గొప్ప ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో హువాయి స్మార్ట్‌వాచ్! అదిరిపోయే ఫీచర్స్
హువాయి కంపెనీ తన కొత్త హువాయి వాచ్ GT యాక్టివ్ ఇప్పుడు ఇండియాలో అందుబాటులో ఉందని సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో హువాయిP30 సిరీస్ ఫోన్‌లతో పాటు ఈ స్మార్ట్‌వాచ్‌ను కూడా ఇండియాలో విడుదల చేశారు. హువాయి యొక్క వాచ్ GT యాక్టివ్ ఈ రోజు నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా మంచి ఆఫర్లతో లభిస్తుంది.

తమ వాచ్ జిటి క్లాసిక్‌కు భారతదేశంలో మంచి స్పందన లభించిందని కంపెనీ పేర్కొంది. ఇండియాలో హువాయి వాచ్ GT యాక్టివ్ ధర కేవలం 15,990రూపాయలు. ఇది ఆండ్రాయిడ్ మరియు iOS పరికరాలకు అనుకూలంగా ఉంటుంది.

స్పెసిఫికేషన్స్:
హువాయి వాచ్ జిటి యాక్టివ్ 46mm కేసును కలిగి ఉంది. మరియు 454x454 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 1.39-అంగుళాల AMOLED హెచ్‌డి డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. కొత్త హువాయి వాచ్ జిటి యాక్టివ్ స్మార్ట్‌వాచ్ తేలికైనదని, ఎక్కువ కాలం ధరించడానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొంది.హువాయి వాచ్ జిటి యాక్టివ్ యొక్క అతిపెద్ద ప్రయోజనం ఒక ఛార్జీపై 'రెండు వారాల వరకు' బ్యాటరీ లైఫ్ వస్తుంది.

బ్యాటరీ లైఫ్ :
స్మార్ట్ వాచ్‌లు కొనుగోలు చేయడం వినియోగదారులకు కొద్దిగా కష్టం అని తన పరిశోధన తేల్చిందని హువాయి సంస్థ పేర్కొంది. ఈ స్మార్ట్ వాచ్‌లో డ్యూయల్-చిప్‌సెట్‌తో పాటు సంస్థ యొక్క అంతర్గత నిర్మితమైన లైట్ OS ఎక్కువ కాలం బ్యాటరీ లైఫ్ న్ని అందించడంలో సహాయపడుతుంది. సాధారణ వినియోగ పరిస్థితులలో వినియోగదారులు హువాయి వాచ్ జిటి యాక్టివ్‌తో మెరుగైన బ్యాటరీ జీవితాన్ని ఆశిస్తారని కంపెనీ తెలిపింది. రోజంతా స్మార్ట్‌వాచ్ ధరించడం ద్వారా మీరు హృదయ స్పందన పనితీరును కనుగొనడం, 90 నిమిషాల వ్యాయామంను సక్రియం చేయడం మరియు వివిధ రకాల నోటిఫికేషన్‌లను దీని ద్వారా సులబంగా కనుగొనవచ్చు.

ఫీచర్స్:
మంచి బ్యాటరీ లైఫ్ తో పాటు హువాయి వాచ్ జిటి యాక్టివ్ హృదయ స్పందన రేటు మరియు నిద్ర పర్యవేక్షణ సామర్థ్యాలను కూడా కలిగి ఉంది. స్వీయ-అభ్యాస అల్గోరిథం ఇండోర్ మరియు ఔట్డోర్ కార్యకలాపాలను గుర్తించగలదు మరియు పర్యవేక్షించగలదు. స్మార్ట్ వాచ్‌లో ట్రయాథ్లాన్ మోడ్ కూడా ఉంది. ఇది ఈత, సైక్లింగ్ మరియు రన్నింగ్‌ను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది.

ట్రాకింగ్ ఫీచర్స్:
హువాయి వాచ్ జిటి యాక్టివ్ కూడా ట్రూస్లీప్ 2.0 మరియు ట్రూసీన్ 3.0 తో వస్తుంది. ట్రూస్లీప్ 2.0 మీ ఆరోగ్యం మరియు నిద్ర విధానాలను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే ట్రూసీన్ 3.0 నిరంతర హృదయ స్పందన పర్యవేక్షణనను అందిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ వాచ్ మీరు బాగా నిద్రపోవడానికి 200 సూచనలను కూడా అందిస్తుంది.

ధర మరియు లభ్యత:
హువాయి వాచ్ జిటి యాక్టివ్ స్మార్ట్ వాచ్ ఫ్లిప్‌కార్ట్‌లో గొప్ప ఆఫర్లతో లభిస్తుంది. ఇది రెండు కలర్ వేరియంట్లలో 15,990రూపాయల ధర వద్ద లభిస్తుంది. ఇది ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఒక సంవత్సరం స్టాండర్డ్ వారంటీతో మరియు 10-రోజుల రీప్లేసెమెంట్ వారంటీతో వస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కొనసాగుతున్న బిగ్ షాపింగ్ డేస్ సేల్స్ లోని అన్ని రకాల ఆఫర్ల ద్వారా వినియోగదారులు ఈ స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేయవచ్చు. ఆఫర్స్ విషయంలో ఫ్లిప్‌కార్ట్ SBI క్రెడిట్ కార్డుల నుండి బండిల్డ్ చేయబడిన అదనపు డిస్కౌంట్లను ఆఫర్ల రూపంలో పొందవచ్చు. అంతేకాకుండా నో-కాస్ట్ EMI ఎంపికల ద్వారా కూడా హువాయి వాచ్ జిటి యాక్టివ్ స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








