ఇండియాలో 5జీ ట్రయల్ సక్సెస్, దూకుడు మీదున్న భారతీ ఎయిర్‌టెల్ !

By Hazarath

  దేశీయ టెలికం దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్, అలాగే చైనాకు చెందిన నెట్‌వర్కింగ్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్స్‌ ఉపకరణాల తయారీ సంస్థ హువాయి తాజాగా భారత్‌లో తొలిసారి 5జీ నెట్‌వర్క్‌ ట్రయల్స్‌ను నిర్వహించాయి. ఇందులో 3 గిగాబైట్‌ పర్‌ సెకన్‌ (జీబీపీఎస్‌)కు పైగా డేటా స్పీడ్‌ను సాధించినట్లు ఇరు కంపెనీలు ప్రకటించాయి. గురుగావ్‌లోని మానేసర్‌ వద్ద ఉన్న ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌లో ఈ ట్రయల్స్‌ జరిగాయి. 5జీ దిశగా మా ప్రయాణానికి తాజా ట్రయల్స్‌ చాలా కీలకమైనవి. మన జీవన విధానాన్ని మార్చగలిగే శక్తిసామర్థ్యాలు 5జీకి ఉన్నాయి. భారత్‌లో ఈ కొత్త టెక్నాలజీ ఏర్పాటుకు మా భాగస్వాములతో కలిసి పనిచేస్తాం' అని భారతీ ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్స్‌ డైరెక్టర్‌ అభయ్‌ సావర్గొంకర్‌ తెలిపారు. తాము 5జీ టెక్నాలజీ అభివృద్ధికి, దాని ఉపయోగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని హువావే వైర్‌లెస్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఎమ్మాన్యూల్‌ కోయెల్హో అల్వెస్‌ పేర్కొన్నారు.

   

  ఫ్లిప్‌కార్ట్‌లో మోటో సేల్ , తగ్గింపు పొందిన ఫోన్లు ఇవే !

  5జీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాం. ఓ లుక్కేయండి. 

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  5జీ అంటే ఏంటీ

  3జీ ,4జీ నెట్‌వర్క్‌లతో పోలిస్తే దీని వేగం అపరిమితంగా ఉంటుంది. సిగ్నల్ లేని ప్రదేశాల్లో కూడా అపరిమిత వేగంతో మీకు అప్ లోడ్ కాని డౌన్ లోడ్ కాని ఉంటుంది. ఈ వేగం 4జీ కన్నా ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది.

  జనరేషన్ మధ్య తేడాలు

  తొలితరం నెట్‌వర్క్ 1జిలో కాల్స్ మాత్రమే చేసుకునేవారు. దాని తరువాత వచ్చిన 2 నెట్‌వర్క్‌లో కాల్స్‌తో పాటు మెసేజ్‌లు కూడా పంపుకునే స్థాయికి వచ్చింది. ఇక తరువాత వచ్చిన 3జీలో ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చింది.ఇంటర్నెట్ వాడకంతో అందరూ తెగ ఖుషీ అయ్యారు కూడా. తరువాత వచ్చిన 4జీ ఏకంగా వీడియో కాల్స్‌తో పాటు పెద్ద పెద్ద ఫైల్స్ ను క్షణాల్లో పంపే స్థాయికి వచ్చింది.

  5జీ ఉపయోగం

  5జీ వల్ల ఉపయోగం ఏంటంటే ఒక కిలోమీటర్ పరిధిలో దాదాపు మిలియన్ మంది 5జీ నెట్‌వర్క్‌ని అందుకునే కెపాసిటి ఉంటుంది. మిలియన్ మొబైల్స్ కి ఇది ఒకేసారి ఎటువంటి అంతరాయం లేకుండా సపోర్ట్ చేస్తుంది. 3జీ,4జీ కన్నా ఎన్నో రెట్లు వేగంతో అందుకుంటుంది.

  డేటా స్పీడ్

  5జీ డేటా స్పీడ్ విషయానికొస్తే 4జీ కన్నా 20 రెట్లు వేగంతో కనెక్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే పూర్తి స్థాయి హై ఢెఫినేషన్ సినిమాని కేవలం ఒక సెకండ్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 5జీ ultra-low latency rate కూడా 1 మిల్లి సెకండ్ ఉంటుంది. అదే 4జీలో అయితే 10మిల్లి సెకండ్స్ ఉంటుంది.

  అనుభూతి

  ఈ స్పీడ్ లో మీరు ఎటువంటి అంతరాయం లేకుండా వీఆర్ ఏఆర్ లాంటి హై క్వాలిటీ కార్యక్రమాలను వీక్షించవచ్చు. సిగ్నల్ తక్కువగా ఉన్న సమయంలో కూడా మీకు ఎటువంటి అంతరాయం కలుగదు.

  5జీ స్టాండర్డ్స్

  The International Telecommunication Union (), United Nations agencyలు ఈ స్టాండర్స్ ని గుర్తించేందుకు, తగు సలహాలు ఇచ్చేందుకు సాయం చేస్తున్నాయి. Asia, Europe and North Americaల మధ్య సహకారానికి ఈ సంస్థలు పనిచేస్తున్నాయి.ఈ 5జీని బయటకు తీసుకురావడానికి ఇప్పుడు సంయుక్తంగా ITUతో కలిసి Third Generation Partnership Project (3GPP) and the GSM Association (GSMA) పనిచేస్తున్నాయి.

  డీల్

  విస్తారమైన ఈకో సిస్థం ద్వారా జీఎస్ఎమ్ దాదాపు 800 మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్స్, 300 కంపెనీలతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తోంది. హ్యాండ్‌సెట్‌లలో 5జీ ట్రయల్స్ నిర్వహించాలని చూస్తోంది. ఈ మేరకు సాప్ట్‌వేర్ కంపెనీలతో అలాగే పరికరాలను సరఫరా చేసే టెలికమ్యూనికేషన్స్ సంస్థలతో మంతనాలు కూడా జరుపుతోంది.

  ముందున్న దేశాలు

  చైనా , జపాన్, సౌత్ కొరియాలు ఇప్పటికే 5జీ మీద టెస్టింగ్ లు నిర్వహిస్తున్నాయి. 5జీ రిలేటెడ్ మొబైల్స్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాయి. అక్కడ ఇప్పటికే హై లెవల్ 4జీ సమర్థవంతంగా రన్ అవుతోంది. 5జీ డెవలప్ కోసం ప్రభుత్వం కూడా కంపెనీలకు సపోర్ట్ చేస్తోంది.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Huawei, Airtel conduct India’s first successful 5G network trial in India More News at Gizbot Telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more