Home
News

ఫీచర్ ఫోన్లకు వాట్సప్ వచ్చేసింది,ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి

By Whatsapp-officially-available-for-jiophone-nokia-8110-via-kaios-store

జియో ఫీచర్ ఫోన్ అలాగే నోకియా 8110 ఫోన్లు వాడేవారికి వాట్సప్ శుభవార్తను అందించింది. ఇకపై ఈ ఫోన్లలో అధికారికంగా వాట్సప్ అందుబాటులోకి రానుంది. అలాగే లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టం ఉన్న ఫీచర్ ఫోన్లకు ఇకపై వాట్సప్ కియోస్ సోర్ ద్వారా అందుబాటులోకి రానుంది. Jio Phone, Jio Phone 2 and Nokia 8110లతో పాటు KaiOS ద్వారా రన్నింగ్ అయ్యే అన్ని రకాల ఫీచర్ ఫోన్లకు వాట్సప్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

WhatsApp Officially Available For Jio Phones, Nokia 8110 via KaiOS Store

ప్రపంచ వ్యాప్తంగా కియోస్ ఫీచర్ ఉన్న ఫీచర్ ఫోన్లకు కియోస్ స్టోర్ ద్వారా వాట్సప్ ఫీచర్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీని ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఫీచర్ ఫోన్లు వాట్సప్ ఫీచర్ తో అధికారికంగా అందుబాటులోకి రానున్నాయి.

KaiOS Store నుండి వాట్సప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి

KaiOS Store నుండి వాట్సప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి

యూజర్లు తమ ఫీచర్ ఫోన్లలో వాట్సప్ పొందాలనుకుంటే ముందుగా వారు KaiOS Store నుండి వాట్సప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. 512MB and 256MB RAM దానిపైన ఫోన్లకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. చాలా స్మార్ట్ ఫీచర్ ఫోన్స్ లో KaiOS ఆపరేటింగ్ సిస్టం రన్ అవుతోందని వీటన్నింటికి వాట్సప్ ఫీచర్ అందిస్తామని కంపెనీ తెలిపింది.

100 దేశాల్లో 100 మిల్లియన్ ఫోన్స్

100 దేశాల్లో 100 మిల్లియన్ ఫోన్స్

100 దేశాల్లోని 100 మిల్లియన్స్ ఫీచర్ ఫోన్స్ కియోస్ ఆపరేటింగ్ సిస్టంతో వచ్చాయని కియోస్ టీం తెలిపింది. అంతేకాకుండా ప్రపంచంలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ తరువాత మూడవ ఆపరేటింగ్ సిస్టం ఇదేనని కంపెనీ ప్రకటించింది. Nokia 8110 అలాగే జియో రెండు ఫోన్లు ఫీచర్ ఫోన్ మార్కెట్లో కియోస్ ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లాయని ఈ ఫోన్ల ద్వారానే కియోస్ ఆఫరేటింగ్ సిస్టం మార్కెట్లో దూసుకుపోతుందని తెలిపింది.

ఆ ఫోన్ల లిస్ట్ ఇదే.

ఆ ఫోన్ల లిస్ట్ ఇదే.

ఇప్పుడు కియోస్ ఆపరేటింగ్ సిస్టంతో నడుస్తున్న ఫోన్ల జాబితాను కంపెనీ ప్రకటించింది. ఆ ఫోన్ల లిస్ట్ ఇదే.

Alcatel Go Flip 2

Cat B35

Doro 7050 and 7060

Energy E241S and E241

JioPhone (Reliance Jio)

JioPhone 2 (Reliance Jio)

MaxCom 241

MTN Smart

Multilaser ZAPP

Nokia 8110 (HMD Global)

Orange Sanza

Positivo P70S

WizPhone WP006

Alcatel Go Flip

 

కియోస్ బ్లాగ్ ప్రకారం..

కియోస్ బ్లాగ్ ప్రకారం..

కియోస్ బ్లాగ్ లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. గ్లోబల్ వైడ్ గా కియోస్ ఆపరేటింగ్ సిస్టం అంచనాలకు మించి లాభాలను అందుకుంటున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ యుగంలో కమ్యూనికేషన్ అనేది ముఖ్యమైనదిగా ఉన్న నేపథ్యంలో ఫీచర్ ఫోన్లతో కూడా స్మార్ట్ కమ్యూనికేషన్ అందుకునే విధంగా కియోస్ ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగానే డిజిటల్ విప్లవానికి నాంది పలికింది. ఫీచర్ ఫోన్లకు వాట్సప్ అందించడం ద్వారా బిలియన్ యూజర్లు స్మార్ట్ వైపై అడుగులు వేయనున్నారు.

Best Mobiles in India

English summary
WhatsApp Officially Available For Jio Phones, Nokia 8110 via KaiOS Store
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X