హానర్ ఫోన్లకు Android Q,సొంత ఓఎస్‌తో హువాయి దిమ్మతిరిగే షాక్

By Gizbot Bureau
|

గూగుల్ సరికొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ క్యూ ను త్వరలో విడుదల చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఆండ్రాయిడ్ క్యూ ఓఎస్‌ను తమ తమ ఫోన్లలో వినియోగదారులకు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక హువాయి కూడా ఆండ్రాయిడ్ క్యూ ఓఎస్ పొందనున్న తన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను తాజాగా విడుదల చేసింది.

హానర్ ఫోన్లకు Android Q,సొంత ఓఎస్‌తో హువాయి దిమ్మతిరిగే షాక్

 

ఈ కింది జాబితాలో ఉన్న ఫోన్లకు త్వరలోనే ఆండ్రాయిడ్ క్యూ ఆధారిత ఈఎంయూఐ 10 ఓఎస్‌ను హువావే అందివ్వనుంది. మరి ఆ జాబితాలో ఉన్న హువాయి ఫోన్ల వివరాలపై ఓ లుక్కేయండి.

 ఫోన్ల లిస్ట్ ఇదే

ఫోన్ల లిస్ట్ ఇదే

హువాయి పి30 ప్రొ, పి30, మేట్ 20, మేట్ 20 ప్రొ, పోర్షె డిజైన్ హువాయి మేట్ 20 ఆర్‌ఎస్, మేట్ 10, మేట్ 20 లైట్, పి30 లైట్, పి స్మార్ట్ 2019, పి స్మార్ట్ ప్లస్ 2019, పి స్మార్ట్ జడ్, మేట్ 20 ఎక్స్, మేట్ 20ఎక్స్ 5జీ, పి20 ప్రొ, పి20, మేట్ 10 ప్రొ, పోర్షె డిజైన్ హువాయి మేట్ 10, హానర్ 20 ప్రొ, హానర్ 20, హానర్ 20ఐ/20 లైట్, వ్యూ20/వీ20, హానర్ 10, 10 లైట్, హానర్ 8ఎక్స్ ఫోన్లకు త్వరలో ఆండ్రాయిడ్ క్యూ అప్‌డేట్‌ను అందివ్వనున్నారు.

  గూగుల్ ని సవాల్ చేస్తూ సొంత ఆపరేటింగ్‌ సిస్టమ్‌

గూగుల్ ని సవాల్ చేస్తూ సొంత ఆపరేటింగ్‌ సిస్టమ్‌

ఇదిలా ఉంటే చైనాకు చెందిన దిగ్గజ మొబైల్‌ తయారీ కంపెనీ హువాయి గూగుల్‌కు అదిరిపోయే ఝలక్ ఇచ్చింది. గూగుల్ ని సవాల్ చేస్తూ సొంత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తయారు చేసుకుంది. హువాయి డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్) లాంచ్ చేసింది. దీని పేరు హార్మనీ ఓఎస్‌ గా తెలిపింది. కేవలం గూగుల్‌కు మాత్రమే కాకుండా అగ్రరాజ్యం అమెరికాకు సైతం హువాయి అదిరే పంచ్ ఇచ్చింది.

2019 చివరి కల్లా
 

2019 చివరి కల్లా

ఇకపై హువాయి కంపెనీతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఓఎస్ లాంచ్ చేయడం ద్వారా గూగుల్ ఓఎస్ తమకు అవసరం లేదని హువాయి పరోక్ష సంకేతాలు పంపింది. మా కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌.. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తొలి వెర్షన్‌ను 2019 చివరి కల్లా స్మార్ట్‌స్క్రీన్‌ ఉత్పత్తుల్లో అందుబాటులోకి తీసుకువస్తాం. వచ్చే మూడేళ్లలో మా అన్ని ఉత్పత్తుల్లో ఈ ఆపరేటింగ్ సిస్టమే ఉంటుందని కంపెనీ తెలిపింది.

గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్

గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్

ఇదిలా ఉంటే ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ అధిక భాగం గూగుల్ తయారు చేసింది. దాదాపు 99 శాతం ఫోన్లలో గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఉంటుంది. ఆపిల్ ఫోన్లలో ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. కాగా ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చైనా కంపెనీల హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ కంపెనీలన్నీ Huawei OS ఉపయోగిస్తే అప్పుడు గూగుల్‌కు పెద్ద ఎదురుదెబ్బ తప్పదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
List of HUAWEI and HONOR devices that are confirmed to get EMUI 10 Android Q update

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X