Huawei కొత్త ఫోల్డబుల్ ఫోన్ 'మేట్ X2' ఫీచర్స్, ధరల మీద ఓ లుక్ వేయండి...

|

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువాయి ఇప్పటికే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఇప్పుడు కొత్తగా తన యొక్క తాజా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ - మేట్ X2 ను చైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేసింది. ఇప్పటి వరకు విడుదల చేసిన అవుట్ వర్డ్- ఫోల్డబుల్ డిజైన్ తో కాకుండా తాజా హువాయి మేట్ X2 యొక్క ఫోల్డబుల్ రెండవ స్క్రీన్ శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ వలె ఇన్ వర్డ్-ఫోల్డబుల్ డిజైన్ తో విడుదల అయింది. ఈ కొత్త ఫోన్ యొక్క కీలు ఫైబర్ మరియు స్టీల్‌తో తయారు చేయబడి ఉండి 2100MPa కంటే ఎక్కువ ఒత్తిడిని తట్టుకోగలదని సంస్థ పేర్కొంది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్ మరియు సింగిల్ సెల్ఫీ షూటర్‌తో మరియు రెండు ర్యామ్ + స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో నాలుగు కలర్ ఆప్షన్స్ తో అందించబడే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

హువాయి మేట్ X2 ధరలు

హువాయి మేట్ X2 ధరలు

హువాయి మేట్ X2 ఫోల్డబుల్ ఫోన్ రెండు వేరియంట్‌లలో విడుదల అయింది. ఇందులో 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర CNY 17,999 (సుమారు రూ.2.01 లక్షలు), 8GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర CNY18,999 (సుమారు రూ. 2,12 లక్షలు). ఇది బ్రైట్ బ్లాక్, ఐస్ క్రిస్టల్ బ్లూ, ఐస్ క్రిస్టల్ పౌడర్ మరియు వైట్ గ్లేజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రస్తుతం విమాల్ ద్వారా ప్రీ-ఆర్డర్లకు సిద్ధంగా ఉంది మరియు ఫిబ్రవరి 25 నుండి దేశంలో అమ్మకం జరుగుతుంది.

హువాయి మేట్ X2 స్పెసిఫికేషన్స్

హువాయి మేట్ X2 స్పెసిఫికేషన్స్

హువాయి మేట్ X2 ఫోల్డబుల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 EMUI 11.0 తో రన్ అవుతుంది. ఫోన్‌ ఫోల్డ్ చేసిన తరువాత 6.45-అంగుళాల OLED డిస్ప్లే 1,160x2,700 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 456ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. అలాగే ఫోల్డ్ చేయక మునుపు 8-అంగుళాల OLED డిస్ప్లేను 2,200x2,480 పిక్సెల్స్, 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 413ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ ఆక్టా-కోర్ కిరిన్ 9000 SoC మరియు మాలి-జి 78 GPU ను కలిగి ఉండి 8GB RAM మరియు 512GB వరకు స్టోరేజ్ తో జతచేయబడి ఉంటుంది. ఇందులో గల నానో మెమరీ కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది.

హువాయి మేట్ X2 కెమెరా సెటప్‌

హువాయి మేట్ X2 కెమెరా సెటప్‌

హువాయి మేట్ X2 ఫోల్డబుల్ ఫోన్ యొక్క కెమెరాల విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 1.9 లెన్స్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు ఎఫ్ / 2.2 లెన్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతు, అల్ట్రా-వైడ్ యాంగిల్ ‌తో 16 మెగాపిక్సెల్ సెన్సార్, ఎఫ్ / 2.4 ఎపర్చరు మరియు ఓఐఎస్ మద్దతుతో 12 మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్, మరియు ఎఫ్ / 4.4 ఎపర్చరు, ఓఐఎస్ మరియు 10x ఆప్టికల్ జూమ్‌తో 8 మెగాపిక్సెల్ సూపర్ జూమ్ కెమెరా ప్యాక్ చేయబడి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.2 లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాను కలిగి ఉంది.

హువాయి మేట్ X2 కనెక్టివిటీ ఫీచర్స్

హువాయి మేట్ X2 కనెక్టివిటీ ఫీచర్స్

హువాయి మేట్ X2 ఫోల్డబుల్ ఫోన్ లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జిపిఎస్, NFC మరియు ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో గ్రావిటీ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్) సెన్సార్, బేరోమీటర్, గైరోస్కోప్, దిక్సూచి, యాంబియంట్ లైట్ సెన్సార్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. అలాగే ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇది 55W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతిచ్చే 4,500Ah బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. కొలతల పరంగా ఫోన్ ముడుచుకున్న స్థితిలో 161.8x74.6x14.7 మిమీ మరియు దాని విప్పబడిన స్థితిలో 161.8x145.8x8.2 మిమీ కొలతలతో వస్తుంది.

Best Mobiles in India

English summary
Huawei Mate X2 Foldable Smartphone Released: Price, Specs, Features and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X