ఆ లిస్ట్‌లోకి మరో పెద్ద తలకాయ్!

Posted By: Super

ఆ లిస్ట్‌లోకి మరో పెద్ద తలకాయ్!

 

 

విండోస్ 8 స్మార్ట్‌‌ఫోన్‌ల రూపకల్పనలో భాగంగా నోకియా ఇంకా హెచ్‌టీసీ బ్రాండ్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ సంస్థ హువావీ (Huawei) వచ్చి చేరింది. ఆసెండ్ డబ్ల్యూ1, డబ్ల్యూ 2 మోడళ్లలో రెండు విండోస్ 8 స్మార్ట్‌ఫోన్‌లను హువావీ రూపొందిస్తున్నట్లు గతంలోనే వార్తలు వినిపించాయి. తాజాగా ‘ఆసెండ్ డబ్ల్యూ1’ మోడల్‌కు చెందిన పలు ఫోటోగ్రాఫ్‌లు ఇంటర్నెట్‌లో తారస పడ్డాయి. ఆ ఛాయాచిత్రాల్లో దర్శనమిచ్చిన డబ్ల్యూ1, ముదురు నీలం రంగులో కనిపించింది. అయితే, నవంబర్ లేదా డిసెంబర్ నాటికి డివైజ్ మార్కెట్ గడప తొక్కనుందని సమాచారం.

మరో వైపు ‘ఆసెండ్ డబ్ల్యూ1’ రూపకల్పనలో భాగంగా హువావీ ఆధునిక స్పెసిఫికేషన్‌లకు ప్రాధాన్యత కలిపించింది. పలు నివేదికలు ఆధారంగా సేకరించన సమాచారం మేరకు ఆసెండ్ డబ్ల్యూ1 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.........

విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,

4 అంగుళాల WVGA డిస్‌ప్లే,

512ఎంబీ ర్యామ్,

4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

డ్యూయర్ కోర్ 1.2గిగాహెడ్స్ సాక్ ప్రాసెసర్,

స్లీక్ ఇంకా ఆకర్షణీయమన డిజైనింగ్,

ధర అంచనా రూ.16,300.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot