ఇండియాకి హువాయి నుంచి కిరిన్ ఎ1 చిప్

By Gizbot Bureau
|

చైనా దిగ్గజం హువాయి ఈ వారం భారతదేశంలో తన కిరిన్ A1 చిప్‌సెట్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. ఈ మేరకు మీడియాకు ఆహ్వానం పంపింది. దీని ప్రకారం "భారతదేశంలో కొత్త పర్యావరణ వ్యవస్థను సృష్టించాలని" కంపెనీ కోరుకుంటుంది. అయితే హువాయి ఖచ్చితంగా ఎప్పుడు విడుల చేయాలనుకుంటున్నది మాత్రం ధృవీకరించనప్పటికీ, రాబోయేది మాత్రం కొత్త కిరిన్ ఎ 1 చిప్‌సెట్‌ అని తెలుస్తోంది. హువాయి త్వరలో కిరిన్ ఎ 1-శక్తితో కూడిన ఫ్రీబడ్స్ 3 మరియు వాచ్ జిటి 2 వంటి పరికరాలను కూడా త్వరలో విడుదల చేయనుందని తెలుస్తోంది.

కొత్త కిరిన్ ఎ 1 చిప్‌సెట్‌

కొత్త కిరిన్ ఎ 1 చిప్‌సెట్‌

కాగా కంపెనీ హువాయి కొత్త కిరిన్ ఎ 1 చిప్‌సెట్‌ను సెప్టెంబర్‌ 2019లో ఐఎఫ్‌ఎ ఈవెంట్లో ప్రకటించింది. చిప్‌సెట్ ఎయిర్‌పాడ్స్‌కు శక్తినిచ్చే ఆపిల్ యొక్క హెచ్ 1 ప్రాసెసర్‌కు ప్రత్యర్థి అని తెలుస్తోంది. కిరిన్ ఎ 1 బ్లూటూత్ 5.1 కు మద్దతు ఇచ్చే ప్రపంచంలో మొట్టమొదటి హెడ్‌ఫోన్-సెంట్రిక్ ప్రాసెసర్ గా దీన్ని చెప్పవచ్చు. 

అల్ట్రా హై-డెఫినిషన్ ఆడియో అవుట్‌పుట్‌

అల్ట్రా హై-డెఫినిషన్ ఆడియో అవుట్‌పుట్‌

ఇది ఇతర విషయాలతోపాటు తక్కువ జాప్యం మరియు అల్ట్రా హై-డెఫినిషన్ ఆడియో అవుట్‌పుట్‌ను కూడా అందిస్తుంది. కిరిన్ SoC ఈ వారంలో భారతదేశంలో ప్రారంభించబడుతుందని న్రముఖ టెక్ మీడియా 92 మొబైల్స్ రిపోర్ట్ చేసింది.

వృత్తాకార ఛార్జింగ్ కేసులో
 

వృత్తాకార ఛార్జింగ్ కేసులో

కిరిన్ ఎ 1 చిప్‌సెట్ ఫ్రీబడ్స్ 3కి మంచి క్తినిస్తుంది, ఇవి ప్రపంచంలోని మొట్టమొదటి ఓపెన్-ఫిట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్‌లు. ANC మరియు ఓపెన్-ఫిట్ డిజైన్‌ను అందించడంతో పాటు, ఫ్రీబడ్స్ 3 కూడా 190ms లేటెన్సీతో వస్తోంది. ఫ్రీబడ్స్ 3 వృత్తాకార ఛార్జింగ్ కేసులో వస్తుంది, ఇది ఇయర్‌బడ్స్‌ యొక్క బ్యాటరీ జీవితాన్ని 4 గంటల నుండి 20 గంటల వరకు పొడిగించగలదు.

సుమారు రూ .17,500

సుమారు రూ .17,500

కిరిన్ A1 SoC చేత శక్తినిచ్చే మరో గాడ్జెట్ వాచ్ జిటి 2ని కూడా కంపెనీ విడుదల చేస్తోంది. హువాయి వాచ్ జిటి 2 స్మార్ట్‌వాచ్‌ను కంపెనీ సెప్టెంబర్‌లో లాంచ్ చేసింది, ఇది 14 రోజుల బ్యాటరీ జీవితాన్ని ఇది ఆందిస్తుంది. ఇది 46 మిమీ మరియు 42 ఎంఎం డయల్ సైజులలో వస్తుంది మరియు వృత్తాకార OLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. వాచ్ జిటి 2 42 ఎంఎం ధర యూరో 229 (సుమారు రూ .17,500) కాగా, 46 ఎంఎం వేరియంట్ ధర యూరో 249 (సుమారు రూ. 19,500).

పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి..

పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి..

భారతదేశంలో తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి హువాయి చాలా ఆసక్తి చూపిస్తోంది. ఇది ఈఏడాది మార్చిలో తిరిగి వాచ్ జిటి, బ్యాండ్ 3 ప్రో మరియు బ్యాండ్ 3 ఇలను భారతదేశంలో విడుదల చేసింది, కాబట్టి 2019 ముగిసేలోపు కంపెనీ ఫ్రీబడ్స్ 3 మరియు వాచ్ జిటి 2 లను విడుదల చేసి భారతదేశంలోని తన పోర్ట్‌ఫోలియోకు విస్తరించే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Huawei may bring Kirin A1 chip to India this week, FreeBuds 3 launch could follow

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X