హువాయి కొత్త స్మార్ట్‌ఫోన్ కెమెరా చూస్తే ఆశ్చర్యపోతారు

By Gizbot Bureau
|

ప్రపంచంలో రెండో అత్యంత పెద్ద మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ, చైనా దిగ్గజం హువాయి సంచలనపు ఫోన్లతో దూసుకుపోతోంది. ఇందులో భాగంగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. శాంసంగ్ నోట్ 10 ఫోన్‌కు పోటీగా హువాయి మేట్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుందని నివేదికలు వెలువడుతున్నాయి.

Huawei Mate 30 Pro to feature two 40MP cameras

ఇందులో రెండు 40 ఎంపీ కెమెరాలు ఉండొచ్చనే ఉహాగానాలు మార్కెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక మూడో కెమెరా 8 ఎంపీ సెన్సర్ కలిగి ఉండొచ్చని సమాచారం. వీటిల్లో సినీ లెన్స్, 5ఎక్స్ జూమ్ వంటి ఫీచర్లకు అవకాశముంది.

వై9 ప్రైమ్ 2019

వై9 ప్రైమ్ 2019

కాగా కంపెనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ వై9 ప్రైమ్ 2019ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.15,990 ధరకు ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై పలు ఆఫర్లను కూడా అందివ్వనున్నారు. ఈ ఫోన్‌ను నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసే సౌకర్యం కల్పిస్తున్నారు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్‌ను కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. అమెజాన్ పే ద్వారా కొంటే రూ.500 డిస్కౌంట్ ఇస్తారు. అలాగే జియో కస్టమర్లకు రూ.20వేల విలువైన ప్రయోజనాలు లభిస్తాయి.

 వై9 ప్రైమ్ 2019 ఫీచర్లు

వై9 ప్రైమ్ 2019 ఫీచర్లు

హువావే వై9 ప్రైమ్ 2019 స్మార్ట్‌ఫోన్‌లో 6.59 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

హువావే పి30 ప్రొ ఫీచ‌ర్లు
 

హువావే పి30 ప్రొ ఫీచ‌ర్లు

హువాయి ఈ మధ్య లాంచ్ చేసిన హువావే పి30 ప్రొ ఫీచ‌ర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

6.47 ఇంచ్ పుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ హెచ్‌డీఆర్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌, హువావే కైరిన్ 980 ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్‌, 128/256/512 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 40, 20, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెఎరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐపీ 68 వాట‌ర్, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4200 ఎంఏహెచ్ బ్యాట‌రీ, సూప‌ర్ ఫాస్ట్ చార్జింగ్‌.

 

5జీ సాంకేతికత

5జీ సాంకేతికత

ఇదిలా ఉంటే మొబైల్ ఫోన్ల నెట్‌వర్క్‌లో మరో విప్లవంగా భావిస్తున్న 5జీ సాంకేతికతను అందించేందుకు వివిధ దేశాలతో హువాయి సంస్థ చర్చలు జరుపుతోంది. డ్రైవర్ రహిత కార్లతో సహా అనేక భారీ వ్యవస్థల్లో ఈ కొత్త సాంకేతికతను వినియోగించవచ్చు.

Best Mobiles in India

English summary
Huawei Mate 30 Pro to feature two 40MP cameras

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X