Huawei నుంచి మరో సంచలన స్మార్ట్‌ఫోన్

|

2017 అనేక కొత్త స్మార్ట్‌పోన్ ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. యాపిల్, సామ్‌సంగ్, మోటరోలా, ఎల్‌జీ, హెచ్‌టీసీ, షియోమి, హువావే, సోనీ వంటి దిగ్గజ కంపెనీలు వినూత్న ఫీచర్లతో కూడిన తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసేసాయి.

Huawei Honor V10 leaked: Another bezel-less phone on the way

ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే bezel-less స్ర్కీన్‌లతో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఆదరణను బట్టి చూస్తుంటే 2018లో లాంచ్ కాబోయే ప్రతి పోన్ బీజిల్-లెస్ స్ర్కీన్ కలిగి ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బీజిల్-లెస్ స్ర్కీన్‌తో వచ్చే ఫోన్ ముందు భాగం దాదాపుగా డిస్‌ప్లేతో కవర్ అయి ఉంటుంది. అంచులు అనేవి చాలా సన్నగా ఉంటాయి. ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 8, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8, ఎల్‌జీ జీ7, ఎసెన్షియల్ ఫోన్, షిమోమి ఎంఐ మిక్స్ వంటి స్మార్ట్‌ఫోన్‌లు bezel-less స్ర్కీన్‌లతో వస్తున్నాయి.

త్వరలోనే వీటికి పోటీగా చైనా ఫోన్‌ల కంపెనీ హువావే (Huawei) తన హానర్ సిరీస్ నుంచి మొదటి bezel-less ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోన్నట్లు తెలుస్తుంది. Honor V10 పేరుతో రూపుదిద్దుకుంటోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను 2018 మొదటి క్వార్టర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.

తాజాగా, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫ్రంట్ ప్యానల్ ఇంటర్నెట్‌లో లీక్ అయ్యింది. ప్రముఖ చైనా పబ్లికేషన్ Anzhuo.cn ఈ ఫోటోను లీక్ చేసింది. ఈ ఫోటోను బట్టి చూస్తుంటే Honor V10 స్మార్ట్‌ఫోన్ సన్నని అంచులతో కూడిన ఫ్లాట్ ఫ్రంట్ ప్యానల్‌తో రాబోతోంది.

Sim Card, IMEI నంబర్లు మారిస్తే 3ఏళ్లు శిక్ష తప్పదు !Sim Card, IMEI నంబర్లు మారిస్తే 3ఏళ్లు శిక్ష తప్పదు !

ఫోన్ పై అంచు భాగంలో సెల్ఫీ కెమెరా, ఎల్ఈడి ఫ్లాష్, లైట్ సెన్సార్స్ ఇంకా ఇయర్ పీస్‌లను అకామిడేట్ చేసినట్లు తెలుస్తోంది. ఫోన్ క్రింది అంచు భాగంలో ఒక్క ఫిజికల్ హోమ్ బటన్‌కు మాత్రమే చోటు కల్పించినట్లు తెలుస్తోంది. ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో అటాచ్ అయి ఉండే ఈ హోమ్ బటన్‌ను అనేక పనులకు ఉపయోగించుకునే వీలుంటుంది.

ఫోన్ ప్యానల్‌కు సంబంధించి రైట్ సైడ్ అలానే లెఫ్ట్ సైడ్ భాగాల్లో ఏర్పాటు చేసిన అంచులు చాలా సన్నగా ఉన్నాయి.Honor V10 ఫోన్‌కు సంబంధించి ఫ్రంట్ ప్యానల్ పోర్షన్‌తో పాటు పలు కీలక స్పెసిఫికేషన్‌లు కూడా వెబ్ మీడియాలో లీక్ అయ్యాయి. హువావే సొంతంగా అభివృద్ది చేసుకున్న Kirin 970 ప్రాసెసర్ పై ఈ ఫోన్ రన్ అయ్యే అవకాశముంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్‌లను పూర్తి చేయగలిగే అత్యాధునిక సాంకేతికతను ఈ చిప్‌సెట్ లో పొందుపరిచినట్లు సమాచారం. Honor V9కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా రాబోతోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే రివీల్ అయ్యే అవకాశముంది.

Best Mobiles in India

English summary
Huawei Honor V10 leaked: Another bezel-less phone on the way. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X