Home
News

బెదరని హువాయి, కొత్త ఓఎస్‌తో గూగుల్, ఆపిల్‌కే షాకిస్తోంది

చైనా రంగం దిగ్గజం హువాయి ఈ మధ్య అనేక వివాదాల్లో చిక్కుక్కున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే ప్రపంచంలో రెండవ అతిపెద్ద సరఫరాదారుగా పేరు తెచ్చుకున్న హువాయి అమెరికా దెబ్బకు ఒక్కసారిగా కుదేలైంది. హువాయి

చైనా రంగం దిగ్గజం హువాయి ఈ మధ్య అనేక వివాదాల్లో చిక్కుక్కున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే ప్రపంచంలో రెండవ అతిపెద్ద సరఫరాదారుగా పేరు తెచ్చుకున్న హువాయి అమెరికా దెబ్బకు ఒక్కసారిగా కుదేలైంది. హువాయి కంపెనీపై ఇప్పుడు ముప్పెటదాడి కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో అక్కడి కంపెనీలు వరుసబెట్టి హువాయి కంపెనీతో వ్యాపార సంబంధాలను తెంచుకుంటున్నాయి.

బెదరని హువాయి, కొత్త ఓఎస్‌తో గూగుల్, ఆపిల్‌కే షాకిస్తోంది

టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఇందుకు నాంది పలికింది. ఇదిలా ఉంటే ఇన్ని బెదిరింపులు ఉన్నా హువాయి మాత్రం వీటిని ఏమీ లెక్క చేయడం లేదు. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే గూగుల్ కు భారీ స్థాయిలో షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఎలాగో తెలుసుకుందామా..

వినూత్నమైన ఆపరేటింగ్ సిస్టమ్‌

వినూత్నమైన ఆపరేటింగ్ సిస్టమ్‌

చైనా మొబైల్ మేకర్ హువాయి గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌కు పోటీగా సరికొత్త వినూత్నమైన ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందిస్తోందని చైనా మీడియా పేర్కొంటోంది. సొంతం ఆపరేటింగ్ సిస్టమ్ రూపకల్పనతో హువాయి ఒకేసారి గూగుల్, ఆపిల్ కంపెనీలకు ఝలక్ ఇచ్చేందుకు రెడీ అయింది.

 హాంగ్‌మెంగ్

హాంగ్‌మెంగ్

హువాయి ఓఎస్ పేరు హాంగ్‌మెంగ్ అయ్యి ఉండొచ్చని అక్కడి నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే హువాయి 2012 నుంచే సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తోందని తెలిపాయి. ఈ ఓఎస్ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలోనే క్రమంగా తన ఫోన్లలో ఆండ్రాయిడ్ స్థానంలో ఈ ఓఎస్‌ను అందుబాటులోకి తీసుకువస్తుందని నివేదికలు తెలిపాయి.

 అనేక ఆరోపణలు

అనేక ఆరోపణలు

కాగా అంతర్జాతీయ గూఢచార సంస్థలు, రోబొట్ ఆర్మ్స్‌ల దొంగతనం, నాశనం చేయలేని డైమండ్ కోటెడ్ గ్లాసులు, ఇరాన్‌తో అనుమానాస్పద ఒప్పందాలు తదితర అంశాలకు సంబంధించి ఈ కంపెనీపై అనేక ఆరోపణలు ఉన్నాయి.ఈ ఆరోపణల మధ్య అమెరికా హువాయి కంపెనీని బ్లాక్ లిస్టులో ఉంచింది. గూగుల్ కూడా ఆండ్రాయిడ్ ఓఎస్ నిలిపివేస్తున్నామని తెలిపింది.

గూగుల్ సర్వీసులు

గూగుల్ సర్వీసులు

గూగుల్‌ నిర్ణయంతో హువాయి, హానర్ స్మార్ట్‌ఫోన్లకు రానున్న కాలంలో గూగుల్ సర్వీసులు అందుబాటులో ఉండకపోవచ్చు. గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, గూగుల్ ప్లేస్టోర్ వంటి యాప్స్ వినియోగించుకోలేరు. పాత కస్టమర్లకు వచ్చిన నష్టమేమీ లేదు. కొత్త ఫోన్ల పరిస్థితే అర్థంకావడం లేదని పలువురు చెబుతున్నారు.

ప్లాన్ బి అమలు

ప్లాన్ బి అమలు

హువాయికు గూగుల్ ఝలక్ ఇవ్వడంతో ఆ కంపెనీ ప్లాన్ బి అమలు చేయాలని చూస్తోంది. సొంతంగానే ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశముంది. కంపెనీ ఇప్పటికే ప్రత్యేకమైన ఓఎస్‌పై పనిచేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే భవిష్యత్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌కు పోటీగా హువాయి హాంగ్‌మెంగ్ రానుందని తెలుస్తోంది.

గూగుల్ సేవలు లేని హువాయి

గూగుల్ సేవలు లేని హువాయి

భారత్ సహా దాదాపు అన్ని దేశాల్లో జీ-మెయిల్, యూట్యూబ్, మ్యాప్స్, డ్రైవ్‌లు ఇలా గూగుల్ అందించే సేవలను విస్తృతంగా వినియోగిస్తారు. ఇవి లేని ఫోన్లు చాలా చాలా అరుదు. కాబట్టి గూగుల్ సేవలు లేని హువాయి ఫోన్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపించరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హువాయికు చాలా పెద్ద సమస్య. ఇదే పరిస్థితి కొనసాగితే హువాయి ఫోన్ల తయారీ భారీగా పడిపోవచ్చునని భావిస్తున్నారు.
కేవలం చైనాలో మాత్రమే హువాయి మనుగడ సాగించగలదు. హువాయి పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఈ ఫోన్ పేపర్ వెయిట్‌లా మాత్రమే ఉపయోగపడుతుందని అంటున్నారు. గూగుల్ సేవలు లేని ఫోన్ల వినియోగానికి ఎక్కువ మంది ఆసక్తి చూపరని అంటున్నారు. హువాయి ఫోన్లపై చైనాలో అంతగా ప్రభావం పడదని, కానీ మిగతా దేశాల్లో మాత్రం అమెరికా బ్లాక్ లిస్ట్ ప్రభావం ఉంటుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది.

 

 

వినియోగదారుల ఆందోళన

వినియోగదారుల ఆందోళన

హువాయి ఫోన్లపై గూగుల్ సేవలు నిలిపివేయడంతో ఓ వినియోగదారుడు ట్విట్టర్ వేదికగా తన ఆందోళన వ్యక్తం చేశాడు. తాను పీ30ప్రో ఫోన్ ఉపయోగిస్తున్నానని, నెల రోజుల క్రితమే కొనుగోలు చేశానని ఆందోళన వ్యక్తం చేయగా, గూగుల్ అధికార ప్రతినిధి స్పందిస్తూ... రానున్న 90 రోజులు కూడా హువాయికు తాము అన్ని సేవలు కొనసాగిస్తామని వెల్లడించారు. మే 16వ తేదీకి ముందు గూగుల్ సర్టిఫైడ్ అన్ని హువాయి ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్ యాక్సెస్ ఉంటుందని, ఇతర ప్రీలోడెడ్ యాప్స్, సేవల యాక్సెస్ కూడా ఉంటుందట. ఇది గూగుల్, యూజర్లకు మధ్య ట్రాన్సాక్షన్ అని, కానీ గూగుల్, హువాయికు కాదని వెల్లడించింది. అయితే, సాఫ్ట్వేర్ బగ్స్, గూగుల్ వర్షన్ ఇతర టెక్నికల్ ఫిక్సెస్‌పై కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేదు. దీంతో హువాయి సొంతగా డెవలప్ చేయవలసి ఉంటుంది. మే 16వ తేదీ నుంచి కొనుగోలు చేసిన హువాయి ఫోన్ వినియోగదారులకు గూగుల్ సపోర్ట్ ఉండదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Huawei’s Smartphone OS will Reportedly be Called HongMeng
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X