భారత్ దెబ్బకు కుప్పకూలుతున్న చైనా..ప్రపంచ దేశాల్లో కల్లోలం

Written By:

ప్రపంచ తయారీ రంగంలో అన్ని దేశాలకు సవాల్ విసురుతున్న చైనా ఇప్పుడు భారత్ దెబ్బకు బెంబేలెత్తుతోంది. మొదట్లో అమెరికా సంక్షోభంతో అమెరికా అతలాకుతలమైన నేపథ్యంలో మళ్లీ యూరప్ సంక్షోభం మొత్తం యూరప్ దేశాన్నే గడగడలాడించింది. అదే స్థాయిలో ఇప్పుడు చైనా కూడా గజగజవణికిపోయే పరిస్థితులు రాబోతున్నాయని స్వయంగా చైనా మీడియానే చెబుతోంది. మరి అంతలా చైనా ఎందుకు భయపడుతోందో ఓ సారి చూడండి.

రహస్య మెసేజ్‌లు పంపుకునే ఏకైక యాప్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చైనాకు కొత్త భయం

తయారీ రంగానికి ప్రపంచ హబ్‌గా పేరున్న చైనాకు కొత్త భయం పట్టుకుంది. ఆ భయానికి కారణం మన ఇండియానే. ఎందుకంటే చైనా టెలికం సంస్థలు ఒక్కటొక్కటిగా తమ తయారీ కార్యకలాపాలను భారత్‌కు తరలిస్తున్నాయి.

చైనాలో ఉద్యోగాలపై తీవ్ర స్థాయిలో ప్రభావం

పరిస్థితి ఇలాగే కొనసాగితే చైనాలో ఉద్యోగాలపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడవచ్చని అక్కడి అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ హెచ్చరించింది. ఈ విషయంలో బీజింగ్ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొంది.

చైనా టెలికం దిగ్గజం హువే

చైనా టెలికం దిగ్గజం హువే గతవారం భారత్‌లో ఏర్పాటు చేసిన మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించింది. హువే కంటే ముందు పలు చైనా మొబైల్ కంపెనీలు భారత్‌లో అసెంబ్లింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేశాయి. మరిన్ని కంపెనీలు మన దేశంలో ప్లాంట్లు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయి.

భారత్ తరలిపోతే

చైనాలో ఎన్నో మొబైల్ కంపెనీలలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. మొబైల్ కంపెనీలు అన్ని భారత్ తరలిపోతే నిరుద్యోగ సమస్య ఏర్పడి చైనా ఆర్థికంగా బలహీన పడుతోందని ఆ పత్రిక వెల్లడించింది.

చైనాలో పరిస్థితులు తారుమారు

గడిచిన కొంత కాలంలో చైనాలో కార్మికుల జీతాలు గణనీయంగా పెరిగాయి. దీంతో ఉత్పత్తి వ్యయం కూడా అందుకు తగ్గట్టుగానే పెరిగింది. అయితే ఇప్పుడు ప్లాంట్లు అన్ని ఇక్కడకు రానుండటంతో చైనాలో పరిస్థితులు తారుమారయ్యేలా ఉన్నాయి.

ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి

అయితే భారత్‌లో నిపుణులు చౌకగా లభిస్తుండటంతోపాటు, దేశంలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్‌కు ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు కల్పిస్తుండటంతో చైనా సంస్థలు ఇక్కడ ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయి.

వేల కోట్ల డాలర్ల రుణాలపై

పరిస్థితులు ఎలా ఉన్నా వేల కోట్ల డాలర్ల రుణాలపై నిర్మించిన చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితులు కనిపిస్తుండటంతో అది ఇప్పుడు ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది.

రెండో అతిపెద్ద ఆర్థిక శక్తి

చైనా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక శక్తి కావడంతో చైనా ఆర్థిక రంగం కుప్పకూలితే యావత ప్రపంచంపై దాని ప్రభావం ఉంటుందన్న హెచ్చరికలు వినవస్తున్నాయి. వాస్తవిక స్థితిని దాచే ప్రయత్నం చైనా ప్రభుత్వం చేస్తోందన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి.

ఈ సంవత్సరం ఇంకా దారుణ పరిస్థితులు

అదీగాక గత ఏడాది చైనా జిడిపి వృద్ధి రేటు 6.9 శాతానికి పడిపోయింది. ఈ సంవత్సరం ఇంకా దారుణ పరిస్థితులు ఉంటాయని చైనా ప్రభుత్వమే చెబుతోంది. 

మాజీ ఆర్థిక వేత్త కెన్‌ రొగాఫ్‌

పైగా చైనా ప్రభుత్వం వెల్లడిస్తున్న ఆర్థిక గణాంకాలకు అసలు గణాంకాలకు పొంతన లేదని ఐఎంఎఫ్‌ మాజీ ఆర్థిక వేత్త కెన్‌ రొగాఫ్‌ బిబిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

అప్పుల భారంతో చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినా..

చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే ప్రపంచదేశాలన్నింటిపైనా దాని ప్రభావం ఉంటుందని ఆయన హెచ్చరించారు. భారీగా అప్పులు తెచ్చి ఆర్థిక వృద్ధి సాధించడం ఎప్పుడూ కుదిరే పని కాదని, అప్పుల భారంతో చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినా ఆశ్చర్య పడాల్సిన పని లేదని కెన్‌ రొగాఫ్‌ స్పష్టం చేశారు.

చైనాకు ప్రత్యామ్నాయం ఏమీ లేదని

యూరప్‌, జపాన్‌ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిన సమయంలో కనీసం వారికి తోడుగా చైనా ఉందనీ, ఇప్పుడు చైనాకు ప్రత్యామ్నాయం ఏమీ లేదని ఆయన అన్నారు. భారత ఉందని అంటున్నా, చైనా సైజును చేరుకోవడానికి చాలా కాలం పడుతుందని ఆయన చెప్పారు.

భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది

చైనా ఆర్థిక రంగం కుప్పకూలడానికి ముందే అమెరికా, యూరప్‌ దేశాలు జాగ్రత్తపడాలని లేదంటే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని ఆయా దేశాల ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Huawei to start smartphone production in India from October read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot