నిమిషాల్లో బ్యాటరీ ఫుల్

Posted By:

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ హువావీ (Huawei) నిమిషాల్లో చార్జ్ కాగలిగే క్విక్ - ఛార్జింగ్ బ్యాటరీలను ప్రపంచానికి పరిచయం చేసింది. సాధారణ స్మార్ట్ ఫోన్ బ్యాటరీలతో పోలిస్తే 10 రెట్లు వేగంగా ఈ బ్యాటరీలు చార్జ్ అవుతాయని కంపెనీ చెబుతోంది. కొన్ని నిమిషాల వ్యవధిలో 50శాతం బ్యాటరీ ఛార్జ్ అయ్యే విధంగా సరికొత్త టెక్నాలజీని హువావీ ఈ బ్యాటరీలలో వినియోగించింది. తాము రూపొందించిన క్విక్ - ఛార్జింగ్ లితియమ్ ఐయోన్ బ్యాటరీలకు సంబంధించి రెండు వీడియోలను కూడా కంపెనీ విడుదల చేసింది.

నిమిషాల్లో బ్యాటరీ ఫుల్

వీడియో లింక్ 1 

వీడియో లింక్ 2 

మొదటి వీడియలో 600 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల క్విక్ - ఛార్జింగ్ బ్యాటరీ కేవలం రెండే రెండు నిమిషాల్లో 68 శాతం ఛార్జ్ అవటాన్ని మీరు చూడొచ్చు. మరో వీడియోలో భాగంగా 3000 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ 5 నిమిషాల వ్యవథిలో 48శాతం చార్జ్ అవటాన్ని మీరు చూడొచ్చు. అనేక పరీక్షల తరువాత ఈ క్విక్ ఛార్జింగ్ బ్యాటరీలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

English summary
Huawei Says Its Qucik Charge Batteries Charge 50 Percent in a Few Minutes. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot