ కూడా లభిస్తుంది.

 రూ.225 ప్లాన్

రూ.225 ప్లాన్

రూ.225 ప్లాన్ కాలపరిమితి 48 రోజులు. 4జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్, 600 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. దీంతోపాటు వొడాపోన్ ప్లే యాప్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే, ‘జీ5 థియేటర్' యాక్సెస్‌ కూడా లభిస్తుంది.

ఏడాది అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం

ఏడాది అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం

వొడాఫోన్ కంపెనీ కూడా ఏడాది అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. వొడాఫోన్ రెడ్ పోస్ట్‌పెయిడ్ యూజర్లకు మాత్రమే ఈ సేవలు లభిస్తాయి. రూ.399, ఆపైన ప్లాన్లకు ఇది వర్తిస్తుంది. యూజర్లు వొడాఫోన్ ప్లే యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

 రూ.1,699 ప్లాన్‌

రూ.1,699 ప్లాన్‌

అధిక డేటాను కోరుకునే కస్టమర్లు రూ.1,699 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్‌లో వొడాఫోన్ యూజర్లు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, రోజుకు 1 జీబీ 4జీ డేటా వంటి ప్రయోజనాలు పొందొచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. అయితే ఈ ప్లాన్ కేవలం 12 జీబీ డేటాను మాత్రమే అందిస్తోంది. ఇతర కంపెనీల లాంగ్ టర్మ్ ప్లాన్లు రోజుకు 1 జీబీ డేటాను అందిస్తున్న విషయం తెలిసిందే. ఎయిర్‌టెల్ రూ.998 ప్రిపెయిడ్ ప్లాన్‌కు పోటీగా వొడాఫోన్ రూ.999 ప్లాన్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ ప్లాన్ పంజాబ్ సర్కిల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఇతర సర్కిళ్లలోనూ అందుబాటులోకి రావొచ్చు. ఇకపోతే వొడాఫోన్ 999 ప్లాన్‌లో ఎలాంటి టాక్‌టామ్ రాదు. అయితే వొడాఫోన్ ప్లే సబ్‌స్క్రిప్షన్ మాత్రం ఉచితంగా పొందొచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone Rs. 205, Rs. 225 Prepaid Plans Launched For Select Subscribers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X