హువావీ అసెండ్ పీ7: పది కిల్లర్ ఫీచర్లు

Posted By:

టెక్నాలజీ సొల్యూషన్స్ (ఐసీటీ) అలానే మొబైల్ ఫోన్‌ల తయారీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్న హువావీ తాజాగా అసెండ్ పీ7 పేరుతో హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. అసెండ్ పీ6కు సెక్సెసర్ వర్షన్‌గా విడుదలైన ఈ 4జీ ఎల్టీఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకునే డిజైనింగ్ అలానే అత్యుత్తమ ఫీచర్లతో టాప్‌క్లాస్ స్మార్ట్‌ఫోన్‌గా అవతరించింది. ఈ పోన్ ధర రూ.24,000.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, సరికొత్త ఎమోషన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 2.3, కేవలం 6.5 మిల్లీమీటర్ల మందంతో రూపకల్పన కాబడిన ఈ స్లిమ్ 4జీ ఫోన్ మార్కెట్లో సరికొత్త రికార్డులను నెలకొల్పనుంది. హువావీ అసెండ్ పీ7 స్మార్ట్‌ఫోన్‌లోని 10 బెస్ట్ ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హువావీ అసెండ్ పీ7: పది బెస్ట్ ఫీచర్లు

శక్తివంతమైన నిర్మాణం

హువావీ అసెండ్ పీ7 స్మార్ట్‌ఫోన్ రోజువారి స్మార్ట్ మొబైలింగ్ కార్యకలాపాలకు బేషుగ్గా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ ముందు వెనుక భాగాల్లో ఏర్పాటు చేసిన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కవర్లు ఫోన్ పటిష్టతను మరింత పెంచేసాయి. స్లీక్ డిజైనింగ్ ఆకట్టుకుంటుంది. 7 లేయర్లతో కూడిన ఫోన్ రేర్ ఇంటర్‌ఫేస్ అధునాతన మెటాలిక్ లుక్‌ను అందిస్తుంది. "స్పిన్ ఎఫెక్ట్" సూక్ష్మ నమూనా డిజైన్ ఫోన్‌కు క్లాసిక్ రూపును తీసుకువచ్చింది.

 

హువావీ అసెండ్ పీ7: పది బెస్ట్ ఫీచర్లు

స్టన్నింగ్ డిస్‌ప్లే

హువావీ అసెండ్ పీ7, 5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్, 445 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, 16:9 రేషియో. స్లిమ్ ఫ్రంట్ లుకింగ్, ఫిజికల్ సాఫ్ట్ కీ వ్యవస్థ మరింత ఆకట్టుకుంటుంది.

 

హువావీ అసెండ్ పీ7: పది బెస్ట్ ఫీచర్లు

అత్యుత్తమ అనుభూతులతో కూడిన స్మార్ట్ మొబైలింగ్

హువావీ అసెండ్ పీ7లో ఏర్పాటు చేసిన ఈజీ టూ యూజ్ ఎమోషన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 2.3 వ్యవస్థ కస్టమైజబుల్ లాక్ ఇంకా ఇన్‌బుల్ట్ హోమ్ స్ర్కీన్‌లతో అత్యుత్తమ అనుభూతులతో కూడిన యూజర్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైలింగ్‌ను చేరువ చేస్తుంది. ఈ సౌకర్యవంతమైన యూజర్ ఇంటర్‌ఫేస్‌లో స్మార్ట్‌ఫోన్ మేనెజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ను సులువుగా పర్సనలైజ్ చేసుకోవచ్చు.

 

హువావీ అసెండ్ పీ7: పది బెస్ట్ ఫీచర్లు

వేగవంతమైన ప్రాసెసర్

2జీబి ర్యామ్‌తో కూడిన శక్తివంతమైన క్వాడ్‌కోర్ 1.8గిగాహెర్ట్జ్ ప్రాసెసర్‌ను హైసిలికాన్ కిరిన్ 910టీ చిప్‌సెట్‌లో ఇన్‌స్టాల్ చేసి  ఫోన్‌లో పొందుపరిచారు. గూగుల్ వీ4.4 కిట్‌‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

 

హువావీ అసెండ్ పీ7: పది బెస్ట్ ఫీచర్లు

రీడిఫైనింగ్ కెమెరా

హువావీ అసెసండ్ పీ7లో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా సోనీ 4వ తరం బీఎస్ఐ సెన్సార్, ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్, ఇమెజ్ స్మార్ట్ 2.0 సాఫ్ట్‌వేర్, ఎఫ్/2.0 అపెర్చర్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. ఈ కెమెరా ద్వారా తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ ఫోటోలను క్యాప్చర్ చేసుకోవచ్చు. అల్ట్రా స్నాప్‌షాట్ ఫీచర్ ద్వారా ఫోటో చిత్రీకరణలో భాగంగా సమయాన్ని మరింత ఆదా చేస్తుంది. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా పానోరామిక్ సెల్ఫీ షూటింగ్‌కు సహకరిస్తుంది. సెల్ఫీ ప్రివ్యూ విండో, బిల్ట్-ఇన్-మిర్రర్ ఫంక్షన్ వంటి సరికొత్త ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఈ ఫ్రంట్ కెమెరా 1080 పిక్సల్ హైడెఫినిషన్ క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

 

హువావీ అసెండ్ పీ7: పది బెస్ట్ ఫీచర్లు

వాయిస్ ఫోటో

ఫోటోలకు మరిన్ని అదనపు హంగులను జోడించే క్రమంలో ‘వాయిస్ ఫోటో' పేరుతో సరికొత్త ఫీచర్‌ను హువావీ తన అసెండ్ పీ7లో ఏర్పాటు చేసింది. ఈ ఫీచర్ ద్వారా ఫోటోలకు 10 సెక్లను ఆడియో క్లిప్‌లను జోడించి అప్‌లోడ్ చేసుకోవచ్చు.

 

హువావీ అసెండ్ పీ7: పది బెస్ట్ ఫీచర్లు

ఇమేజ్ సిగ్నల్ ప్రాససర్

ఫోన్‌లో నిక్షిప్తం చేసిన హువావీ ప్రొప్రైటరీ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ (ఐఎస్‌పీ) కెమెరా వ్యవస్థను నియంత్రిస్తూ అత్యుతమ అవుట్ పుట్‌ను విడుదల చేస్తుంది.

 

హువావీ అసెండ్ పీ7: పది బెస్ట్ ఫీచర్లు

వేగవంతమైన కనెక్టువిటీ

హువావీ అసెండ్ పీ7 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ నెట్‌‌వర్క్ సహాయంతో వేగవంతమైన ఇంటర్నెట్‌ను యూజర్ ఆస్వాదించవచ్చు. సిగ్నల్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే క్రమంలో హువావీ అసెండ్ పీ7 ఫోన్‌లో డ్యుయల్ యాంటీనాను విభిన్నంగా డిజైన్ చేసింది. స్మార్ట్ నెట్‌వర్కింగ్ స్విచింగ్ టెక్నాలజీ నెట్‌వర్క్ కనెక్షన్‌ను స్థిరంగా ఉంచుతూ బ్యాటరీ శక్తిని ఆదా చేస్తుంది.

 

హువావీ అసెండ్ పీ7: పది బెస్ట్ ఫీచర్లు

సుధీర్ఘమైన బ్యాటరీ

హువావీ అసెండ్ పీ7 స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన 2500 ఎమ్ఏహెచ్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ హువావీ ప్రొప్రైటరీ బ్యాటరీ సేవింగ్ టెక్నాలజీని కలిగి సుధీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్‌ను యూజర్‌కు చేరువచేస్తుంది. ఫోన్‌లో ఏర్పాటు చేసిన సూపర్ పవర్ సేవింగ్ మోడ్, బ్యాటరీ శక్తి 10శాతం కన్నా తక్కువకు చేరినపుడు స్ర్కీన్‌ను డిమ్ చేసి బేసిక్ ఫంక్షన్లను మాత్రమే ఎనేబుల్ చేస్తుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

MobileLG G2Samsung Galaxy S4HTC One M8Huawei Ascend P7SONY XPERIA Z2
ConnectivitySingle SIMSingle SIMSingle SIMSingle SIMSingle SIM
Network3G/LTE3G3G/LTE3G/LTE3G/LTE
Operating SystemAndroid 4.2.2Android 4.2.2Android 4.4 (KitKat)Android 4.4 (KitKat)Android 4.4 (KitKat)
Display5.2 inch5 inch5 inch5 inch5.2 inch
Clarity of images, video, wide viewing anglesFull HDFull HDFull HDFull HDFull HD
Pixels per inch (PPI)424441441445424
Processor and Storage2.26 GHz Qualcomm Snapdragon 800 Quad Core ProcessorExynos 5 Octa 5410
Quad-core 1.6 GHz Cortex-A15 & quad-core 1.2 GHz Cortex-A7
2.5 Ghz Quadcore Core Snapdragon 8011.8 Quadcore Cortex-A92.3 Ghz Quadcore
RAM2 GB RAM2 GB RAM2 GB RAM2 GB RAM3 GB RAM
ROM16 GB ROM16 GB ROM16 GB ROM16 GB ROM16 GB ROM
Camera13 MP Camera13 MP CameraUltrapixel Primary Camera13 MP Camera20.7 MP Camera
Panoramic selfie, auto-face enhanecementn.a.n.a.n.a.Yesn.a.
Camera2.1 MP Front Camera2 MP front camera5 MP Secondary Camera8 MP secondary camera2.2 MP Secondary Camera
Click pictures with a soundn.a.n.a.n.a.Yesn.a.
Ultra-fast snapshotn.a.n.a.n.a.Yesn.a.
FlashLED FlashLED FlashDual FlashLED FlashPulsed LED
RecordingFull HD RecordingHD RecordingHD RecordingHD RecordingHD Recording
BatteryLi-Po 3000 mAhLi-Ion 2600 mAhLi-ion 2600 mAhLi-Po 2500 mAh3200 mAh
Weight, thin143 gms, 8.9 mm130gms, 7.9 mm160 gms, 9.4 mm124 gms, 6.5 mm thin163 gms, 8.2 mm
PriceRS.35,499/-Rs.27,950/-Rs.39,490/-Rs.24,799/-Rs.36,925/-

English summary
Here below are few killer reasons that will make you go for Huawei P7. Swirl through..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot