బ్రైట్ బ్లాక్ కలర్ లో హువాయి పి10 ప్లస్!

By: Madhavi Lagishetty

ప్రముఖ చైనా సంస్థ అయినా హువాయి తాజాగా మార్కెట్లోకి సరికొత్త ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. బ్రైట్ బ్లాక్ గా పిలువబడే కొత్త రంగు స్మార్ట్ ఫోన్ నిగనిగలాడే రూపాన్ని ఇస్తుంది.

బ్రైట్ బ్లాక్ కలర్ లో హువాయి పి10 ప్లస్!

హువాయి పి10 ప్లస్ ఆర్కిటిక్ వైట్, ప్రెస్టీజ్ గోల్డ్ , గ్రీన్సీ, డాజ్లింగ్ బ్లూ, గ్రాఫైట్ బ్లాక్, డాజ్లింగ్ గోల్డ్, రోజ్ గోల్డ్, మూన్లైట్ సిల్వర్ వంటి రంగుల్లో లభిస్తుందని సంస్ధ ప్రకటించింది. గ్రాఫైట్ బ్లాక్ వేరియంట్ మరియు బ్రైట్ బ్లాక్ వేరియంట్ మధ్య వ్యత్యాసం ఉంది.

హువాయి పి 10 ప్లస్ ఎండబ్ల్యూసి 2017 ఫిబ్రవరిలో ఆవిష్కరించారు. స్మార్ట్ ఫోన్ 1440 పిక్సెల్స్ రిజల్యూషన్, 5.5అంగుళాల క్యూహెచ్ డి డిస్ ప్లే ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో ఉంది.

2.3గిగా ఆక్టా కోర్, 960ప్రొసెసర్ మాలీ జి71 ఎంపి8 గ్రాఫిక్స్ తో టాప్ ప్లేస్ లో ఉంది. రెండు వేరియంట్లలో మెమెరీ ని కలిగి ఉంది.

రూ.20 రీఛార్జ్ పై కూడా ఫుల్ టాక్‌టైమ్

4జిబి ర్యామ్ మరియు 64జిబి స్టోరేజీ కెపాసిటి కలిగి ఉంది. 6జిబి ర్యామ్ 128జిబి ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. మైక్రో ఎస్డి కార్డును రెండు మోడళ్లలో 256జిబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్ 7.0నూగట్ ఎమోషన్ యుఐ 5.0తో టాప్ ప్లేస్ లోఉంది. హువాయి పి10 ప్లస్ డ్యుయల్ ఎల్ఈడి , pdaf ,hdr,4k వీడియో రికార్డింగ్ తో 20మెగాపిక్సెల్ , 12మెగాపిక్సెల్ డ్యుయల్ లెన్స్ లైకా వెనక కెమెరా ఆప్టిక్స్ అలంకరించబడింది. Fhd 1080పి వీడియో రికార్డింగ్ కోసం 8మెగాపిక్సెల్ లైక్ సెల్ఫీ కెమెరా ఉంది.

హువాయి పి10 3,750ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీకి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటి 4.5జి ఎల్టీఈ స్మార్ట్ ఫోన్ ఇది. అంతేకాదు శక్తివంతమైన కనెక్టివిటీని కలిగి ఉంది. హువాయి పి10ప్లస్ కొత్త బ్రైట్ బ్లాక్ వేరియంట్ ఈరోజు నుంచి చైనాలో 4,888యువాన్లకు అమ్మకాలు జరుగుతున్నయి. ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలపై ఇంకా ఎలాంటి సమచారం లేదు.

Read more about:
English summary
To recall, the Huawei P10 Plus was unveiled back in February at the MWC 2017.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot