హువావీ ‘హానర్ హోళీ’, రూ.6,999కే భారీ ఫీచర్ల ఫోన్

|

చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ హువావీ తన హానర్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో మార్కెట్ విస్తరణ చేపడుతోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లలో ఈ బ్రాండ్ అందిస్తోన్న క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లకు వినియోగదారుల నుంచి పాజిటివ్ స్పందన లభిస్తోంది. వివిధ ధర వేరియంట్‌లలో లభ్యమవుతోన్న హువావీ స్మార్ట్‌ఫోన్‌లు సామ్‌సంగ్, మోటరోలా, యాపిల్ తదితర ప్రముఖ బ్రాండ్‌ల ఫోన్‌లకు ధీటైన సవాళ్లను విసురుతున్నాయి.

ఇటీవల హానర్ 6 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చి రూ.20,000 ధర సెగ్మెంట్‌లో ఘన విజయాన్ని అందుకున్న హువావీ తాజాగా రూ.10,000 ధర పరిధిలో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘హానర్ హోళీ' (Honor Holly)పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌ను రూ.6,999 ధర ట్యాగ్‌తో ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

అద్భుతంగా డిజైన్ కాబడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 720 x 1280పిక్సల్స్), క్వాడ్‌కోర్ 1.3గిగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, లై-ఐయోన్ 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

డివైస్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే 3జీ 21 ఎంబీపీఎస్ హెచ్‌ఎస్‌డీపీఏ, 5.76 ఎంబీపీఎస్ హెచ్‌యూపీఏ, 2జీ జీఎస్ఎమ్ 900/1800/1900 మెగాహెర్ట్జ్ (డ్యుయల్ సిమ్), వై-ఫై 802.11 బీ/జీ/ఎస్, బ్లూటూత్ వీ4, ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్బీ వీ2.

ఈ క్రిస్మస్ ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని ఓ సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకునేవారికి హువావీ హానర్ హోళీ ఓ ఉత్తమ ఎంపిక. ఈ ఫోన్‌లోని పలు ప్రత్యేక లక్షణాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

హువావీ ‘హానర్ హోళీ’  దమ్మున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

హువావీ ‘హానర్ హోళీ’ దమ్మున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

డ్యూరబుల్ ఫారమ్ ఫాక్టర్

హువావీ హానర్ హోళీ ఫోన్ పటిష్టమైన సాలిడ్ కర్వుడ్ బ్యాక్‌తో కూడిన 68% స్ర్కీన్ టూ బాడీ నిష్పత్తిని కలిగి ఉంది. ఈ కాంపాక్ట్ ఫోన్ తక్కువ బరువును కలిగి ఉండటమే కాకుండా సన్నటి శరీరాకృతిని కలిగి ఉంటుంది. హైక్లాస్ కోటింగ్ ఫోన్ లుక్‌‌ను మరింత క్లాసికల్‌గా తిర్చిదిద్దింది.

 

హువావీ ‘హానర్ హోళీ’  దమ్మున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

హువావీ ‘హానర్ హోళీ’ దమ్మున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

అదిరిపోయే కెమెరా

సామ్‌సంగ్ బీఎస్ఐ సెన్సార్‌తో కూడిన 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరాను హువావీ హోళీ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. ఎఫ్2.0 వెడల్పు ఎపర్చర్, 5 సెట్ల ఆప్టికల్ లెన్స్, టూ సైడెడ్ ట్రాన్స్‌పెరెంట్ ఫాయిల్, ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. సెల్పీలను చిత్రీకరించుకునేందుకు 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాను ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసారు. పానోరమిక్ మోడ్, బ్యూటీ మోడ్, హెచ్‌డీఆర్ మోడ్, కంటిన్యూస్ షాట్, సీన్ మోడ్, వీడియో స్టెబిలైజర్ వంటి కస్టమైజిడ్ ఫీచర్లు ఈ కెమెరా వ్యవస్థలో నిక్షిప్తం చేసారు.

 

హువావీ ‘హానర్ హోళీ’  దమ్మున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

హువావీ ‘హానర్ హోళీ’ దమ్మున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

ఆకట్టుకునే డిస్‌ప్లే

హువావీ హోళీ స్మార్ట్‌ఫోన్ 5 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషిన్ ఐపీఎస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే ద్వారా అద్భుతమైన ఇమేజ్ క్వాలిటీతో పాటు మన్నికైన వెడల్పు వీక్షణా కోణాలను యూజర్ ఆస్వాదించవచ్చు. ఓటీపీ సింగిల్ స్ర్కీన్ కాలిబ్రేషన్ టెక్నిక్ ఉత్తమ హైడెఫినిషన్ కలర్స్‌తో పాటు వేగవంతమైన 3డీ గేమ్ ఇమేజ్ ప్రాసెసింగ్‌ను చేరువచేస్తుంది. ఈ ఫోన్‌లో హైడెఫినిషన్ సినిమాలను సౌకర్యవంతంగా వీక్షించవచ్చు.

 

హువావీ ‘హానర్ హోళీ’  దమ్మున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

హువావీ ‘హానర్ హోళీ’ దమ్మున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

హైస్పీడ్ ప్రాసెసింగ్

28 ఎన్ఎమ్ ఎన్క్యాప్సులేషన్ టెక్నాలజీతో కూడిన 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను హువావీ హానర్ హోళీ స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసారు. హైస్పీడ్ పనితీరును ఈ ప్రాసెసర్ కనబరుస్తుంది. 1జీబి ర్యామ్, ఫోన్ సమర్థతను మరింతగా పెంచుతుంది.

 

హువావీ ‘హానర్ హోళీ’  దమ్మున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

హువావీ ‘హానర్ హోళీ’ దమ్మున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ

హువావీ హానర్ హోళీ స్మార్ట్‌ఫోన్ డ్యుయల్ సిమ్ స్లాట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్లాట్‌లలో 3జీ ఇంకా 2జీ సిమ్‌లను వినియోగించుకోవచ్చు. డబ్ల్యూసీడీఎమ్ఏ, జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

 

హువావీ ‘హానర్ హోళీ’  దమ్మున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

హువావీ ‘హానర్ హోళీ’ దమ్మున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం

100 సిస్టమ్ ఆప్టిమైజేషన్లను సమకూర్చే ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై హానర్ హోళీ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. కొత్త విడ్జెట్స్ ఇంకా వై-ఫై డిస్‌ప్లేతో కూడిన ఇంటర్‌ఫేస్ ఆకట్టుకుంటుంది.

 

హువావీ ‘హానర్ హోళీ’  దమ్మున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

హువావీ ‘హానర్ హోళీ’ దమ్మున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

మన్నికైన బ్యాటరీ వ్యవస్థ

హానర్ హోళీ స్మార్ట్‌ఫోన్ 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. బ్యాటరీ లైఫ్ సామర్థ్యం 24 గంటలు. ఫోన్‌లో ఏర్పాటు చేసిన హువావీ స్మార్ట్‌పవర్ 2.0 టెక్నాలజీ సీపీయూ కాంపోనెంట్‌లను తక్కువ బ్యాటరీని వినియోగించుకునేలా చేసి 30శాతం వరకు బ్యాటరీ శక్తిని ఆదా చేస్తుంది.

 

హువావీ ‘హానర్ హోళీ’  దమ్మున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

హువావీ ‘హానర్ హోళీ’ దమ్మున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

పటిష్టమైన సిగ్నల్ వ్యవస్థ

బలమైన సిగ్నల్‌ను అందుకోవటం, సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో స్థిరమైన కాల్స్‌ను అందించటం వంటి ప్రత్యేకతలు హువావీ హోళీ ఫోన్‌లో ఉన్నాయి. ఫోన్‌లోని హాఫ్-షీల్డ్ మెటల్ ప్లేట్ డివైస్ సిగ్నల్‌ను భూగర్భ గ్యారేజీలు ఇంకా ఇతర స్పాటీ ప్రాంతాల్లో ఉన్నప్పటికి ఏ మాత్రం తగ్గనివ్వదు.

 


Huawei Honor HollySamsung Galaxy Core 2 SM-G355HZWDINUSony Xperia MXiaomi Redmi 1SMoto E
Camera8 MP Camera +2 MP Secondary Camera5 MP Camera+0.3 MP Secondary Camera5 MP Camera+0.3 MP Secondary Camera8 MP Camera+1.6 MP Secondary Camera5 MP Camera +no Front camera available
Display5 inch, HD Display4.5 inch, WVGA display4 inch, FWVGA display4.7 Inch HD display4.3 inch HD display
Processor and Storage1.3 Ghz Quad Core, 1 GB RAM+16 GB ROM1.2 Ghz Quad Core, 768 MB+4GB ROM1 Ghz Quad Core, 1 GB RAM+4 GB ROM1.6 GHz Quad Core, 1GB RAM + 8GB ROM1.2 Ghz Dual Core Snapdragon, 1 GB RAM+ 4GB ROM
ConnectivityDual SIM, 3GDual SIM, 3GSingle SIM, 3GDual SIM, 3GDual SIM, 3G
Operating SystemAndroid 4.4 (KitKat)Android 4.4 (KitKat)Android 4.1 (Jelly Bean)Android 4.3 (Jelly Bean)Android 4.4.2 (KitKat)
Price69997,999 /-9,979 /-59996999
Best Mobiles in India

English summary
Here are 8 reasons supporting why you should buy a power house like Huawei Honor Holly
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X