ట్రిపుల్ రేర్ ఫేసింగ్ కెమెరాలతో Huawei P20 స్మార్ట్‌ఫోన్

Posted By: BOMMU SIVANJANEYULU

2018లో హువావే (Huawei) బ్రాండ్ నుంచి లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన రూట్ మ్యాప్ ఒకటి వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ రూట్ మ్యాప్ ప్రకారం కొత్త ఏడాది మొదటి క్వార్టర్ పూర్తి అయ్యేనాటికి మూడు 'పీ’ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను హువావే లాంచ్ చేయబోతోంది. హువావే పీ20, హువావే పీ20 ప్లస్, హువావే పీ20 ప్రో మోడల్స్‌లో ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది.

ట్రిపుల్ రేర్ ఫేసింగ్ కెమెరాలతో Huawei P20  స్మార్ట్‌ఫోన్

Huawei P10 స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా రాబోతోన్న Huawei P20 ఏకంగా మూడు రేర్ ఫేసింగ్ కెమెరాలను కలిగి ఉంటుందట. యాపిల్ ఫేస్ ఐడీ కంటే శక్తివంతమైన ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఈ ఫోన్‌లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో ఎక్విప్ చేసిన సామ్‌సంగ్ 6.01 ఇంచ్ డిస్‌ప్లే ఐఫోన్ ఎక్స్ తరహాలోనే ఫుల్ స్ర్కీన్‌ను ఆఫర్ చేస్తుందట. ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టంతో ప్రీ-ఇన్‌స్టాల్ కాబడిన ఈ డివైస్ యునికార్న్ 970 ప్రాసెసర్ పై రన్ అవుతుందని సమాచారం.

మరో మోడల్ P20 Plus కూడా కైరిన్ 970 ప్రాససర్ పై రన్ అవుతుందని తెలుస్తోంది. మూడవ మోడల్ అయిన P20 Pro శక్తివంతమైన కైరిన్ 975 ప్రాససర్ పై స్పందిస్తుందట. 6జీబి ర్యామ్ సామర్థ్యంతో రాబోతోన్న ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు వివిధ స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.

గత రెండు సంవత్సరాలుగా హువాయి, యాపిల్ బ్రాండ్‌ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. పోటాపోటీగా ఈ బ్రాండ్‌ల నుంచి కొత్త ఫోన్‌లు లాంచ్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో హువాయి బ్రాండ్ నుంచి రాబోతోన్న పీ20, పీ20 ప్లస్, పీ20 ప్రో స్మార్ట్‌‌ఫోన్‌లకు బీజిల్-లెస్ డిజైన్, రేర్ ట్రిపుల్ కెమెరా సెటప్ వంటి విప్లవాత్మక ఫీచర్లతో సరికొత్త బెంచ్ మార్క్‌ను సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఫేస్ బుక్, వాట్సాప్ సరికొత్త రికార్డు!

ఫ్రంట్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌తో రాబోతోన్న ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లను ఫిబ్రవరిలో జరిగే 2018 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో హేవావే లాంచ్ చేయబోతోంది. చైనా మార్కెట్లో హువావే పీ20 ధర రూ.39,000గా ఉండొచ్చని తెలుస్తోంది.

English summary
The new Huawei flagship will is said to have at least four variants: P20, P20 Plus, P20 Pro and P20 Lite.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot