ఏప్రిల్ 9న మార్కెట్లోకి హువాయి పి30 ప్రొ, ధర ఎంతంటే..
చైనా మొబైల్ మేకర్ హువాయి పీ30 సీరిస్ ను ఇండియాలో అతి త్వరలోనే లాంచ్ చేయబోతోంది. కాగా కంపెనీ మరి కొద్ది రోజుల్లో P30 Proకి సంబంధించిన టీజర్ ని, ఫోన్ ని విడుదల చేయబోతోంది. ఇక మనకు తెలిసిన సమాచారం ప్రకార
చైనా మొబైల్ మేకర్ హువాయి పీ30 సీరిస్ ను ఇండియాలో అతి త్వరలోనే లాంచ్ చేయబోతోంది. కాగా కంపెనీ మరి కొద్ది రోజుల్లో P30 Proకి సంబంధించిన టీజర్ ని, ఫోన్ ని విడుదల చేయబోతోంది. ఇక మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ ఫోన్లు అమెజాన్ ఇండియాలో ఎక్స్క్లూజివ్ గా అందుబాటులోకి రానున్నాయి.

ఈ కామర్స్ వెబ్ సైటు అమెజాన్ దీనికి సంబంధించిన వివరాలను కూడా బహిర్గతం చేసింది, ఏప్రిల్ 9న Huawei P30 Proని ఇండియాలో లాంచ్ చేసినట్లు తెలిపింది. దీంతో పాటు P30 and P30 Lite డివైస్ లను ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హువాయి పీ30 ప్రొ ఫీచర్లు
6.47 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హువావే కైరిన్ 980 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128/562/512 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 40, 20, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఇన్ డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్.

ధర
హువాయి పి30 ప్రొ 8GB/128GB variant ధర చైనాలో 999యువాన్లుగా ఉంది. ఇండియా కరెన్సీలో దాదాపు రూ. 77,800గా ఉంది. 8GB/512GB variant ధర రూ. 97,300గా ఉండే అవకాశం ఉంది. ఇక రెగ్యులర్ వేరియంట్ 6GB of RAM and 128GB of internal storage ధర దాదాపు రూ. 62, 200గా ఉండే అవకాశం ఉంది.

హువాయి పీ30 లైట్
కాగా గత కొద్ది రోజుల క్రితం కెనడాలో హువాయి పీ30 లైట్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ రూ.22,220 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఏప్రిల్ నెల నుంచి లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

హువాయి పీ30 లైట్ ఫీచర్లు
6.15 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2312 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 24, 2, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.


Click it and Unblock the Notifications