ఇంటెల్ నుంచి 1.5 లక్షల ఉద్యోగాలు,ఎప్పుడు,ఎక్కడ తెలుసుకోండి

By Gizbot Bureau
|

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ మేధస్సును ఉన్నదున్నట్లు గా ఆవిష్కరించే నయా ఇంజినీరింగ్. భవిష్యత్తు ను శాసించాలంటే ఇంజినీరిం గ్ లో చేరే విద్యార్థులు ఎంచుకోవాల్సిన అసలు సిసలైన అడ్వాన్స్ డ్ కోర్సు ఇదే. ఇప్పటికే ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్లు కావాలంటూ కాలేజీలకు క్యూ కడుతున్నాయి.

 
Intel has trained more than 1.5 lakh people on AI technology in India

ఇందులో భాగంగానే కంపెనీలు కూడా విద్యార్థులకు, ప్రొఫెసర్లకు ఈ రంగంలో శిక్షణ అందిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే దిగ్గజ సాప్ట్ వేర్ సంస్థ ఇంటెల్ ఓ అడుగు ముందుకేసింది.

1.5 లక్షల ఉద్యోగాలు

1.5 లక్షల ఉద్యోగాలు

గత రెండేళ్లలో భారతదేశంలో 150 సంస్థలకు చెందిన డెవలపర్లు, విద్యార్థులు, ప్రొఫెసర్లకు ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ ఇచ్చినట్టు కంప్యూటర్ చిప్స్ తయారు చేసే దిగ్గజ కంపెనీ అయిన ఇంటెల్ ప్రకటించింది. దాదాపు ఈ రంగంలో 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపింది. వారిని ట్రైనీలుగా తీసుకుని శిక్షణ అందించింది.

 ఇంటెల్ ఉద్యోగుల్లో 50 శాతం మందికి

ఇంటెల్ ఉద్యోగుల్లో 50 శాతం మందికి

అంతేకాదు భారతదేశంలో పనిచేస్తున్న ఇంటెల్ ఉద్యోగుల్లో 50 శాతం మందికి ఈ శిక్షణ ఇచ్చినట్టు ఇంటెల్ తెలిపింది. బుధవారం బెంగళూరులో Intel AI DevCamp పేరుతో ప్రీమియర్ గ్లోబల్ ఏఐ డెవలపర్ ఈవెంట్ నిర్వహించింది ఇంటెల్. ఈ ఈవెంట్‌లో సైంటిస్టులు, డెవలపర్లు, అనలిస్టులు, ఇంజనీర్లకు ఏఐ టూల్స్ అందజేసింది.

 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి పెరుగుతున్న డిమాండ్
 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి పెరుగుతున్న డిమాండ్

ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా కొత్త కోర్సులు రూపొందుతున్నాయి. మరోవైపు ఇంటెల్ లాంటి కంపెనీలు కూడా భావి ఇంజనీర్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ ఇస్తూ కావాల్సిన నైపుణ్యాలని అందిస్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

 2.5 శాతం మంది మాత్రమే ఏఐ నిపుణులు

2.5 శాతం మంది మాత్రమే ఏఐ నిపుణులు

మన దేశంలో కేవలం 2.5 శాతం మంది మాత్రమే ఏఐ నిపుణులున్నట్లు నేషనల్ ఎంప్లాయబిలిటీ సర్వే తేల్చింది. అలాగే 2025 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ విలువ దాదాపు 90 బిలియన్ డాలర్లకు చేరుకుంటుం దని అంచనా. ఏఐపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారిం చి ఈ ఏడాది జూన్‌‌లో "నేషనల్ స్ట్రా టజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్" పేరుతో రిపోర్టును తయారు చేసింది. ఇందులో ఏఐ నిపుణుల అవసరాన్ని ప్రస్తావించింది.

కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఏఐసీటీఈ నిర్ణయం

కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఏఐసీటీఈ నిర్ణయం

ఈ నేపథ్యంలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నిపుణులను తయారు చేయాలంటే కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఏఐసీటీఈ నిర్ణయించిం ది. దీంతో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కు అనుబంధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్ బిగ్ డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతులిచ్చింది. ఐఐటీ, ఎన్ ఐటీల్లో ఇప్పటివరకు ఒక సబ్జెక్టుగా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు నాలుగేళ్ల కోర్సుగా అందుబాటులోకి వచ్చింది.

యావరేజ్ ప్యాకేజీ 14.3 లక్షలు

యావరేజ్ ప్యాకేజీ 14.3 లక్షలు

ఏఐ నిపుణుల సగటు వార్షిక వేతనం 14.3 లక్షలుగా అంచనా వేశారు. ఈ విభాగంలో ప్రస్తుతం ఏఐ బిజినెస్ డెవలపర్ , ఏఐ టెక్నీషియన్, ఏఐ అనలిటిక్స్ ఎగ్జిక్యూ టివ్స్ , మెషిన్ టీమిం గ్ మేనేజర్, డేటా డిటెక్టివ్ వంటి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి . బీటెక్ చేసిన వారికి కనీసం 5 నుం చి 10 లక్షలు, ఎంటెక్ , ఇతర కోర్సులు చదివిన వారికి 25 లక్షలకు పైగా ప్యాకేజీలు లభిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Intel has trained more than 1.5 lakh people on AI technology in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X